T20 WorldCup 2024: ఐపీఎల్ లో సూపర్ హీరోలు- టీ20 వరల్డ్ కప్ ఛాన్స్ మాత్రం మిస్..!
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో పలువురు భారతీయ ఆటగాళ్లు విశేషంగా రాణిస్తున్నారు. అలాగే భారీగా డబ్బులూ సంపాదిస్తున్నారు. వీరి పారితోషకాలు రికార్డు స్ధాయిలో ఉన్నాయి. అయితే వీరిలో చాలా మంది టీ20 వరల్డ్ కప్ కు మాత్రం ఎంపిక కాలేకపోయారు. ఇలా ఐపీఎల్ లో భారీ పారితోషికాలు అర్జిస్తూ టీ20 వరల్డ్ కప్ కు ఎంపిక కాలేకపోయిన వారి గురించి ఇప్పుడు అభిమానులు చర్చించుకుంటున్నారు.
బీసీసీఐ తాజాగా టీ20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన 15 మంది సభ్యుల జట్టులో రోహిత్ శర్మ కెప్టెన్ గా, హార్ధిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యారు. అలాగే యశస్వీ జైశ్వాల్, శుభ్ మన్ గిల్, సంజూ శాంసన్, రిషబ్ పంత్, యజ్వేంద్ర చాహల్ వంటి వారికి చోటు దక్కింది. అయితే ఈ జాబితాలో ప్రస్తుత ఐపీఎల్ లో ఫ్రాంచైజీలు భారీ పారితోషకాలు అందిస్తున్న కొందరు భారత ఆటగాళ్లు మాత్రం ఈ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయరు.

ఇలా ఐపీఎల్ లో భారీగా అర్జిస్తూ టీ20 వరల్డ్ కప్ జట్టులో స్ధానం దక్కించుకోలేకపోయిన ఆటగాళ్లలో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (12.25 కోట్లు), లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ (రూ.17 కోట్లు), పంజాబ్ కింగ్స్ పేసర్ హర్షల్ పటేల్ (రూ.11.75 కోట్లు), చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ దీపక్ చాహర్ (రూ.14 కోట్లు), ముంబై ఇండియన్స్ ఓపెనర్ ఇషాన్ కిషన్
(రూ.15.25) కోట్లు ఉన్నారు. అయితే వీరు అర్జిస్తున్న మొత్తాలకు టీ20 వరల్డ్ కప్ లో చోటు దక్కకపోవడానికి ఏమాత్రం సంబంధం లేదు. వారి వ్యక్తిగత ప్రదర్శనల ఆధారంగానే ఎంపిక కాలేకపోయారు.












Click it and Unblock the Notifications