IND Vs PAK: పాక్‌ను చిత్తు చేసిన భారత్
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. వేదికతో సంబంధం లేకుండా, ప్రత్యర్థి ఎవరైనా భారత ఆధిపత్యం మాత్రం తగ్గడం లేదు. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు, దాయాది పాకిస్థాన్‌పై మరోసారి పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆదివారం కొలంబో వేదికగా జరిగిన హైఓల్టేజ్ మ్యాచ్‌లో సూర్య సేన 61 పరుగుల భారీ తేడాతో గెలిచి, సూపర్-8 బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ విజయంతో పాకిస్థాన్‌పై భారత్ తమ రికార్డును 8-1కి మెరుగుపరుచుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 175 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్ విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగాడు, కేవలం 40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 77 పరుగులు సాధించాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 32 పరుగులు (29 బంతులు), శివమ్ దూబే 27 పరుగులు (17 బంతులు) చేసి విలువైన సహకారం అందించారు.
పాకిస్థాన్ బౌలర్లలో సైమ్ అయుబ్ అద్భుతంగా రాణించి 25 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఉస్మాన్ తారిక్ 24 పరుగులకి ఒక వికెట్ తీయగా, సల్మాన్ అఘా, షాహిన్ షా అఫ్రిది తలో వికెట్ దక్కించుకున్నారు.

అనంతరం, 176 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ 18 ఓవర్లలోనే కేవలం 114 పరుగులకే ఆలౌట్ అయ్యి ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే వారికి పెద్ద షాక్ తగిలింది. హార్దిక్ పాండ్యా తొలి ఓవర్‌లోనే మెయిడిన్ వికెట్ తీసి, ఓపెనర్ షాహిబ్‌జాదా ఫర్హాన్‌ను డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే, జస్‌ప్రీత్ బుమ్రా సైమ్ అయూబ్ (6), కెప్టెన్ సల్మాన్ అలీ అఘా (4)లను అవుట్ చేసి పాక్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. సీనియర్ బ్యాటర్ బాబర్ ఆజామ్ (5)ను అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేయడంతో, పవర్ ప్లే ముగిసేసరికి పాకిస్థాన్ 38 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.
ఈ క్లిష్ట పరిస్థితుల్లో వికెట్ కీపర్ ఉస్మాన్ ఖాన్ (34 బంతుల్లో 44 పరుగులు) ఒక్కడే రాణించి, జట్టును ఆదుకోవడానికి ప్రయత్నించాడు. అతను షాదాబ్ ఖాన్‌తో కలిసి ఐదో వికెట్‌కు 43 పరుగులు జోడించాడు. అయితే, హాఫ్ సెంచరీకి చేరువైన ఉస్మాన్‌ను అక్షర్ పటేల్ స్టంపౌట్ చేసి భారత ఆధిపత్యాన్ని కొనసాగించాడు. షాదాబ్ (14) తిలక్ వర్మకు చిక్కితే, మహమ్మద్ నవాజ్ (4) కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.
చివరి ఓవర్లలో వరుణ్ చక్రవర్తీ ఫహీమ్ అష్రఫ్, అబ్రర్ అహ్మద్‌లను వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చి, తృటిలో హ్యాట్రిక్ వికెట్ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. షాహిన్ షా అఫ్రిది, ఉస్మాన్ తారిక్‌తో కలిసి పోరాడాలని చూశాడు. అయితే, హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఉస్మాన్ తారిక్‌ను క్లీన్ బౌల్డ్ చేసి భారత విజయాన్ని లాంఛనంగా పూర్తి చేశాడు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తీ, హార్దిక్ పాండ్యా రెండేసి వికెట్లు తీసుకోగా, కుల్దీప్ యాదవ్, తిలక్ వర్మ చెరో వికెట్ పడగొట్టారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications