మగ జన్మకు ఎన్ని శోకాలో..: పబ్లిగ్గా ప్రియుడి చెంప ఛెల్లుమనిపించిన గడసరి

ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో మట్టికరిపించింది. 121 పరుగుల లక్ష్యచేధనలో భాగంగా 63/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన భారత్.. మిగిలిన పరుగులను చేరుకోవడానికి పెద్దగా శ్రమించలేదు. ఎక్కువ సమయం కూడా తీసుకోలేదు. 35.2 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. క్లీన్ స్వీప్ చేసింది.

కేఎల్ రాహుల్ మరోసారి సత్తా చాటాడు. హాఫ్ సెంచరీతో రాణించాడు. 108 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58 నాటౌట్ గా నిలిచాడు. సాయి సుదర్శన్- 39, కేప్టెన్ శుభ్‌మన్ గిల్- 13 త్వరగా అవుట్ అయినా వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ తో కలిసి సాయంతో జట్టుకు విజయాన్ని అందించాడు. విండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. జోమెల్ వారికన్‌కు ఓ వికెట్ దక్కింది. ఈ గెలుపుతో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను టీమిండియా 2-0తో క్లీన్ స్వీప్ చేసింది.

Watch the Hilarious Moment Girl Playful Slaps Boy during India vs West Indies Test

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 518/5 భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 248 పరుగులకు ఆలౌట్ అయింది. ఫాలో ఆన్ ఆడిన వెస్టిండీస్ నిలదొక్కుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో 390 పరుగులు చేసింది. జాన్ కాంప్‌బెల్- 115, షై హోప్- 103 సెంచరీలతో కదం తొక్కారు. జస్టిన్ గ్రీవ్స్ 50 పరుగులతో నాటౌట్ నిలిచాడు. చివరి వికెట్ కు ఏకంగా 79 పరుగులు జోడించడం హైలైట్ గా చెప్పుకోవచ్చు.

నాలుగో రోజు మ్యాచ్ కొనసాగుతున్నప్పుడు అరుణ్ జైట్లీ స్టేడియంలో ఓ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. ఈ వీడియో క్లిప్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. మ్యాచ్ చూడ్డానికి వచ్చిన ఓ జంట సరదాగా గొడవ పడటాన్ని కెమెరామెన్ బంధించాడు. ఆ తర్వాత కూడా వారి మీదే కెమెరా ఎక్కువ సేపు ఫోకస్ అయింది కూడా. తన బాయ్ ఫ్రెండ్ ను ఆ అమ్మాయి పదే పదే చెంపలకేసి కొడుతుండటం ఈ వీడియోలో రికార్డయింది. మెడలో చెయ్యివేసి ముఖం మీద పంచ్ లు కొట్టడం చూడొచ్చు. సరదాకే అయినప్పటికీ- ఈ వీడియో విపరీతంగా సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతోంది. అదే స్థాయిలో రిప్లైలు ఇస్తోన్నారు నెటిజన్లు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+