చెపాక్‌లో చితక్కొట్టిన టీమిండియా.. టోర్నీ నుంచి జింబాబ్వే ఔట్!
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో టీమిండియా సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. సూపర్-8 పోరులో భాగంగా చెన్నై వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 72 పరుగుల భారీ తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. ఈ ఓటమితో జింబాబ్వే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించగా.. గ్రూప్-1 నుంచి సౌతాఫ్రికా సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో ముందు బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగుల భారీ స్కోరు చేసింది. హార్దిక్ పాండ్యా (23 బంతుల్లో 50 నాటౌట్), అభిషేక్ శర్మ (30 బంతుల్లో 55) మెరుపు అర్ధశతకాలతో అలరించగా.. తిలక్ వర్మ (16 బంతుల్లో 44 నాటౌట్), ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 38), సూర్యకుమార్ యాదవ్ (23 బంతుల్లో 50 నాటౌట్) దూకుడుగా ఆడారు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగర్వా, బ్రెస్సింగ్ ముజుర్బాని, మపోసా, సికిందర్ రాజా తలో వికెట్ పడగొట్టారు.
భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్లకు 184 పరుగులకే పరిమితమై, ఓటమి పాలైంది. వారి బ్యాట్స్‌మెన్‌లో బ్రియాన్ బెన్నెట్ 59 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 97 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కెప్టెన్ సికిందర్ రాజా (21 బంతుల్లో 31) దూకుడుగా ఆడాడు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ (3/22) అద్భుత ప్రదర్శన చేయగా.. వరుణ్ చక్రవర్తీ, అక్షర్ పటేల్, శివమ్ దూబే తలో వికెట్ పడగొట్టారు.

భారీ లక్ష్య ఛేదనలో జింబాబ్వే తమ ఇన్నింగ్స్‌ను నిదానంగా ఆరంభించింది. పవర్‌ప్లేలో ఓపెనర్లు బ్రియన్ బెన్నెట్, మరుమణి వికెట్ నష్టపోకుండా 44 పరుగులు చేశారు. అయితే, జిడ్డుగా ఆడుతున్న మరుమణి (20)ని అక్షర్ పటేల్ ఔట్ చేయగా, డియోన్ మేయర్స్ (6)ను వరుణ్ చక్రవర్తీ పెవిలియన్‌కు చేర్చాడు.
క్రీజులోకి వచ్చిన సికిందర్ రాజాతో కలిసి బ్రియాన్ బెన్నెట్ దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలో బెన్నెట్ కేవలం 34 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ భాగస్వామ్యాన్ని అర్ష్‌దీప్ సింగ్ విడదీసాడు. ఒకే ఓవర్‌లో సికిందర్ రాజాను ఔట్ చేసిన అర్ష్‌దీప్, రయాన్ బర్ల్ (0)ను డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాతి ఓవర్‌లో టోనీని (11) క్లీన్ బౌల్డ్ చేసి జింబాబ్వే పతనాన్ని శాసించాడు. ఆఖరి ఓవర్‌లో శివం దూబే తషింగా వికెట్‌ను తీశాడు. భారత్ తమ తదుపరి సూపర్-8 మ్యాచ్‌ను ఆదివారం కోల్‌కతా వేదికగా వెస్టిండీస్‌తో ఆడనుంది. ఇది క్వాలిఫయర్ మ్యాచ్ అని చెప్పవచ్చు. ఇందులో గెలిచిన జట్టు సెమీస్ చేరనుండగా.. ఓడిన జట్టు ఇంటిబాట పట్టనుంది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications