వరల్డ్ సెమీ ఫైనల్ చేరేది వాళ్లే-టాప్ 3కీ నో గ్యారంటీ ! శిఖర్ ధావన్ జోస్యం...
భారత్ వేదికగా జరుగున్న ప్రపంచకప్ ప్రథమార్దం ఫూర్తయింది. ద్వితీయార్ధంలోకి టోర్నీ అడుగుపెట్టింది. అయితే ఇప్పటికే వరుస విజయాలతో మూడు జట్లు దాదాపు సెమీ ఫైనల్ బెర్తులు ఖరారు చేసుకున్నాయనే చర్చ జరుగుతోంది. వీరితో పాటు తాజాగా ఫామ్ లోకి వస్తున్న మరో జట్టు కూడా సెమీ ఫైనల్ కు వెళ్లే అవకాశాలున్నాయనే అంచనా ఉంది. అయితే వీరిలో ఎవరికీ సెమీ ఫైనల్ బెర్తు గ్యారంటీ లేదంటూ భారత ఓపెనర్ శిఖర్ ధావన్ బాంబు పేల్చాడు.
ఐసీసీ ప్రపంచకప్ టోర్నీలో సెమీ ఫైనలిస్టులపై తాజాగా ఈ టీమిండియా ఓపెనర్ తన అభిప్రాయాలు నిర్మొహమాటంగా పంచుకున్నాడు. ఇందులో భాగంగా టోర్నీలో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్ లో ఉన్న మూడు జట్లు భారత్, దక్షిణాఫ్రికా, న్యూజీలాండ్ గురించి ప్రస్తావించాడు. ప్రస్తుతానికి వరుసగా గెలుస్తూ ఈ జట్లు సెమీ ఫైనల్ కు గట్టి పోటీదారులుగా మారిన మాట వాస్తవమేనని గబ్బర్ అంగీకరించాడు. అయితే వీరు కచ్చితంగా సెమీ ఫైనల్ బెర్తులు సాధిస్తారా అంటే గ్యారంటీ లేదనేలా వ్యాఖ్యలు చేశాడు.

ప్రస్తుతం టాప్ 3లో ఉన్న మూడు జట్లు భారత్, దక్షిణాఫ్రికా, న్యూజీలాండ్ లో ఎవరైనా సెమీస్ చేరడంలో విఫలమైనా ఆశ్చర్యం లేదని శిఖర్ ధావన్ వ్యాఖ్యానించాడు. దీనికి కారణం నెట్ రన్ రేటే అన్నాడు. ప్రస్తుతానికి ఈ మూడు జట్లలో దక్షిణాఫ్రికా అత్యధిక నెట్ రన్ రేట్ తో ఉండగా భారత్, న్యూజీలాండ్ ఆ తర్వాత స్ధానాల్లో ఉన్నాయి. కానీ రాబోయే మ్యాచ్ ల్లో ఈ మూడు జట్లు గెలుపుతో పాటు నెట్ రన్ రేట్ ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని శిఖర్ ధావన్ తెలిపాడు.
ధావన్ సోషల్ మీడియాలో ఈ మేరకు తన అభిప్రాయాలను పంచకున్నాడు. ప్రతి ప్రపంచకప్ మ్యాచ్ పాయింట్ల పట్టికను మారుస్తోందని ధావన్ తెలిపాడు. సెమీస్‌లో భారత్, దక్షిణఫ్రికా, న్యూజిలాండ్‌లు తమ స్థానాలను ఖాయం చేసుకున్నాయని, ఇప్పుడు, నాలుగో స్థానంపై ఉత్కంఠ నెలకొందన్నాడు. అయితే నెట్ రన్ రేట్‌పై ఎక్కువ శ్రద్ధ పెట్టాలన్నాడు. లేకపోతే టాప్ 3 జట్లు అయినా సెమీస్ అర్హత సాధించలేకపోవచ్చన్నాడు. తద్వారా నెట్ రన్ రేట్ ఎంత ముఖ్యమో చెప్పకనే చెప్పాడు.












Click it and Unblock the Notifications