సెమీస్ లో ఎవరు ఎవరితో.. భారత్ కు బిగ్ హర్డిల్స్
టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్స్ రేపటి నుండి ఆరంభం కాబోతోన్నాయి. ఇప్పటికే బెర్తులు ఖరారయ్యాయి. వెస్టిండీస్‌తో జరిగిన కీలకమైన సూపర్ ఎయిట్స్ మ్యాచ్‌లో సంజు శాంసన్ అద్భుతమైన, అజేయంగా 97 పరుగులు చేసి భారత్‌ను గెలిపించాడు. ఈ విజయంతో భారత్‌కు సెమీస్ లో అడుగు పెట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా స్వదేశంలో మూడో టీ20 వరల్డ్ కప్‌ను గెలిచి, టైటిల్‌ను నిలబెట్టుకోవాలని పట్టుదలతో ఉంది.
సెమీఫైనల్ మ్యాచ్‌లు..
మొదటి సెమీఫైనల్ బుధవారం సాయంత్రం 7 గంటలకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆరంభమౌతుంది. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. రెండో సెమీస్ గురువారం అదే సమయానికి ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతుంది. భారత్ తో ఇంగ్లాండ్ ఢీ కొట్టబోతోంది.

జట్ల ప్రస్థానం ఇలా..
న్యూజిలాండ్:
గ్రూప్ దశలో ఆఫ్ఘనిస్తాన్, యూఏఈ, కెనడాలను కివీస్ ఓడించింది. దక్షిణాఫ్రికా చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. సూపర్ 8లో పాకిస్తాన్‌తో మ్యాచ్ రద్దవగా, శ్రీలంకపై 61 పరుగుల తేడాతో గెలిచింది. ఇంగ్లాండ్ చేతిలో 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.
దక్షిణాఫ్రికా:
గ్రూప్ దశలో కెనడా, ఆఫ్ఘనిస్తాన్, యూఏఈని ఓడించి వారి ఎదురులేని ప్రయాణం కొనసాగించింది సౌతాఫ్రికా. సూపర్ 8 భారత్, వెస్టిండీస్, జింబాబ్వేను చిత్తు చేసి సెమీస్‌లోకి దూసుకెళ్లింది.
భారత్:
గ్రూప్ దశలో యూఎస్ఏ, నమీబియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్ ను భారత్ ఓడించింది. సూపర్ 8లో దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఓడినప్పటికీ, జింబాబ్వే, వెస్టిండీస్ పై గెలిచి మళ్ళీ పుంజుకుంది.
ఇంగ్లాండ్:
గ్రూప్ దశలో నేపాల్, స్కాట్లాండ్, ఇటలీని ఇంగ్లాండ్ ఓడించింది. వెస్టిండీస్ చేతిలో 30 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. సూపర్ 8లో శ్రీలంక, పాకిస్తాన్, న్యూజిలాండ్ ఓడించి సెమీస్‌లోకి ప్రవేశించింది.
ఫైనల్స్‌లోకి ఎవరు చేరబోతున్నారు?
గత టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లో చివరి క్షణంలో ఏడు పరుగులతో ఓటమి పాలైన దక్షిణాఫ్రికా, ఈసారి టైటిల్ గెలవాలని పట్టుదలతో ఉంది. ప్రస్తుత టోర్నమెంట్‌లో ప్రోటీస్ మాత్రమే అజేయమైన జట్టుగా నిలిచింది. గత రెండు దశల్లో దాదాపు అన్ని మ్యాచ్‌లను ఆ జట్టు గెలిచింది.
దక్షిణాఫ్రికా జట్టు నుండి టాప్ రన్ స్కోరర్‌ల జాబితాలో ఇద్దరు బ్యాటర్లు, అలాగే టాప్ వికెట్ టేకర్ల జాబితాలో ముగ్గురు బౌలర్‌లు ఉన్నారు. ఫామ్, గణాంకాలు ఎయిడెన్ మార్క్ రమ్ నాయకత్వంలోని జట్టును ఫైనల్, అలాగే టైటిల్‌కు బలమైన ఫేవరెట్‌గా నిలిపాయి. నాకౌట్ దశలో తరచుగా ఎదురయ్యే ఒత్తిడిని వారు అధిగమించగలరా అనేది చర్చనీయాంశమైంది.
భారత్ ఈ టోర్నమెంట్‌లో సత్తాకు తగినట్లుగా ఆడట్లేదనేది రుజువు అవుతూ వస్తోంది. చాలాసార్లు కష్టాల్లో పడింది గానీ గట్టెక్కగలిగింది. సమష్టిగా రాణించట్లేదు. బ్యాటింగ్, బౌలింగ్ లో ఒకరిద్దరు ప్లేయర్ల మీదే ఆధారపడుతోంది. అయినప్పటికీ టాప్ క్లాస్ బ్యాటర్లు, బౌలర్లు ఉండటం ప్లస్ పాయింట్. ప్రస్తుత ఛాంపియన్ టైటిల్‌ను నిలబెట్టుకోవడానికి ఫేవరెట్ ఉంది టీమిండియా.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications