T20 World cup: విండీస్ పై ఆడే టీమిండియా ఇదే..! రింకూ సస్పెన్స్ కు తెర..!

టీ20 వరల్డ్ కప్ (T20 world cup)లో డిఫెండింగ్ ఛాంపియన్ గా అడుగుపెట్టి.. గ్రూప్ దశలో వరుసగా నాలుగు విజయాలతో వరుసగా రెండో టైటిల్ పై కన్నేసిన టీమిండియాకు దక్షిణాఫ్రికా చేతిలో తొలి పరాభవం ఎదురైంది. సూపర్ 8లో తొలి మ్యాచ్ లోనే ప్రొటియాజ్ చేతిలో సూర్య సేన అనూహ్యంగా భారీ తేడాతో ఓటమిపాలైంది. దీంతో టైటిల్ మాట దేవుడెరుగు, సెమీ ఫైనల్ కు అర్హత సాధిస్తే చాలన్న పరిస్దితికి వచ్చేసింది. జింబాబ్వేతో మ్యాచ్ కు ముందు తీవ్ర ఒత్తిడిలో ఉన్న భారత్.. దాన్ని అధిగమించి సాధించిన ఘన విజయం.. ఇవాళ వెస్టిండీస్ తో జరిగే అనధికార క్వార్టర్ ఫైనల్ ముందు బిగ్ బూస్ట్ ఇచ్చింది.

ఈ నేపథ్యంలో ఇవాళ వెస్టిండీస్ తో జరిగే మ్యాచ్ లోనూ (india west indies match) గెలిస్తే భారత్ కచ్చితంగా సెమీస్ కు వెళ్లడం ఖాయం. లేకపోతే ఇంటిముఖం పట్టక తప్పదు. అలాగే వర్షం కారణంగా మ్యాచ్ రద్దయినా భారత్ కు దారులు మూసుకుపోతాయి. ఇలాంటి పరిస్దితుల్లో వెస్టిండీస్ తో ఆడే తుది జట్టు ఎంపిక విషయంలో భారత్ పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. ముఖ్యంగా గత మ్యాచ్ లో ఓపెనింగ్ సమస్య తీరిపోవడం, మిడిల్ ఆర్డర్ కుదురుకోవడంతో వాటిలో ఎలాంటి మార్పులు చేయరాదని నిర్ణయించింది.

T20 World Cup India s Predicted XI vs West Indies All Eyes on Rinku Singh s Return

అయితే లోయర్ ఆర్డర్ లో రింకూ సింగ్ ను తిరిగి తీసుకోవాలన్న చర్చ మొదలైంది. దీనిపై పలు ఆప్షన్లు ఆలోచించిన భారత్.. చివరికి గత మ్యాచ్ ఆడిన జట్టులో ఎలాంటి మార్పులు చేయరాదని నిర్ణయించింది. దీంతో జింబాబ్వేతో మ్యాచ్ తరహాలోనే సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేయడం, ఆ తర్వాత ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఆల్ రౌండర్లు హార్ధిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్.. చివరిగా వరుణ్ చక్రవర్తి, బుమ్రా తుది జట్టులో ఆడబోతున్నారు. గత మ్యాచ్ తరహాలోనే సంజూ శాంసన్ వికెట్ కీపింగ్ చేస్తాడని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+