Ind Vs Pak: బాబర్ లక్కు బాగుంది - సెమీస్ లో భారత్ వర్సస్ పాక్, వేదిక మార్పు..!!
World Cup Semis 2023, India Vs Pakistan: ప్రపంచ కప్ లో సెమీస్ బెర్తులు ఉత్కంఠగా మారుతున్నాయి. అన్ని టీంలు ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఆదివారం భారత్ వర్సస్ నెదర్లాండ్స్ మ్యాచ్ తో లీగ్ దశ పూర్తి కానుంది. ఇప్పటికే సెమీస్ లో భారత్, దక్షిణాఫ్రికా, ఆసీస్ తమ బెర్తులు ఖాయం చేసుకున్నాయి. నాలుగో బెర్తు కోసం పాకిస్థాన్, న్యూజీలాండ్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య పోటీ నెలకొంది. కానీ, పాకిస్థాన్ కు లక్కు కలిసి వస్తోంది. సెమీస్ బెర్తు ఖాయంగా కనిపిస్తోంది.
మారుతున్న సెమీస్ లెక్కలు:ప్రపంచ కప్ పాయింట్ల పట్టికలో భారత్ తొలి స్థానంలో ఉంది. భారత్ సెమీస్ లో నాలుగో స్థానంలో నిలిచే జట్టుతో తల పడాల్సి ఉంటుంది. ఒక సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా అమీతుమీ తలబడనుండగా.. ఇండియాను ఢీకొనే జట్టు ఏదనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పాయింట్ల పట్టికలో న్యూజీలాండ్, పాకిస్థాన్, ఆఫ్గనిస్తాన్ 8 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఈ రోజు బెంగళూరు మ్యాచ్ లో కివీస్ వర్సస్ శ్రీలంక మ్యాచ్ న్యూజీలాండ్ కు కీలకంగా మారుతోంది. కానీ, తాజా సమాచారం మేరకు మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉంది. చిన్నస్వామి స్టేడియంలో న్యూజీలాండ్ వర్సస్ పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో కివీస్ భారీ స్కోరు చేసినా..డక్ వర్త్ లెక్కలతో పాక్ గెలుపొందింది.

ఇండియా వర్సస్ పాక్ :ఇక, ఈ రోజు వర్షం కారణంగా మ్యాచ్ రద్దయినా..లంకపై ఓడినా కివీస్ కు సెమీస్ ఛాన్స్ దాదాపు లేనట్లే. మ్యాచ్ రద్దయితే రెండు టీంలకు చెరో పాయింట్ వస్తుంది. అప్పుడు కివీస్, పాక్ 9 పాయింట్లతో ఉంటాయి. పాకిస్థాన్ చివరి మ్యాచ్ ఇంగ్లాండ్ తో తలపడాల్సి ఉంటుంది. ఆ మ్యాచ్ లో పాంలోని ఇంగ్లాండ్ పైన పాకిస్థాన్ గెలవటం కష్టం కాదనే విశ్లేషణలు ఉన్నాయి. అదే జరిగితే పాకిస్థాన్ కు సెమీస్ బెర్తు ఖాయం అయినట్లే. బెంగళూరులో మ్యాచ్ జరిగి లంక చేతిలో న్యూజిలాండ్ ఓడిపోయి.. ఇంగ్లాండ్‌ను పాకిస్తాన్ మట్టికరిపించినా.. బాబర్ అజామ్ జట్టు సెమీస్ చేరుతుంది. ఈ లెక్కన ఆట కంటే లక్కుతో న్యూజిలాండ్ కంటే పాకిస్థాన్ కు సెమీస్ చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా క్రికెట్ విశ్లేషకులు ఇదే అంచనా వేస్తున్నారు.
భారత్ వర్సస్ పాక్ వేదిక మార్పు:పాకిస్థాన్ సెమీస్ చేరితే మ్యాచ్ జరిగే వేదిక మారనుంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకు తొలి సెమీస్ ముంబాయి వేదికగా ఈ నెల 15న జరగాల్సి ఉంది. అయితే, అంచనాలను నిజం చేస్తూ పాకిస్థాన్ సెమీస్ చేరితే ఈ మ్యాచ్ ముంబాయి నుంచి కోల్ కతాకు మారనుంది. సెమీస్ షెడ్యూల్ ప్రకటించిన సమయంలోనే ముంబాయి వెళ్లేందుకు పాకిస్థాన్ నిరాకరించింది. ఆసీస్ - దక్షిణాఫ్రికా రెండో సెమీస్ మాత్రం ముంబాయి వేదికగానే జరగనుంది. దీంతో, ఈ రోజు కివీస్ - శ్రీలంక బెంగళూరు మ్యాచ్ పైన వర్షం..ఫలితం ఆధారంగా సెమీస్ లో భారత్ తో తలపడేది ఎవరనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు అంచనాలకు భిన్నంగా మ్యాచ్ జరిగి కివీస్ గెలిస్తే...సెమీస్ లో భారత్ వర్సస్ కివీస్ మ్యాచ్ పైన మరోసారి అంచనాలు పెరగటం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications