దిల్ విల్
(ఒక్క చూపులోనే ఆమె నన్ను పిచ్చివాడ్ని చేసింది...కొన్ని వందల సార్లు చూసినా నేనేం ప్రభావం చూపించలేకపోయాను)
అని వాపోయాడట ఒక ప్రియుడు. ప్రేమలో సంథింగ్ స్పెషల్...గా ఉండే నేచర్ అవసరం. అందరూ ఇలా ఉండాలని అనలేం కానీ, క్రియేటివిటీ యాడ్స్ మోర్ ఎట్రాక్షన్ అనేది మాత్రం కచ్చితం. కనుక ప్రేమికులు పవిత్రంగా భావించే ఈ అకేషన్‌లో కొన్ని టిప్స్ కలక్ట్ చేసుకుందాం...
ఫరే ఛేంజ్, మీరిద్దరూ సరిగ్గా వ్యాలంటన్స్ డే రోజునే పరిచయం అయ్యారనుకోండి...ఏదో ఒక ప్లేస్ చెప్పుకుని కలవండి. అక్కడ కూడా నేరుగా మీ లవర్ దగ్గరికి వెళ్ళిపోవడం కాదు. ఏదో ఒక కో ఇన్సిడెన్స్ క్రియేట్ చేసుకుని పరిచయం చేసుకోండి....ఇక మిగతా విషయాలు చెప్పాలటండీ....కొత్తగా మళ్ళీ పరిచయం చేసుకోవడాలు, కబుర్లు, షికార్లు (అన్నీ కొత్త బిడియంతోనే సాగాలి సుమా)...మరి మీ మనసుకి అనిపించినప్పుడు (ప్రిఫరబుల్లీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే..) ఫ్రెష్‌గా వాలంటైన్ ప్రపోజల్ చేసుకోండి...
వాలంటైన్స్ డే రోజున ఉదయం అంతా మీ లవర్‌కి అందుబాటులోకి రాకండి....కానీ ఆమె/అతని కోపం ఎగిరిపోయే లెవెల్లో ఏదైనా సర్‌ప్రయిజ్ ఇచ్చి చూడండి..
అవుటింగ్‌కి వెళితే ఇంకా బాగుంటుంది. ముఖ్యంగా లాంగ్ డ్రైవ్స్....
వెస్టన్ అవుట్‌ఫిట్స్ ఇష్టమైన వాళ్ళు ట్రెడిషనల్ వేర్‌లోకి, ట్రెడిషనల్ వేర్ వాళ్ళు వెస్టన్ అవుట్‌ఫిట్స్‌కి వాలంటైన్‌గుర్తుగా మారితే స్పెషల్ అప్పియరెన్స్ అవుతుంది.
షికారు
ఉదయం అంతా కలిసి తిరిగినా, సాయంత్రానికి కామన్ ఫ్రెండ్స్, లేదా కొన్ని లవ్‌పెయిర్స్‌ని ఓ చోట పోగేసి మీ ఎక్స్‌పీరియన్స్‌లు షేర్ చేసుకోండి
ఆల్రెడీ మ్యారీడ్ కపుల్ ఉన్నారనుకోండి...ఫరే ఛేంజ్ పెళ్ళి కాలేదనుకుని... ఆ రోజంతా లవర్స్ అవతారం ఎత్తేయండి. మీరు రోజూ చేసే పనుల్ని ఆ రోజు ఒకరికొకరు మార్చుకోండి.
మీకేమాత్రం ఇష్టం లేకపోయినా, మీ పార్టనర్‌కి అత్యంత ఇష్టమైన విషయాన్ని చెయ్యడానికి ప్రయత్నించండి. లేదా ఆమె/అతని సెంటిమెంట్‌ని తీర్చండి.
వీలయితే మీరు తొలిసారి కలుసుకున్న ప్రదేశానికి వెళ్ళి జ్ఞాపకాలు తాజా చేసుకోండి.
మీ పార్టనర్‌కి సరికొత్త ప్రేమలేఖ స్వహస్తాలతో రాయండి.
అలవాటు లేకపోయినా సరే, మీ పార్టనర్‌ని తీసుకుని డిస్కో థెక్‌కి వెళ్లిరండి.












Click it and Unblock the Notifications