World Cup Final: ఫైనల్లో కలకలం-కొహ్లీ వద్దకు దూసుకొచ్చిన పాలస్తీనా మద్దతుదారుడు..
ఇవాళ భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ సందర్భంగా ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ మధ్యలో భారత బ్యాట్స్ మెన్ విరాట్ కొహ్లీ వద్దకు ఓ యువకుడు దూసుకొచ్చాడు. భద్రతా నిబంధనల్ని ఉల్లంఘించి మైదానంలో పరుగెడుతూ కొహ్లీ వద్దకు చేరుకుని అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశాడు. చేతిలో రంగురంగుల జెండాలతో కొహ్లీ వద్దకు దూసుకెళ్లిన సదరు యువకుడిని చూసి స్డేడియంలో అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు.
కొహ్లీ మైదానంలో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓవర్ల మధ్య విరామంలో కొహ్లీ నిలబడి ఉండగా.. ఒక్కసారిగా ప్రేక్షకుల గ్యాలరీ నుంచి ఓ యువకుడు పిచ్ వద్దకు దూసుకొచ్చాడు. సదరు ప్రేక్షకుడు పాలస్తీనాపై బాంబింగ్ ఆపండి అనే నినాదం ఉన్న టీ షర్ట్‌తో పాటు రంగు రంగుల కండువాలు కూడా ధరించాడు. సదరు ప్రేక్షకుడు మైదానంలోకి ప్రవేశించిన తర్వాత భారత బ్యాటర్ విరాట్ కోహ్లీని కౌగిలించుకోవడానికి ప్రయత్నించాడు. సెక్యూరిటీ వెంటనే రంగంలోకి దిగి అతడిని పట్టుకోవడంతో కోహ్లీ కూడా ఈ ఘటనపై అసంతృప్తిగా కనిపించాడు.













Click it and Unblock the Notifications