రైల్వే టీసీ టు ఒలింపిక్స్‌ మెడలిస్ట్: భారత్‌కు మూడో పతకం

Swapnil Kusale: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ ఖాతాలో మరో పతకం పడింది. పతకాల పట్టికలో తన సంఖ్యను మూడుకు పెంచుకోగలిగింది. ఇది కూడా షూటింగ్‌లో కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే ఈ కేటగిరీలో రెండు మెడల్స్‌ను అందుకుంది భారత్. ఇప్పుడిక మూడో పతకాన్నీ ముద్దాడింది.

పురుషుల 50 మీటర్ల రైఫిల్స్ సింగిల్స్ విభాగంలో కాంస్య పతకాన్ని అందుకున్నారు భారత షూటర్ స్వప్నిల్ కుశాలె. ఫైనల్స్‌లో ఆయన మూడో స్థానంలో నిలిచారు. 451.4 పాయింట్లను సాధించారు. తొలి మూడు స్థానాల కోసం మొత్తం ఎనిమిది మంది షూటర్లు పోటీ పడ్డారు.

Swapnil Kusale wins bronze in Paris Olympics 2024

తొలుత 310.1 పాయింట్లతో అయిదో స్థానానికి ఎగబాకారు స్వప్నిల్ కుశాలె. నార్వేకు చెందిన జోన్- హెర్మాన్ హెగ్ 312.1, చైనా షూటర్ లియు యుకున్- 311.5, ఉక్రెయిన్‌కు చెందిన సెర్హీ కులిష్- 311.1, చెక్ రిపబ్లిక్‌కు చెందిన జీరి ప్రివ్రాస్కీ- 311.0 పాయింట్లతో ఆయన కంటే ముందునిలిచారు.

గేమ్ కొనసాగుతున్న కొద్దీ స్వప్నిల్ తడాఖా చూపాడు. క్రమంగా తన పాయింట్లను పెంచుకుంటూ పోయాడు. 451.4 పాయింట్లతో మూడో స్థానింలో నిలిచాడు. కాంస్య పతకాన్ని అందుకున్నాడు. షూటింగ్‌లో భారత్‌కు దక్కిన మూడో కాంస్య పతకం ఇది. ఇదివరకు మహిళల సింగిల్స్‌లో మనూ భాకర్, మిక్స్‌డ్ కేటగిరీలో మనూ భాకర్- సరబ్జొత్ సింగ్ జోడీ.. కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

స్వప్నిల్ కుశాలె సాధించిన ఈ ఘనత పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ హర్షం వ్యక్తం చేశారు. వృత్తిరీత్యా స్వప్పిల్ కుశాలె.. రైల్వేలో టికెట్ కలెక్టర్‌గా పని చేస్తోన్నాడు. టీమిండియా మాజీ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్ఫూర్తితో గన్ పట్టాడు. షూటర్‌ను తన స్పోర్ట్స్ కేరీర్‌‌గా ఎంచుకున్నాడు.

ఆయన సొంత రాష్ట్రం మహారాష్ట్ర. కొల్హాపూర్ సమీపంలోని కంబాల్‌వాడి గ్రామం ఆయన స్వస్థలం. 2012లో తొలిసారిగా షూటింగ్‌లో ఇంటర్నేషనల్ ఈవెంట్స్‌కు ప్రాతినిథ్యాన్ని వహించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేతగా చరిత్ర సృష్టించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+