పాక్ తో మ్యాచ్ కు అభిషేక్-మిస్టరీ స్పిన్నర్, హ్యాండ్ షేక్ పైనా తేల్చేసిన స్కై..!
రేపు కొలంబోలో పాకిస్తాన్ తో జరిగే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో భారత వ్యూహాల్ని కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (suryakumar yadav) ఇవాళ బయటపెట్టాడు. ఇందులో ఓపెనర్ అభిషేక్ యాదవ్ పై క్లారిటీ ఇవ్వడంతోపాటు పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ను ఎదుర్కునే అంశం, అలాగే ప్రత్యర్థి ఆటగాళ్లకు హ్యాండ్ షేక్ ఇవ్వడం వంటి విషయాలపైనా స్కై నిష్కర్షగా తన అభిప్రాయాలు వెల్లడించాడు. అలాగే పాకిస్తాన్ తో ద్వైపాక్షిక సిరీస్ లపైనా సూర్య క్లారిటీ ఇచ్చాడు.
టీ20 ప్రపంచ కప్‌లో ఇప్పటివరకు భారత బ్యాటింగ్ ఇబ్బందికరంగానే ఉందని సూర్య అంగీకరించాడు. తమ ఓపెనింగ్ పేలవంగా ఉందని కూడా సూర్య అంగీకరించాడు. వాస్తవం నుండి తాము పారిపోలేమన్నాడు. దీనికి ఎలాంటి సాకులు చెప్పదల్చుకోలేదన్నాడు. ప్రతి ఒక్కరూ చాలా క్రికెట్ ఆడారని, బ్యాటర్లు ఇలాంటి వికెట్లపై తమ స్వంత ప్రణాళికలను కలిగి ఉండాలని కోరాడు. తాము బాగా ప్రారంభించాము కానీ అవాంతరాలు ఎదుర్కున్నామని సూర్య తెలిపాడు. కానీ దానిని బాగా కవర్ చేసామన్నాడు. అదే టీ20 క్రికెట్ అందం అన్నాడు.

పాకిస్తాన్ తో రేపు జరిగే మ్యాచ్ పై స్పందిస్తూ.. ఒత్తిడి ఎప్పుడూ ఉంటుందని సూర్య తెలిపాడు. ఇది వేరని ఎంత చెప్పినా ఒత్తిడి మాత్రం మానవ సహజం అన్నాడు. పాకిస్తాన్ తో తరచూ ఆడం కాబట్టి ఒత్తిడి ఎల్లప్పుడూ ఉంటుందన్నాడు. భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ టోర్నీలు ఉంటాయా అంటే అవకాశం లేదన్నాడు. అది మన చేతుల్లో లేదని, తాను ఆ నిర్ణయం తీసుకోగల స్థితిలో ఉన్నప్పుడు మీకు చెప్తానన్నాడు.
స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ పాకిస్థాన్‌తో ఆడటానికి సిద్ధంగా ఉన్నాడని, ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తిరిగి వస్తాడని భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు. భారత ఆటగాళ్ళు ప్రత్యర్థిపై కాకుండా తమపైనే దృష్టి సారిస్తున్నారని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. మనం ఎలా ఆడుతున్నామో చూడాలని, దాన్నే కొనసాగించాలని కోరాడు. ప్రత్యర్థి జట్టు ఎలా ఆడుతుందని కాకుండా తమ బలంపైనే దృష్టిపెడతామన్నాడు. ఎవరు బాగా క్రికెట్ ఆడతారో వారు ఆట గెలుస్తారన్నాడు.

ప్రపంచ కప్ మ్యాచ్‌లో టాస్ సమయంలో టీం ఇండియా పాకిస్థాన్‌తో కరచాలనం చేయడానికి సిద్ధంగా ఉంటుందా లేదా అనే దానిపై సూర్యకుమార్ యాదవ్ నేరుగా స్పందించలేదు. టాస్ సమయంలో కరచాలనం గురించి చూద్దాం. 24 గంటలు వేచి ఉండాలని కోరాడు. మరోవైపు తన అసాధారణ స్టాప్-స్టార్ట్ యాక్షన్‌తో వార్తల్లో నిలిచిన పాకిస్తాన్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్‌పై స్పందిస్తూ.. ఒక ప్రశ్న సిలబస్‌లో లేనప్పటికీ దాన్ని వదిలేయలేమని, అతన్ని ఎదుర్కొనేందుకు సిద్దంగానే ఉన్నామని సూర్య తెలిపాడు.












Click it and Unblock the Notifications