వరల్డ్ కప్ కోసం సౌరవ్ గంగూలీ సెలెక్ట్ చేసిన పవర్ ఫుల్ డ్రీమ్ టీమ్.. !!

దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా వచ్చే ఏడాది ఐసీసీ వరల్డ్ కప్‌ జరగబోతోంది. దీనికి సంబంధించిన మ్యాచ్ లు, తేదీల వివరాలు కూడా ఇదివరకే వెల్లడయ్యాయి. ఈ మెగా టోర్నమెంట్‌లో భారత్ తన తొలి మ్యాచ్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో అక్టోబర్ 7న కేప్‌టౌన్‌లో తలపడబోతోంది. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 14 జట్లు తలపడనున్నాయి. సెప్టెంబర్ 30వ తేదీ నాటికి అందుబాటులో ఉన్న ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ ఆధారంగా టోర్నీకి నేరుగా అర్హత సాధించే ప్రధాన జట్లు ఖరారయ్యాయి.

ఆతిథ్య దేశాల హోదాలో దక్షిణాఫ్రికా, జింబాబ్వేలు నేరుగా అర్హత సాధించాయి. మిగిలిన ఎనిమిది జట్లు వాటి ర్యాంకింగ్స్ ఆధారంగా రంగంలోకి దిగుతాయి. మిగిలిన నాలుగు స్థానాల భర్తీ కోసం వచ్చే ఏడాది ప్రత్యేకంగా క్వాలిఫైయర్ టోర్నమెంట్ జరగనుంది. భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, జింబాబ్వే నేరుగా వరల్డ్ కప్ కు ఎంపికయ్యాయి. మరో ఆతిథ్య దేశం నమీబియాకు ఇంకా అర్హత లభించలేదు. వెస్టిండీస్ సైతం క్వాలిఫయర్ల ద్వారానే అర్హత సాధించాల్సి ఉంటుంది.

Sourav Ganguly picked his preferred Team India playing 11 for the ODI World Cup in South Africa next year

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కేప్టెన్ సౌరవ్ గంగూలీ.. తన ఫేవరెట్ టీమిండియా డ్రీమ్ టీమ్ ప్లేయింగ్ 11ను ప్రకటించారు. గంగూలీ ఎంపిక చేసిన జట్టులో టాప్ ఆర్డర్ చాలా బలంగా కనిపిస్తోంది. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వరుసగా టాప్ ఆర్డర్ లో ఉన్నారు. కీలకమైన ఆరో స్థానంలో స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు చోటు కల్పించాడు. భారత్ విజయావకాశాలకు హార్దిక్ పాండ్యా ఓ కీలక ఆటగాడని దాదా అభిప్రాయపడ్డాడు.

షాకింగ్.. రిటైర్మెంట్ ప్రకటించిన యుజ్వేంద్ర చాహల్
షాకింగ్.. రిటైర్మెంట్ ప్రకటించిన యుజ్వేంద్ర చాహల్

దక్షిణాఫ్రికా పిచ్‌లు పేస్, బౌన్స్‌కు అనుకూలం కావడం వల్ల బ్యాటింగ్ లో మరింత డెప్త్ చాలా అవసరమని గంగూలీ విశ్లేషించాడు. ఈ వ్యూహంతోనే ఏడో స్థానంలో పరిస్థితులను బట్టి శివమ్ దూబే, రవీంద్ర జడేజా లేదా వాషింగ్టన్ సుందర్‌లలో ఒకరిని ఎంపిక చేసుకోవాలని సూచించాడు. ఎనిమిదో స్థానంలో అక్షర్ పటేల్ రావడం ద్వారా లోయర్ ఆర్డర్ మరింత పటిష్టంగా మారుతుందని అంచనా వేశాడు.

మాజీ సీఎంనే వదల్లేదు.. : కాక్రోచ్ నేతల సంగతి సరేసరి
మాజీ సీఎంనే వదల్లేదు.. : కాక్రోచ్ నేతల సంగతి సరేసరి

ప్రస్తుత టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కూడా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో స్పెషలిస్ట్ ఆటగాళ్ల కంటే ఆల్ రౌండర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోన్నాడు. టీ20 వరల్డ్ కప్ లోనూ ఈ వ్యూహమే భారత్‌కు కలిసొచ్చింది కూడా. గంగూలీ కూడా ఇదే ఆలోచనతో ఎనిమిది మంది వరకు బ్యాటింగ్ చేయగల బలమైన లైనప్‌ను ప్రతిపాదించాడు. ఈ జట్టులో స్టార్ స్పిన్నర్ కుల్ దీప్ యాదవ్‌కు స్థానం లభించకపోవడం గమనార్హం.

తిరుమలలో వడ ప్రసాదాల తయారీ కోసం..
తిరుమలలో వడ ప్రసాదాల తయారీ కోసం..

వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రాణిస్తోన్నప్పటికీ.. కుల్ దీప్‌ను గంగూలీ పక్కన పెట్టాడు. పిచ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముగ్గురు స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్లను ఆయన ఎంచుకున్నారు. జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ రూపంలో ముగ్గురు పేసర్లకు చోటు కల్పించారు. స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్‌కు తోడుగా ఏడో స్థానంలో వచ్చే ఆల్ రౌండర్ బౌలింగ్ బాధ్యతలు పంచుకుంటారని వివరించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+