నిన్ను కొన్న దగ్గర నుంచే జట్టుకు దరిద్రం తగులుకుంది.. సన్ రైజర్స్ ఆగ్రహం

అంతన్నారు..ఇంతన్నారు.. ముంత మామిడి క్రింద పండన్నారు.. ఈ సమేత సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకు అచ్చి గుద్దినట్టు సరిపోతుంది. టోర్నీకి ముందు సన్ రైజర్స్ ఎన్ని గొప్పలు చెప్పారంటే.. ఇక కప్ తీసుకోవడమే తరువాయి అన్నట్టుగా మాట్లాడారు. కాటేరమ్మ కొడుకులంటూ అభిమానులు కూడా తెగ హంగామా సృష్టించారు. గ్రౌండ్‌లో దిగితే కానీ మనోళ్ల ఆట బయటపడలేదు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా మారిపోయింది ఆ జట్టు పరిస్థితి.ఈ సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతానికి భిన్నంగా చాలామంది అభిమానులు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మద్దతుగా నిలుస్తున్నారు. క్రికెట్ అభిమానులు సైతం ఈ ఏడాది జరిగే ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ కప్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అందరి అంచనాలకు తగ్గట్టుగానే సీజన్ తొలి మ్యాచ్‌ను ఘనంగా ప్రారంభించింది.తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌‌ను ఓడించి తొలి మ్యాచ్‌తోనే బోణీ కొట్టింది. ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఐపీఎల్‌లో రెండో అత్యధిక స్కోర్‌ను నమోదు చేసింది. అయితే ఇదే జోరును సన్ రైజర్స్ హైదరాబాద్ కొనసాగించలేకపోయింది. వరుస మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో హైయెస్ట్ స్కోర్‌ను ఛేజింగ్ చేసి ఫ్లే ఆఫ్ రేసులో నిలిచింది. అయితే ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయి, ఫ్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకుంది. ఈ సీజన్‌లో సన్ రైజర్స్ కథ దాదాపు ముగిసినట్టే. ఏదో అద్భుతం జరిగితే తప్ప, సన్ రైజర్స్ ప్లే ఆఫ్‌కు చేరడం కష్టమే. అసలు ఈ సీజన్ టీం సెలక్షన్ బాలేదని అభిమానులు మండిపడుతున్నారు.

Sunrisers failed to buy good players in last year s auction

అభిషేక్ శర్మ, హెడ్, ఇషాంత్ కిషాన్‌, నితీశ్ కుమార్ రెడ్డి,హెన్రిచ్ క్లాసెన్ వంటి అరవీర భయంకరమైన బ్యాట్స్‌మెన్లు జట్టులో ఉన్నారు. అయినప్పటికీ ఆ జట్టు బ్యాటింగ్ విభాగంలో రాణించలేకపోతుంది. ఇక బౌలింగ్ విభాగానికి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. రూ 11.75 కోట్లు చెల్లించి ఇషాన్ కిషన్ జట్టులోకి తీసుకోగా, అతను కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే రాణించాడు. మిగిలిన మ్యాచ్‌ల్లో అసలు తనకు బ్యాటింగ్ వచ్చా అన్న విధంగా ఆడాడు. ఇక నితీశ్ రెడ్డి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అసలు ఈ సీజన్‌లో నితీష్ రెడ్డి ఒక్క మ్యాచ్‌లో కూడా రాణించలేదు.కాటేరమ్మ కొడుకు అంటూ తెగ బిల్డప్ ఇచ్చిన హెన్రిచ్ క్లాసెన్ కూడా ఒక్క మ్యాచ్ ఆడింది లేదు.

భువనేశ్వర్ వంటి వరల్డ్ క్లాసిక్ బౌలర్‌ను దూరం చేసుకుని, రూ. 10 కోట్లు పెట్టి షమీని టీంలోకి తీసుకున్నారు. అతని వల్ల ఎటువంటి ఉపయోగం లేదని తెలుసుకోవడానికి జట్టు యాజమాన్యానికి ఎక్కువ సమయం పట్టలేదు. బ్యాట్స్‌మెన్ల పిచ్చిలో పడి, జట్టులో ఉన్న అద్భుతమైన బౌలర్లను సన్ రైజర్స్ యాజమాన్యం వదులుకుంది. సందీప్ శర్మ, భువనేశ్వర్ కుమార్, నటరాజన్ వంటి స్టార్ బౌలర్స్‌ను హైదరాబాద్ జట్టు వేలంలో వదులుకుంది. గతంలో సన్ రైజర్స్ టీం లోస్కోరింగ్ మ్యాచ్‌ల్లో అనేకసార్లు విజయం సాధించింది. 130 పరుగల లక్ష్యాన్ని కూడా ఆ జట్టు కాపాడుకున్న మ్యాచ్‌లు ఎన్నో చూశాం. అలాంటిది ఇప్పుడు 200 పరుగులు కొట్టినా గెలుస్తామనే ధీమా ఎక్కడా ఆ జట్టులో కనిపించడం లేదు. గతేడాది జరిగిన వేలంలో మంచి ఆటగాళ్లను కొనుగోలు చేయడంలో సన్ రైజర్స్ విఫలం అయింది. అభిమానులకు ఇది ఒక బ్యాడ్ సీజన్‌గా భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+