టీమిండియా ఆ బలహీనతే మా బలం, అభిషేక్ ఇక - తేల్చేసిన సౌతాఫ్రికా..!!

T20 World cup: టీ20 ప్రపంచ కప్ లో సూపర్ -8 మ్యాచ్ లు ప్రారంభం అవుతున్నాయి. రేపు (ఆదివారం) దక్షిణాఫ్రికాతో టీమిండియా అహ్మదాబాద్ లో తలపడనుంది. ఈ మ్యాచ్ కు ముందే దక్షిణాఫ్రికా మైండ్ గేమ్ ప్రారంభించింది. టీమిండియా పైన పై చేయి సాధించేందుకు కొత్త లెక్క లతో సిద్దం అవుతోంది. లీగ్ దశలో అన్నింటా గెలిచి.. భారీ అంచనాలతో సూపర్ -8 లో అడుగు పెట్టిన సూర్య సేన.. అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. కాగా... తొలి మ్యాచ్ లో భారత్ బలం - బలహీనత గురించి సౌతాఫ్రికా కోచ్ ఆసక్తి కర విశ్లేషణ చేసారు.

సూపర్ -8 లో టీమిండియా మూడు బలమైన ప్రత్యర్థులతో తల పడనుంది. అందులో భాగంగా తొలి మ్యాచ్ సౌతాఫ్రికాతో ఆడేందుకు సిద్దమైంది. తరువాత జింబాబ్వే, చివరగా వెస్టిండీస్ తో ఆడనుంది. ఈ మూడు మ్యాచులు టీం ఇండియాకు కీలకమైనవే. అదే విధంగా ప్రత్యర్థి టీంలు సైతం ఇదే లక్ష్యంతో ఉన్నాయి. సెమీస్ కు చేరుకునే జట్లుగా ఇండియా - సౌతాఫ్రికా టీంలను అందరూ తమ అంచనాల్లో చెబుతున్నారు. దీంతో.. ఇప్పుడు రెండు జట్ల పైన ఒత్తిడి పెరిగింది. కాగా, రేపు సూపర్ 8లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-దక్షిణాఫ్రికా జట్లు ఆదిరం తలపడనున్నాయి. గ్రూప్ స్టేజిలో ఇరుజట్లూ ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా అజేయంగా నిలిచాయి.

south-africa-head-coach-shukri-conrad-has-expressed-excitement-ahead-of-his-teams-super-eight-opene

అయితే ఈ మ్యాచ్‌కు ముందు ప్రొటీస్ కోచ్ షుక్రి కాన్రాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్‌పైనే ఒత్తిడి ఎక్కువగా ఉందని చెప్పుకొచ్చారు. భారత్ మీదే ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని... సెమీ ఫైనల్స్ చేరుకునే విషయంలో వారిపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషించారు. వారు ఫైనల్‌కు కూడా చేరుకుంటారని వ్యాఖ్యానించారు. అయితే, ఆ భారీ అంచనాల వల్లే ప్లేయర్లు ఒత్తిడికి గురవుతారని... ఒత్తిడిలో బలహీనపడతారని చెప్పారు. నిజానికి రెండు జట్ల మీదా ఒత్తిడి ఉంటుందని.. అయితే, భారత్‌పై ఎక్కువ ఉందని షుక్రి వివరించారు.

టీం ఇండియా పైనే భారీ అంచనాలు

కాగా, ఇప్పుడు లీగ్ దశలో స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ వరుస డకౌట్లు టీం కు ఆందోళనగా మారాయి. బ్యాటింగ్ కు కలిసి వచ్చే అహ్మదాబాద్ పిచ్ పైన అభిషేక్ రాణిస్తారని టీం మేనేజ్మెంట్ నమ్ముతోంది. అభిషేక్ స్థానంలో సంజూ శాంసన్ అడుతాడనే అంచనాలు ఉన్నాయి. అయితే, కోచ్ - కెప్టెన్ మాత్రం అభిషేక్ ను కొనసాగించాలని డిసైడ్ అయ్యారు. ఇప్పుడు అభిషేక్ శర్మ వరుస డకౌట్లపై కూడా షుక్రి స్పందించాడు.

'మేమంతా అత్యుత్తమ జట్టుతో మ్యాచ్ ఆడితే ఉండే ఒత్తిడి గురించే మాట్లాడుతున్నానని చెప్పారు. నిజానికి టీం ఇండియా ఏ ఒత్తిడిలో ఉందో తెలియదని.. అభిషేక్ ఆడిన మూడు మ్యాచుల్లో వరుసగా డకౌట్ అయిన వ్యక్తిగా గుర్తు చేస్తూనే, జట్టులో స్థానం గురించి గురించి తాను మాట్లాడటం లేదని వివరించాడు. ఇక.. తుది జట్టు ఎంపిక అహ్మదాబాద్ లో కీలకంగా మారుతోంది. ఇక్కడ టాస్ చాలా కీలకమని రెండు జట్లు భావిస్తున్నాయి. రెండు బలమైన జట్లు సూపర్ -8 దశలొ పోటీ పడుతుండటంతో.. ఈ మ్యాచ్ పైన ఇటు ఫ్యాన్స్ లోనూ భారీగా అంచనాలు పెరుగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+