జింబాబ్వేపై ఓడినా భారత్ సెమీస్ వెళ్తుందా..? సౌతాఫ్రికా పై వెస్టిండీస్ గెలిస్తే.. ఇదీ లెక్క..!!
T20 World cup Ind vs Zim: టీ20 ప్రపంచ కప్ సూపర్-8లో భాగంగా ఇవాళ(గురువారం) రెండు కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ సెమీస్ ఆశలు ఈ మ్యాచ్ ఫలితం పైనా ఆధార పడి ఉంది. ఇక.. జింబాబ్వే పైన జరిగే మ్యాచ్ లో టీమిండియా భారీ విజయం నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ రెండు మ్యాచులు ఫలితాలు రివర్స్ అయితే.. ఏం జరుగుతుంది.. టీం ఇండియా సెమీస్ చేరే అవకాశం ఉంటుందా... ఇదీ అసలు లెక్క
అందులో భారత్, జింబాబ్వే మ్యాచ్ ఒకటి. చెన్నైలోని చెపాక్ వేదికగా ఇవాళ రాత్రి 7:00 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. సెమీస్ అవకాశాలను మెరుగుపర్చేందు ఈ మ్యాచ్ టీమిండియా చాలా కీలకం. ఈ నేపథ్యంలో మ్యాచ్ జరిగే చెన్నైలో వాతావరణం అనుకూలంగానే ఉన్నా.. టాస్ కీలకంగా మారనుంది. భారత్ టీంలో మూడు మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. రింకుసింగ్, అర్షదీప్, వాషింగ్టన్ సుందర్ స్థానంలో సంజు శాంసన్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ చేరిక దాదాపు ఖాయం. ఇక.. జింబాబ్వేతో భారీ గెలుపు సాధిస్తేనే సెమీస్ కు భారత్ కు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. కాగా, తాజా లెక్కలు మరో చర్చకు కారణమయ్యాయి. ఒకవేళ భారత్ నేడు జింబాబ్వే చేతిలో ఓడిపోయినా కొన్ని సమీకరణలు చోటు చేసుకుంటే సెమీస్ కు అవకాశం ఉంటుంది. సౌతాఫ్రికా జట్టు వెస్టిండీస్‌ను, ఆ తర్వాత జింబాబ్వేను కూడా ఓడించాలి. అదే సమయంలో మార్చి 1న జరిగే మ్యాచ్‌లో భారత్ తప్పనిసరిగా వెస్టిండీస్‌ను భారీ తేడాతో ఓడించాల్సి ఉంటుంది. ఆ సమయంలో దక్షిణాఫ్రికా 6 పాయింట్లతో నేరుగా క్వాలిఫై అవుతుంది. మిగిలిన మూడు జట్లు (భారత్, విండీస్, జింబాబ్వే) చెరో 2 పాయింట్లతో సమానంగా ఉంటాయి.

నేటి రెండు మ్యాచుల ఫలితాలతో క్లారిటీ
ఆ పరిస్థితి వస్తే.. అప్పుడు ఎవరి రన్ రేట్ బాగుంటే వారు రెండో టీమ్‌గా సెమీస్‌కు వెళ్తారు. కాగా, ఒకవేళ వెస్టిండీస్ గనుక సౌతాఫ్రికాను ఓడించి, అదే రోజు భారత్ జింబాబ్వే చేతిలో ఓడిపోతే.. టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమించినట్టే. ఎందుకంటే అప్పుడు వెస్టిండీస్ 4 పాయింట్లతో ఉంటుంది, భారత్ చివరి మ్యాచ్ గెలిచినా కేవలం 2 పాయింట్లకే పరిమితం అవుతుంది. ఒకవేళ విండీస్ గెలిచి, భారత్ కూడా గెలిస్తే అప్పుడు మూడు జట్లు దక్షిణాఫ్రికా, భారత్, వెస్టిండీస్ 4 పాయింట్లతో నిలుస్తాయి. అప్పుడు రన్ రేటు కీలకంగా మారుతుంది. దీంతో... అన్ని టీంలకు గెలుపు ఎంత ముఖ్యమో.. రన్ రేటు అంతే ముఖ్యం. టాప్-2లో ఉన్న జట్లు నెట్ రన్ రేట్ ఆధారంగా సెమీస్‌కు చేరుతాయి. భారత్ రన్ రేట్ ప్రస్తుతం మరీ తక్కువగా ఉంది కాబట్టి, రాబోయే రెండు మ్యాచ్‌లను భారీ తేడాతో గెలవడం చాలా ముఖ్యం. దీంతో.. ఈ టెన్షన్ లేకుండా సెమీస్ చేరాలంటే.. జింబాబ్వే, వెస్టిండీస్ పైన టీమిండియా గెలుపు మాత్రమే కాదు.. అంతకు మించి అన్నట్లుగా ఫలితం సాధించాలి.












Click it and Unblock the Notifications