హైదరాబాద్‌లో చీకట్లో మగ్గిన న్యూజిలాండ్ క్రికెటర్లు
హైదరాబాద్: ఐసీసీ ప్రపంచ కప్ 2023లో భారత జట్టు బోణీ కొట్టింది. చెన్నై చెపాక్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఆరు వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన ఓ మోస్తరు లక్ష్యాన్ని 41.2 ఓవర్లల్లో ఛేదించింది. కేఎల్ రాహుల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 199 పరుగులకు ఆలౌట్ అయింది. స్టీవెన్ స్మిత్- 46, డేవిడ్ వార్నర్- 41 పరుగులు చేశారు. ఇన్నింగ్ మొత్తానికీ వారిద్దరే టాప్ స్కోరర్లు. మిఛెల్ స్టార్క్- 28, మార్ముస్ లాంబుషెన్- 27, పాట్ కమ్మిన్స్- 15, గ్లెన్ మ్యాక్స్‌వెల్- 15 పరుగులు చేశారు.

అంతకుముందు- జరిగిన మ్యాచ్‌లల్లో న్యూజిలాండ్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా విజయఢంకా మోగించాయి. తమ ప్రత్యర్థులను మట్టికరిపించాయి. భారత్- ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్- ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌లు మినహా మిగిలినవన్నీ భారీ ఇన్నింగ్స్‌లే. ప్రత్యేకించి న్యూజిలాండ్- ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా- శ్రీలంక మ్యాచ్‌లల్లో పరుగులు వరదలయ్యాయి.
గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్.. ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది. ఆ జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని ఇద్దరే ఇద్దరు బ్లాక్ క్యాప్స్ కొట్టి అవతల పడేశారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన చేసిన ఇంగ్లాండ్.. నిర్ణీత 50 ఓవర్లల్లో తొమ్మిది వికెట్ల నష్టానికి 282 పరుగులు చేయగా.. ఈ టార్గెట్‌ను ఇద్దరే ఇద్దరు కొట్టేశారు. ఓపెనర్ డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర సెంచరీ బాదారు.
ఇదే ఊపుతో తన రెండో మ్యాచ్‌ను ఆడబోతోంది న్యూజిలాండ్. నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ఈ మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరుగనుంది ఈ మ్యాచ్. న్యూజిలాండ్‌కే కాదు- నెదర్లాండ్స్‌కూ ఇది రెండో మ్యాచే. పాకిస్తాన్‌తో ఇదే ఉప్పల్ స్టేడియంలో పాకిస్తాన్ చేతిలో ఓటమి చవి చూసింది నెదర్లాండ్స్.
కాగా- ఈ మ్యాచ్ కోసం ఆదివారం రాత్రి నిర్వహించిన ప్రీ- ప్రెస్ కాన్ఫరెన్స్‌లో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ మాట్లాడాడు. తమ గేమ్ ప్లాన్ ఎలా ఉండబోతోందో వివరించాడు. చిన్న జట్టే అయినప్పటికీ- నెదర్లాండ్స్‌ను ఏ మాత్రం తక్కువగా అంచనా వేయట్లేదని చెప్పాడు. నెదర్లాండ్స్‌లో ఆల్ రౌండర్లు ఉన్నారని కితాబిచ్చాడు.
బ్యాట్‌తో కూడా అద్భుతమైన మొత్తాన్ని అందించే శాంట్నర్ లాంటి ఫ్రంట్‌లైన్ స్పిన్నర్ తమ జట్టులో కీలక పాత్ర పోషిస్తోన్నాడని, వరల్డ్ కప్‌లో అతను టాపర్‌గా నిలుస్తాడని గ్లెన్ ఫిలిప్స్ చెప్పుకొచ్చాడు. రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే ఈ టోర్నమెంట్ మొత్తానికీ తమ ఫామ్‌ను కొనసాగిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పాడు.

వన్డే ఇంటర్నేషనల్స్‌లల్లో 270 పరుగులు దాటితే అది అసాధారణమైన స్కోర్‌గా భావిస్తారని, అలాంటి స్కోర్‌ను డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర ఇద్దరే ఛేదించడం- జట్టు ఫామ్ ఎలాంటిదనేది తెలియజేస్తోందని పేర్కొన్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగే మూడో గేమ్ నాటికి కేన్ విలియమ్సన్ జట్టుకు అందుబాటులోకి రావొచ్చని వ్యాఖ్యానించాడు.
కాగా- గ్లెన్ ఫిలిప్స్ విలేకరుల సమావేశంలో మాట్లాడే సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. కొన్ని నిమిషాల పాటు పవర్ కట్ కొనసాగింది. అయినప్పటికీ- గ్లెన్ ఫిలిప్స్ తన విలేకరుల సమావేశాన్ని కొనసాగించాడు. మొబైల్ ఫ్లాష్ లైట్ వెలుగులో అతను ప్రెస్ కాన్ఫరెన్స్‌ను కంటిన్యూ చేశాడు. చీకట్లో అతను మాట్లాడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!!











Click it and Unblock the Notifications