ఆసీస్ గడ్డ పై టీం ఇండియా ఘన విజయం - బూమ్రా, సిరాజ్ మేజిక్..!!
ఆసీస్ గడ్డ పైన టీం ఇండియా చారిత్రాత్మక విజయం సాధించింది. సొంత గడ్డ పైన ఆస్ట్రేలియాను ఓడించింది. టీం ఇండియా అన్ని రంగాల్లోనూ సమిష్టిగా రాణించింది. పెర్త్ పిచ్ పైన ఆసీస్ బ్యాటర్లను బూమ్రా, సిరాజ్ ముప్ప తిప్పలు పెట్టారు. ఎక్కడా కోలుకునే అవకాశం ఇవ్వలేదు. వరుస పెట్టి పెవిలియన్ కు పంపారు. బ్యాటింగ్ లో కోహ్లీ రికార్డు సెంచరీ.. యశ్వస్వి జైశ్వాల్ బ్యాటింగ్ విన్యాసాలతో భారత్ భారీ స్కొర్ సాధించింది. లక్ష్య చేధనలో చతికిల బడిన ఆసీస్ పై టీం ఇండియా ఘన విజయం సాధించింది.
పెర్త్ టెస్టులో టీం ఇండియా విజయం సాధించింది. ఆసీస్ కు రెండో ఇన్నింగ్స్ లో నిర్దేశించిన 534 పరుగుల లక్ష్యాన్ని చేధించటంలో ఆసీస్ బ్యాటర్లు విఫలమయ్యారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 12 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. ఈ రోజు నాలుగో రోజు ఆట ప్రారంభం నుంచి భారత బౌలర్లు ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. పెర్త్ టెస్టు లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 104 పరుగులకే ఆలౌట్ అయింది. నాలుగో రోజున ఆసీస్ ను గట్టెక్కించటానికి మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ చివరి వరకు ప్రయత్నించారు.

భారత్ రెండో ఇన్నింగ్స్ లో ఇద్దరు సెంచరీలు నమోదు చేసారు. తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ ను బారత్ 104 పరుగులకు పరిమితం చేసింది. దీంతో, భారత్ కు 46 పరుగుల ఆధిక్యత లభించింది. రెండో ఇన్నింగ్స్ లో జైశ్వాల్ అద్బుత బ్యాటింగ్.. కోహ్లీ సెంచరీతో ఆరు వికెట్లకు 487 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. విరాట్ 143 బంతుల్లో 100 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడాడు. టెస్టు కెరీర్‌లో 30వ సెంచరీ కాగా, మొత్తం మూడు ఫార్మాట్లలో 81వ సెంచరీ.
సచిన్ టెండూల్కర్‌ను అధిగమించి ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన భారత బ్యాట్స్‌మెన్‌గా విరాట్ నిలిచాడు. ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు రాణించారు. దీంతో, 295 పరుగులతో టీం ఇండియా విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో బూమ్రా, సిరాజ్ కు 3 వికెట్లు చొప్పున..సుందర్ కు రెండు వికెట్లు దక్కాయి. నితీశ్, హర్షిత్ కు చెరో వికెట్ లభించింది. 238 పరుగులకే ఆలౌట్ కావటంతో పెర్త్ లో భారత్ విజయం సాధించింది.












Click it and Unblock the Notifications