India-Pakistan Match: అతనే డేంజర్..! జాగ్రత్త.. సూర సేనకు భజ్జీ వార్నింగ్..!

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా కీలకమైన భారత్-పాక్ మ్యాచ్ కు రంగం సిద్ధమవుతోంది. రేపు సాయంత్రం శ్రీలంకలోని కొలంబో వేదికగా జరిగే ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరు జట్లూ కూడా సన్నాహాల్లో మునిగితేలుతున్నాయి. అదే సమయంలో ఈ మ్యాచ్ లో టర్నింగ్ పాయింట్ గా భావిస్తున్న ఓ కీలక అంశంపై టీమిండియాకు భారత మాజీ స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ (harbhajan singh)ఓ కీలక సూచన తో కూడిన హెచ్చరిక చేశాడు.

ఈసారి భారత్-పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో అందరి దృష్టీ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ పైనే ఉంది. దీనికి కారణం అతని వివాదాస్పద బౌలింగ్ యాక్షనే. బౌలింగ్ వేయడం ప్రారంభించిన తర్వాత ఒక్క సెకన్ ఆగి అతను బంతులు విసురుతున్న తీరుపై ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో తీవ్ర చర్చ జరుగుతోంది. అతను చకింగ్ చేస్తున్నాడని, ఐసీసీ నిబంధనలకు విరుద్దంగా బౌలింగ్ చేస్తున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఐసీసీ మాత్రం అధికారికంగా ఫిర్యాదు రాకపోవడంతో సైలంట్ గా చూస్తోంది.

Legendary Spinner Harbhajan Singh s Blunt Warning to Team India before Facing Pakistan

ఇలాంటి సమయంలో జరుగుతున్న భారత్-పాక్ మ్యాచ్ లో ఈ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ పాత్ర కీలకంగా మారింది. దీంతో భారత స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ భారత బ్యాట్స్ మెన్ కు ఓ కీలక హెచ్చరిక చేశాడు. రాంచీలో మీడియాతో మాట్లాడిన హర్భజన్.. ఈ మ్యాచ్‌లో భారత్ గెలుస్తుందని, అయితే పాకిస్థాన్‌లో ఒక స్పిన్నర్ (ఉస్మాన్ తారిక్) ఉన్నాడని, అతను మంచి స్పిన్నర్ అని చెప్పుకొచ్చాడు. మనం అతన్ని జాగ్రత్తా ఆడాల్సి ఉంటుందన్నాడు. భారత జట్టుకు సమర్ధత ఉందని, ఇది చాలా మంచి జట్టు అని,వారు ఎప్పుడూ ఆడిన విధంగానే ఆడతారని, ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆడతారని, విజయపతాకం ఎగురవేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+