World Cup 2023: కోహ్లీ 49 సెంచరీలు చేస్తే గొప్పేంటి- ఆడుకుంటున్న నెటిజెన్లు
ఇప్పుడు క్రికెట్ ప్రపంచం మొత్తం విరాట్ ను ప్రశంసలతో ముంచెత్తుతోంది. క్రికెట్ గాడ్ సచిన్ రికార్డును సమం చేసిన కోహ్లీకి క్రికెట్ ఫ్యాన్స్ జేజేలు పలుకుతున్నారు. తన 35వ జన్మదినం నాడు సౌతాఫ్రికాతో మ్యాచ్ లో విరాట్ తన 49వ సెంచరీతో కోట్లాది మంది క్రికెట్ ఫ్యాన్స్ కు రిటర్న్ గిఫ్ఠ్ ఇచ్చారు. తన రికార్డు సమం చేసిన విరాట్ పై సచిన్ ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ మాత్రం సచిన్ పైన తనకు ఉన్న గౌరవం ఏంటో స్పష్టం చేసాడు.
విరాట్ ఆటకు ఫిధా: మొత్తం క్రికెట్ ఫ్యాన్స్ విరాట్ ను ప్రశంసిస్తున్న వేళ శ్రీలకం కెప్టెన్ క్రీడా స్పూర్తికి విరుద్దంగా వ్యవహరించాడు. రికార్డుల రారాజు విరాట్ సెంచరీ పైన తేలిగ్గా మాట్లాడాడు. విరాట్ నామ స్మరణతో ఆదివారం సోషల్ మీడియా హోరెత్తింది. ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. కోహ్లీ సాధించిన ఘనతను అభినందించేందుకు శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండీస్ నిరాకరించాడు. ప్రపంచ కప్ నుంచి శ్రీలంక దాదాపు అవుట్ అయింది.

నామ మాత్రపు మ్యాచ్ లో ఈ రోజు బంగ్లాదేశ్ తో తల పడనుంది. ఈ మ్యాచ్ సన్నద్దత పైన మీడియా సమావేశంలో శ్రీలంక కెప్టెన్ ను ఒక రిపోర్టర్ విరాట్ 49వ సెంచరీ పైన స్పందిస్తారా అని ప్రశ్నించాడు. దీనికి సాటి క్రీడాకారుడి గురించి..ఒక దేశ క్రికెట్ టీం కెప్టెన్ గా ఉంటూ కుశాల్ మెండీస్ ఇచ్చిన సమాధానం క్రికెట్ ఫ్యాన్స్ కు నచ్చటం లేదు.
క్రికెట్ ప్రపంచం ప్రశంసలు: విరాట్ 49వ సెంచరీ సాధించి..సచిన్ రికార్డు సమం చేసినందుకు అభినందనలు చెబుతారా అని ప్రశ్నించగా..దీనికి కుశాల్ షాకింగ్ సమాధానం చెప్పాడు. నేనెందుకు అతన్ని అభినందించాలి అంటూ కుశాల్ ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జెంటిల్మెన్ గేమ్ గా క్రికెట్ ఆటగాళ్లకు క్రీడా స్పూర్తి ఎక్కువగా ఉంటుంది. ప్రత్యర్ధి టీం ఆటగాడు సెంచరీ చేసినా..ప్రత్యర్ధి టీం గెలిచినా పరస్పరం అభినందించుకుంటారు. కానీ, ఇప్పుడు ప్రపంచ కప్ లో ఒక టీం కెప్టెన్ గా ఉంటూ కుశాల్ స్పందించిన తీరు పైన సోషల్ మీడియాలో నెటిజెన్లు సీరియస్ గా స్పందిస్తున్నారు. తాజాగా శ్రీలంక ప్రభుత్వం ప్రస్తుత టీం..ఆ దేశ క్రికెట్ బోర్డు పైన కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.
Journalist " Virat Just scored his 49th ODI ton. Do you like to congratulate him?"
— Out Of Context Cricket PK (@GemsOfCrickett) November 5, 2023
Kusak Mendis" Why I would congratulate him"😭😭😭#INDvSA #INDvsSA #SAvIND #ViratKohli #CWC2023 pic.twitter.com/DAqh2oeO5e
కుశాల్ మెండీస్ వైఖరితో: శ్రీలంక రెగ్యులర్ కెప్టెన్ దసున్ షనక గాయపడటంతో కుశాల్ మెండీస్ అనూహ్యంగా కెప్టెన్ పదవి దక్కించుకున్నాడు. ఇప్పుడు విరాట్ లాంటి సీనియర్..సిన్సియర్ ప్లేయర్ విషయంలో కుశాల్ స్పందించిన తీరు పైన ఫ్యాన్స్ సీరియస్ గా స్పందిస్తున్నారు. విరాట్ సెంచరీ చేసిన తరువాత సౌతాఫ్రికా లెజండరీ క్రికెటర్ ఏబీ డీవిలియర్స్ సైతం గ్రౌండ్ లో అభినందించారు.
ప్రపంచ క్రికెట్ లో సచిన్ నెలకొల్పిన రికార్డును సమం చేసిన విరాట్..ఈ ప్రపంచ కప్ లోనే మరో సెంచరీ చేస్తాడంటూ ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో అభిమానులు హోరెత్తిస్తున్నారు. కుశాల్ మెండీస్ వైఖరి పైన ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications