సచిన్ రికార్డులను బద్దలు కొడుతూ 50సెంచరీలతో విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డ్ !!

ముంబై లోని వాంఖడే స్టేడియంలో న్యూజీలాండ్ పై సెంచరీ సాధించిన కోహ్లీ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 49 సెంచరీల రికార్డును బద్దలుకొట్టి 50 సెంచరీలతో చరిత్ర సృష్టించాడు. ప్రపంచ కప్ 2023 సెమీ ఫైనల్ లో భాగంగా ఈరోజు మధ్యాహ్నం టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ కు దిగింది.

అయితే ఆరంభంలో న్యూజిలాండ్ పై ఎదురు దాడికి దిగిన రోహిత్ శర్మ 47 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుటయ్యాడు. ఆ తరువాత క్రీజు లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఆచి తూచి ఆడుతూ, సందర్భం వచ్చినప్పుడల్లా బ్యాట్ ఝుళిపించాడు.. 59 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న విరాట్ 106బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు . తను అవుటయ్యే సమయానికి 113 బంతుల్లో 117పరుగులు చేశాడు.

Virat Kohli broke Sachin record with 50 centuries in oneday matches

అయితే విరాట్ చేసిన ఈ సెంచరీతో సచిన్ పేరిట ఉన్న వన్డేల్లో అత్యధిక సెంచరీల రికార్డు తుడిచి పెట్టుకుపోయింది. సెంచరీలతోనే కాకుండా విరాట్ సచిన్ పేరిట ఉన్న మరో రికార్డ్ నూ బ్రేక్ చేశారు. ఇప్పటివరకు ఒక ప్రపంచకప్ సిరీస్ లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డు 673 పరుగులతో సచిన్ పేరిట ఉండేది. దానిని 694 పరుగులతో ఈరోజు విరాట్ బ్రేక్ చేశారు.

ఈ ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 694 పరుగులు చేసి వరల్డ్ కప్ లో సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 673పరుగుల రికార్డునూ బ్రేక్ చేశారు. ఈ ప్రపంచకప్ లో ఇప్పటి వరకూ 10 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి ఎనిమిది మ్యాచ్‌లలో అద్భుత ప్రదర్శన చేశాడు. ఎనిమిది మ్యాచ్‌లలో మూడు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలు సాధించి సిరీస్ లోనే టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

అయితే ఈ రెండు రికార్డులు కూడా సచిన్ టెండూల్కర్ సమక్షంలోనే బ్రేక్ అయ్యాయి... స్టేడియంలో సచిన్ మ్యాచ్ చూస్తుండగా విరాట్ అత్యధిక సెంచరీలు, అత్యధిక పరుగుల రికార్డును సాధించడం ప్రేక్షకులకు మర్చిపోలేని మధుర జ్ఞాపకంగా మిగిలిపోనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+