SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడిని ప్రశ్నించిన పోలీసులు..!
సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడిని సూరత్ పోలీసులు విచారించారు. ఫిబ్రవరి 21న మోడల్ ఆత్మహత్యకు సంబంధించిన కేసులో ఎస్ఆర్ హెచ్ ఆటగాడు అభిషేక్ శర్మను మార్చి 5 మంగళవారం పోలీసులు ఐదు గంటల పాటు ప్రశ్నించారు. అభిషేక్ శర్మ (23)ను పోలీసులు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విచారించినట్లు తెలిసింది. ఐదు గంటల కఠిన విచారణ అనంతరం శర్మ ఇంటికి వెళ్లిపోయారు.
అభిషేక్ విచారణలో భాగంగా పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నట్లు చెబుతున్నారు. తానియా తనకు ఫ్రెండ్ మాత్రమేనని చెప్పినట్లు సమాచారం. చాలా కాలంగా ఆమెతో టచ్‌లో లేని అభిషేక్ శర్మ పోలీసులు తెలిపినట్లు తెలిసింది. సూరత్ లో ఫ్యాషన్ డిజైనర్, మోడల్ 28 ఏళ్ల తానియా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మోడల్ ఆత్మహత్య చేసుకున్నప్పుడు వైర్-ఫ్రీ ఇయర్‌ఫోన్ ధరించి ఉంది.

దీంతో ఆమె ఆత్మహత్యకు ముందు ఎవరితోనైనా మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. అభిషేక్ శర్మ ఆమెతో చరుచూ మాట్లాడినట్లు విచారణలో తేలింది. కాల్ డేటా ఆధారంగా తానియాతో అభిషేక్ శర్మ మాట్లాడినట్లు గుర్తించారు. అభిషేక్ శర్మ తానియాతో చాటింగ్ చేసినట్లు కూడా దర్యాప్తులో తేలింది. వారు దాదాపు సంవత్సర కాలంగా సంబంధం కలిగి ఉన్నారని తేలింది. అయితే, SRH ప్లేయర్ గత ఆరు నెలలుగా మోడల్ కాల్‌లకు సమాధానం ఇవ్వడం మానేసినట్లు తెలిసింది.
మోడల్ ఆత్మహత్యకు సంబంధించి ఇప్పటివరకు నలుగురు వ్యక్తులను ప్రశ్నించినట్లు పోలీసులు తెలిపారు. మోడల్ ఆత్మహత్యకు గల కారణాలను ఇంకా గుర్తించలేదని చెప్పారు. 2016 ఆసియా కప్‌లో అండర్-19 భారత జట్టు గెలుపులో అభిషేక్ శర్మ కీలక పాత్ర పోషించాడు. 23 ఏళ్ల స్పిన్ ఆల్‌రౌండర్ అభిషేక్ శర్మ రంజీ ట్రోఫీ 2023- 24 సీజన్‌లో ఆడాడు. పంజాబ్ తరఫున నాలుగు మ్యాచ్‌లు ఆడి 199 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ ప్రస్తుతం ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్నాడు.












Click it and Unblock the Notifications