అనంతపురంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మకాం: టీమిండియా ప్లేయర్లూ: అక్కడే కీలక మ్యాచ్‌లు

Rohit Sharma and Virat Kohli: భారత జట్టు కేప్టెన్ రోహిత్ శర్మ, బ్యాటింగ్ మెషీన్ విరాట్ కోహ్లీ.. అనంతపురానికి రానున్నారు. వారితో పాటు జాతీయ జట్టులో ఆడే కొందరు సీనియర్ ప్లేయర్లూ అనంతపురంలో మకాం ఉండబోతోన్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ చకచకా పూర్తి చేస్తోంది.

రంజీ మ్యాచ్‌లను ఆడబోతోండటమే దీనికి కారణం. దేశవాళీ క్రికెట్‌లో భాగంగా దులీప్ ట్రోఫీ టోర్నమెంట్‌ను అనంతపురంలో నిర్వహించబోతోంది బీసీసీఐ. అనంతపురంలోని రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ)కి చెందిన స్టేడియం.. ఈ టోర్నమెంట్‌కు ఆతిథ్యాన్ని ఇవ్వబోతోంది.

Virat Kohli and Rohit Sharma set to play in the Duleep Trophy

దులీప్ ట్రోఫీని ఆడాలని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నిర్ణయించారు. తొమ్మిది సంవత్సరాల తరువాత దులీప్ ట్రోఫీ టోర్నమెంట్‌తో రోహిత్ శర్మ మళ్లీ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అడుగుపెట్టబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. సుదీర్ఘ విరామం తరువాత విరాట్ కోహ్లీ కూడా దేశవాళీ మ్యాచ్‌లను అడనున్నాడు.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు కేఎల్ రాహుల్, రవీంద్రజడేజా, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, తిలక్ వర్మ, షాబాజ్ అహ్మద్,.. ఇలా జాతీయ జట్టు తరఫున ఆడుతున్న స్టార్ ప్లేయర్లందరూ అనంతపురంలో ప్రత్యక్షం కాబోతోన్నారు. ఫ్యాన్స్‌ను ఆలరించనున్నారు.

సెప్టెంబర్ 5వ తేదీన దులీప్ ట్రోఫీ తొలి మ్యాచ్ జరుగనుంది. అదే నెల 22వ తేదీ వరకు కొనసాగుతుంది. అంటే దాదాపుగా మూడు వారాల పాటు జాతీయ జట్టు క్రికెటర్లు అనంతపురంలో మకాం ఉండబోతోన్నారు. దులీప్ ట్రోఫీ టోర్నమెంట్ ఆడబోయే జట్లన్నీ ఇక్కడికి రానున్నాయి.

వెస్ట్ జోన్, సౌత్ జోన్, ఈస్ట్ జోన్, నార్త్ జోన్, సెంట్రల్ జోన్, నార్త్-ఈస్ట్ జోన్ టీమ్‌లు ఈ మ్యాచ్‌లను ఆడనున్నాయి. ఆయా జట్లల్లో అనేకమంది ఐపీఎల్ ప్లేయర్లు సైతం ఉన్నారు. శివం మావి, అవేష్ ఖాన్, ధృవ్ జురేల్, యాష్ ఠాకూర్, నెహాల్ వధేరా, ప్రభ్‌సిమ్రన్ సింగ్, హర్షిత్ రాణా, సాయి సుదర్శన్ వంటి స్టార్లు అనంతపురంలో మెరుపులు మెరిపించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+