T20 World Cup ఫైనల్ వీరి మధ్యే..! తేల్చేసిన ఏఐ ప్లాట్ ఫామ్స్..!

టీ20 వరల్డ్ కప్ (T20 World cup 2026) సూపర్ 8 దశ ముగిసింది. ఎల్లుండి సెమీ ఫైనల్ దశ మొదలుకాబోతోంది. తొలి సెమీ ఫైనల్లో దక్షిణాఫ్రికా-న్యూజీలాండ్, మార్చి 5న జరిగే రెండో సెమీ ఫైనల్లో భారత్-ఇంగ్లాండ్ తలపడబోతున్నాయి. ఈ రెండు మ్యాచ్ ల్లో విజేతలుగా నిలిచిన జట్ల మధ్య మార్చి 8న ఫైనల్ ఉంటుంది. అయితే ఇప్పటికే వరుస విజయాలతో సెమీస్ కు చేరుకున్న దక్షిణాఫ్రికాతో పాటు అక్కడక్కడా ఓటములు ఎదురైనా తిరిగి పుంజుకుని సెమీస్ కు చేసిన భారత్, ఇంగ్లాండ్, న్యూజీలాండ్ ఈ రేసులో ఉన్నాయి. వీరిలో ఫైనల్ చేరే అవకాశాలు ఎవరికి ఉన్నాయో ఏఐ ప్లాట్ ఫామ్స్ తేల్చేశాయి.

టీ20 వరల్డ్ కప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన భారత్ పై ఏఐ ప్లాట్ ఫామ్స్ మొదటి నుంచీ టైటిల్ ఫేవరెట్ గా గురిపెట్టాయి. అయితే మధ్యలో భారత్ దక్షిణాఫ్రికా చేతిలో సూపర్ 8 తొలి మ్యాచ్ లో ఓడిపోవడంతో లెక్కలు మారిపోయాయి. అయితే న్యూజీలాండ్, ఇంగ్లాండ్ ల పరిస్ధితి అంత గొప్పగా ఏమీ కనిపించడం లేదు. దీంతో భారత్, దక్షిణాఫ్రికాకే ఫైనల్ చేరే అవకాశాలు ఉన్నాయని ఏఐ ప్లాట్ ఫామ్స్ గ్రోక్, గూగుల్ జెమినీ, ఛాట్ జీపీటీ, మరికొన్ని కూడా తేల్చేశాయి.

T20 World Cup 2026 Finalists Predicted AI Platforms Are All Agree on These Two Teams

బ్యాటింగ్ లోతు, స్పిన్ బౌలింగ్, స్వదేశీ పరిస్థితుల అనుకూలత వంటి కారణాలతో భారతదేశానికి 55-60 శాతం విజయావకాశం ఉందని గ్రోక్ అంచనా వేసింది. ఇప్పటివరకూ ఓటమి ఎరుగని దక్షిణాఫ్రికా కూడా అలవోకగా ఫైనల్ కు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ఓపెన్ ఏఐ కూడా టాప్ సీడ్లుగా ఉన్న భారత్, దక్షిణాఫ్రికా మధ్యే ఫైనల్ ఉండే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఫైనల్లోనూ దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్ ఎగరేసుకుపోయే అవకాశం టీమిండియాకే ఉందని అవి స్పష్టం చేస్తున్నాయి. చివరి నిమిషంలో ఏదైనా అద్భుతాలు జరిగితే తప్ప డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ క్లియర్ టైటిల్ విన్నర్ గా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+