Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ. ఇప్పుడు ఈ పేరు ఓ సంచలనం. ఐపీఎల్ వైభవ్ సూర్య వంశీ పేరు కాదు.. ఒక బ్రాండ్. అతి పిన్న వయసులో దిగ్గజాలైన బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. బౌలర్ ఎవరైనా సరే.. బంతిని బౌండరీకి తరలించటమే అతని లక్ష్యం. యావత్ క్రికెట్ ఫ్యాన్స్ ప్రశంసలతో ముంచెత్తున్నారు. ప్రత్యర్థి టీంలకు చెమటలు పట్టిస్తున్న వైభవ్ సూర్య వంశీ ఆదాయ లెక్కలు అంతే సంచలనం. ఈ యువ కెరటం సంపాదన లెక్కలు మరీ ఆసక్తి కరం.
వైభవ్ సూర్యవంశీ. గత ఏడాది ఐపీఎల్ తో ఆరంగేట్రం చేసి.. ప్రస్తుత సీజన్ లో సంచలనంగా ఎదిగాడు. వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ కోసం యావత్ క్రికెట్ ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు. వణికించే బౌలర్లకు సైతం చుక్కలు చూపిస్తున్నాడు. 15 ఏళ్ల వయసులో ఐపీఎల్ క్రికెట్ లో సంచలనాలు నమోదు చేస్తున్న ఈ కుర్రాడి సంపాదన పైన చర్చ జరుగుతోంది. వచ్చే ఐపీఎల్ ఆక్షనలో వైభవ్ కోసం ఫ్రాంచైజీలు ఎంత పెట్టటానికైనా సిద్ధపడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఆర్సీబీ, ముంబాయి ఇండియన్స్ వైభవ్ కోసం పోటీలో ఉన్నట్లు ఇప్పటికే ప్రచారం సాగుతోంది. అయితే, అసలు రాజస్థాన్ వైభవ్ ను వదులుకుంటుందా అనేది సందేహమే. ఎక్కడా గర్వం లేకుండా పూర్తిగా పరిణితి సాధించిన తరహాలో వైభవ్ ఆటతీరు అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఇక, వైభవ్ ఆదాయం పైన ఆసక్తి కర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.

వైభవ్ సూర్యవంశీ ఆదాయ లెక్కలు
ఐపీఎల్ 2026 వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు వైభవ్ సూర్యవంశీని రూ.1.10 కోట్లకు సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చిన్న వయస్కుడైన ఆటగాడిగా రికార్డు సృష్టించిన వైభవ్ ఒక్కో మ్యాచ్‌కు రూ. 15 లక్షలకు పైగా ఆదాయం వస్తోంది. లీగ్ దశలోని 14 మ్యాచ్‌లకు వైభవ్ సూర్యవంశీ చేసుకున్న ఒప్పందం మేరకు ఒక్కో మ్యాచ్‌కు సుమారు రూ. 7.85 లక్షల ఆదాయం సమకూరుతుంది. కాగా.. ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. ఆడే ప్రతి మ్యాచ్‌కు అదనంగా రూ. 7.50 లక్షల మ్యాచ్ ఫీజు లభిస్తుంది. ఈ రెండు రకాల ఆదాయం కలిపితే, వైభవ్ ఒక్కో మ్యాచ్‌కు సుమారు రూ. 15.35 లక్షలు సంపాదిస్తున్నాడు. అదే విధంగా వీటితో సంబంధం లేకుండా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లేదా ఇతర అవార్డుల రూపంలో వచ్చే నగదు బహుమతులు అదనం. సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన వైభవ్, తండ్రి సంజీవ్ సూర్యవంశీ ప్రోత్సాహంతో నాలుగేళ్ల ప్రాయంలోనే బ్యాట్ పట్టాడు. భారత క్రికెట్ ను శాసించే స్థాయికి వైభవ్ సూర్యవంశీ ఎదుగుతాడనే అంచనాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications