జింబాబ్వేతో గెలుపే కాదు.. ఛేజింగ్, టార్గెట్ లెక్క ఇదీ - అప్పుడే సెమీస్ కు..!!
T20 World cup: టీం ఇండియా సెమీస్ చేరుతుందా. చేరే అవకాశం ఉంది. అయితే, ఇందుకు చాలా లెక్కలు అధిగమించాలి. ఈ రోజు జింబాబ్వేతో జరిగే మ్యాచ్ లో గెలుపు మాత్రమే కాదు, అంతకు మించి అన్నట్లు ఆడాలి. గెలవాలి. రన్ రేటు సాధించాలి. అటు సౌతాఫ్రికా- వెస్టిండీస్ మ్యాచ్ సైతం టీమిండియా సెమీస్ అవకాశాల పైన ప్రభావం చూపనుంది. జింబాబ్వేతో భారత్ గెలుపుతో పాటుగా.. తొలుత బ్యాటింగ్ చేస్తే నిర్దేశించాల్సి లక్ష్యం.. జింబాబ్వేను ఎంతకు కట్టడి చేయాలి.. అదే విధంగా ఛేజింగ్ అయితే లక్ష్యం ఎన్ని ఓవర్లలో ఛేదించాలనేది టీమిండియా సెమీస్ లెక్కలకు కీలకంగా మారుతోంది.
చెన్నైలో జింబాబ్వే తో టీమిండియా ఆడే మ్యాచ్ కీలకంగా మారనుంది. ఈ ప్రపంచ కప్ లీగ్ దశలో జింబాబ్వే టీం ఊహించని ఫలితాలు సాధించింది. ఇక.. వెస్టిండీస్ - జింబాబ్వే మధ్య జరిగిన సూపర్ -8 మ్యాచు లో వెస్టిండీస్ భారీ విజయం నమోద చేయటంతో టిమిండియా మరింత కష్టాల్లోకి వెళ్లింది. భారత్ సెమీస్ అవకాశాలను కరేబియన్ టీం వెనక్కు నెట్టేసింది. ఇప్పుడు గెలుపుతో పాటుగా నెన్ రన్ రేటు కీలకంగా మారుతోంది. ప్రస్తుతం మైనస్ లో ఉన్న టీమిండియా రన్ రేట్ ప్లస్ లోకి రావటం తో పాటుగా మిగిలిన మూడు టీంల లెక్కల కంటే మెరుగైన స్థాయిలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అందులో భాగంగా జింబాబ్వేపై భారీ తేడాతో గెలవడం భారత్‌కు అత్యవసరం. జింబాబ్వేతో జరిగే మ్యాచులో భారత్ ముందుగా బౌలింగ్ చేస్తే, ప్రత్యర్థిని తక్కువ స్కోర్‌కే కట్టడి చేసి, లక్ష్యాన్ని చాలా వేగంగా చేధించాలి. టార్గెట్ చిన్నగా ఉంటే తక్కువ ఓవర్లలో చేధించడం సులభమవుతుంది. అయినప్పటికీ, బ్యాటింగ్‌లో దూకుడుగా ఆడాల్సిందే. ఇందు కోసం కావాల్సిన లెక్కలు సిద్ధమయ్యాయి.
జింబాబ్వేతో గెలుపే కాదు.. అంతకు మించి
తొలుత జింబాబ్వే బ్యాటింగ్ చేస్తే వారు నిర్దేశించే లక్ష్యాన్ని ఓవర్ కు 14 పరుగుల చొప్పున చేధింజి విజయం నమోదు చేసుకోవాలి. లక్ష్యం 150 పరుగులు ఉంటే, భారత్ 11 ఓవర్లలోనే మ్యాచ్ ముగించాలి. అదే విధంగా భారత్ ముందుగా బ్యాటింగ్ చేస్తే కనీసం 220 నుంచి 250కి పైగా పరుగులు చేయాలి. అనంతరం ప్రత్యర్థిని 100-120 లేదా అంతకంటే తక్కువ స్కోర్‌కే కట్టడి చేయాలి. ప్రత్యర్థిని ఆలౌట్ చేస్తే ఓవర్లు ఆదా అవుతాయి కాబట్టి NRRకి మరింత లాభం ఉంటుంది.
సౌతాఫ్రికా.. వెస్టిండీస్ భారీగా రన్ రేటుతో ఉండటంతో.. సూర్య టీం వచ్చే రెండు మ్యాచుల్లో సాదా సీదా విజయం సాధిస్తే సరిపోదు. భారీ రన్ రేటుతో గెలిస్తేనే సెమీస్ కు అవకాశం ఉంటుంది. దీంతో.. ఇప్పుడు జింబాబ్వేతో మ్యాచ్ వేళ తుది జట్టు ఎంపిక.. ఆట తీరు.. ఫలితం.. రన్ రేటు పైన టీం తో పాటుగా ఫ్యాన్స్ లోనూ ఉత్కంఠ పెరుగుతోంది. అటు అహ్మదాబాద్ లో సౌతాఫ్రికా - వెస్టిండీస్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా గెలుపు టీమిండియాకు అవసరం. లేకపోతే చివరి నిమిషం వరకు టెన్షన్ తప్పదు.
-
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..












Click it and Unblock the Notifications