ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టాడు:ఆస్ట్రేలియాపై వైభవ్ సునామీ ఇన్నింగ్స్..!!
Vaibhav Suryavanshi:ఐపీఎల్ సంచలనం, చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ మరో మారు చెలరేగిపోయాడు. ఆస్ట్రేలియాతో ఆ దేశంతో జరుగుతున్న అండర్ 19 యూత్ టెస్ట్‌లో వైభవ్ బ్యాట్‌తో కుమ్మిపారేశాడు. బ్రిస్బేన్‌లోని ఇయాన్ హీలీ ఓవల్‌లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో వైభవ్ సెంచరీతో కదం తొక్కాడు.
కుమ్మి వదిలేశాడు..
ఆస్ట్రేలియాతో జరుగుతున్న అండర్-19 యూత్ టెస్టులో వైభవ్ సూర్యవంశీ తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. వన్డే సిరీస్‌లో రెచ్చిపోయిన ఈ యంగ్ గన్.. అదే ఊపును టెస్టు మ్యాచ్‌లో సైతం కంటిన్యూ చేస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో రెచ్చిపోయిన వైభవ్... కెప్టెన్ ఆయుష్ మాత్రే రికార్డును చెరిపివేశాడు. యూత్ టెస్టులో అత్యధిక సిక్సులు బాదిన రికార్డు కెప్టెన్ ఆయుష్ మాత్రే పేరిట ఉంది. కేవలం మూడు సిక్సులు కొడితే మాత్రే రికార్డును బ్రేక్ చేస్తాడని అనుకున్న సమయంలో వైభవ్‌కు ఎంతో సమయం పట్టలేదు. ఇక మొత్తంగా ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్ కేవలం 78 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఇందులో ఏడు బౌండరీలు, ఏడు సిక్సులు ఉన్నాయి.

ఫార్మాట్ ఏదైనా సరే రెచ్చిపోవడమే పనిగా పెట్టుకున్నాడు ఈ టాలెంటెడ్ యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ. క్రీజులో ఉన్నంత సేపు ప్రత్యర్థులను ఊపిరీ తీసుకోకుండా ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టాడు. యూత్ టెస్టులో మొత్తంగా 14 సిక్సులు కొట్టిన ఘనత వైభవ్‌కే దక్కుతుంది.అంతకు ముందు 9 సిక్సులు కొట్టిన రికార్డు మాత్రే పేరిట ఉంది. ఇక మాత్రే తొలి సెషన్‌లోనే 15 బంతుల్లో 21 పరుగులు చేసి పెవీలియన్ బాట పట్టాడు.సెంచరీతో కదం తొక్కిన సూర్యవంశీ ఇదే ఊపును కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ లీడ్‌లో ఉంది.
ఆస్ట్రేలియాను కట్టడి చేసిన టీమిండియా
యూత్ టెస్టు తొలి రోజున బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా టీమిండియా బౌలర్ల ధాటికి కేవలం 243 పరుగులు మాత్రమే చేయగలిగింది.ఆసీస్ బ్యాట్స్‌మెన్ స్టీవెన్ హోగన్ 246 బంతుల్లో 92 పరుగులు చేయడంతో ఆసీస్ ఆమాత్రమైన స్కోరు చేయగలిగింది.ఓ వైపు ఒంటరి పోరాటం చేస్తున్న స్టీవెన్‌కు మరో ఎండ్ నుంచి మద్దతు లభించకపోవడంతో ఆస్ట్రేలియా 243 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించేసింది.ఇక టీమిండియా బౌలర్లలో దీపేష్ దేవేంద్రన్ బంతితో మెరిశాడు. 16.2 ఓవర్లు వేసిన దీపేష్.. 45 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కూల్చాడు.మరో వైపు కిషన్ కుమార్ మూడు వికెట్లు తీసి కీలకంగా నిలిచాడు.












Click it and Unblock the Notifications