World Cup Final: వరల్డ్ కప్ ఫైనల్ ఏకపక్షమే-ఎన్ని పరుగులతో గెలుస్తున్నామంటే-మిచెల్ మార్ష్ జోస్యం !
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ దశకు వచ్చేసింది. రేపు అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్డేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్ లో భారత్, ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. ఈ క్రమంలో ఫైనల్లో గెలిచే టీమ్ ఏదంటే ఆషామాషీగా చెప్పే పరిస్ధితి లేదు. నిన్న మొన్నటివరకూ వరుస విజయాలతో ఫైనల్ కు దూసుకొచ్చిన భారత్ హాట్ ఫేవరెట్ అని చెప్పేసిన వారు కూడా తాజాగా దక్షిణాఫ్రికాపై విజయం తర్వాత ఆస్ట్రేలియా ఓటమి ఖాయమని అంతే సులువుగా చెప్పలేకపోతున్నారు.
ఈ నేపథ్యంలో రేపు ఫైనల్ ఆడబోతున్న ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ ఈ మ్యాచ్ లో ఎవరు గెలవబోతున్నారో చెప్పేశాడు. ఫైనల్ మ్యాచ్ ఏకపక్షంగా సాగబోతోందని, అదీ గెలిచే జట్టు ఎన్ని పరుగులతో గెలుస్తుందో కూడా చెప్పేశాడు. అలాగే ఎన్ని వికెట్లు పడతాయో కూడా చెప్పేశాడు. దీంతో మిచెల్ మార్ష్ ఇంత కచ్చితంగా ఫైనల్ ను ఎలా అంచనా వేస్తున్నాడన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే గతంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ ను మిచెల్ మార్ష్ ఊహించడమే ఇందుకు మరో కారణం.

ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ అంచనా ప్రకారం రేపు భారత్ తో జరిగే ఫైనల్ పోరును ఆస్ట్రేలియా ఏకపక్షంగా గెలవబోతోందని అంచనా వేశాడు. ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసి 2 వికెట్ల నష్టానికి 450 పరుగులు చేయబోతోందని, ఛేజింగ్ లో భారత్ కేవలం 65 పరుగులకే ఆలౌట్ కాబోతోందని చెప్పేశాడు. దీంతో మిచెల్ మార్ష్ వరుస విజయాలతో భీకర ఫామ్ లో ఉన్న టీమిండియాను అంత తక్కువగా ఎలా అంచనా వేస్తున్నాడన్న దానిపై క్రికెట్ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.
మిచెల్ మార్ష్ అంచనా నిజమైతే ఆస్ట్రేలియా ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ ను 385 పరుగుల భారీ తేడాతో గెలుస్తున్నట్లు లెక్క. ఇది సాధ్యమయ్యే పనేనా అన్న చర్చ నడుస్తోంది. మిచెల్ మార్ష్ అంచనాల్ని సోషల్ మీడియాలో టీమిండియా ఫ్యాన్స్ తప్పుపడుతూ ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియా గతంలో 1987, 1999, 2003, 2007,, 2015లో టైటిల్స్ గెల్చుకుంది. ఈసారి కూడా ఆస్ట్రేలియా ఫైనల్ కు చేరుతుందని మార్ష్ అంచనా వేయగా ఇది నిజమైంది.












Click it and Unblock the Notifications