T20 World Cup 2026: టీమిండియాకు ముందే షాకులు-హర్షిత్ స్ధానంలో ఆ పేసర్..!
రేపు ప్రారంభం కాబోతున్న టీ20 వరల్డ్ కప్ (t20 world cup 2026) కు సిద్ధమవుతున్న భారత జట్టుకు వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా దక్షిణాఫ్రికాతో వార్మప్ గేమ్ లో గాయపడ్డ పేసర్ హర్షిత్ రాణా జట్టుకు దూరం కాగా.. అంతకు ముందే హైదరాబాదీ యువ బ్యాట్స్ మెన్ తిలక్ వర్మ కూడా గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో జట్టుకు ఎంపిక కాలేకపోయాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐకి తప్పనిసరిగా మార్పులు చేయక తప్పని పరిస్ధితి ఎదురవుతోంది.
పేసర్ హర్షిత్ రాణా గాయం కారణంగా టీ20 ప్రపంచ కప్ జట్టుకు దూరం కావడంతో అతని స్ధానంలో హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ కు అవకాశం కల్పించబోతున్నట్లు బీసీసీఐ సంకేతాలు ఇస్తోంది. ఈ మేరకు ఐసీసీ కూడా ఆమోదం తెలిపినట్లు సమాచారం. సిరాజ్ భారత్ తరపున ఇప్పటివరకూ 111 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 45 టెస్టులు, 50 వన్డేలు , 16 టీ20లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సిరాజ్ అనుభవం జట్టుకు కలిసి వస్తుందని బీసీసీఐ భావిస్తోంది.

మరోవైపు అమెరికాతో జరిగిన జట్టు ప్రమోషన్ ఈవెంట్ కు ముందు జరిగిన ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.... దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్ తర్వాత హర్షిత్ రాణా పరిస్దితి బాగోలేదని చెప్పేశాడు. జట్టు ఫిజియోలు అతన్ని గాయాన్ని అంచనా వేస్తున్నట్లు తెలిపాడు. మరోవైపు స్పిన్-బౌలింగ్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఫిట్‌నెస్‌పై ఇప్పటికే సందేహాలు తలెత్తుతున్నాయి. దీంతో టీమిండియా ఫిట్ నెస్ కష్టాలు మరింత పెరిగేలా కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications