నేను
ఇన్నేళ్ళ పాటు నిన్ను మిస్సయినందుకు నా మీద జాలేస్తోంది.
అయితే ఈ ఫీలింగ్ నాలో రావడానికి కారణం ఏమిటో కూడా నీకు నేను చెప్పాలి. మొన్నీ మధ్య ఓ కథ చదివాను. ఆ కథలో ఓ బుడుగు వాళ్ళ అమ్మని నీ వయసెంత అని అడుగుతాడు. దానికి వాళ్ల అమ్మ ముప్ఫయి అని సమాధానం ఇస్తుంది. వెంటనే వాడు షేమ్ షేమ్ అని తల పట్టుకుంటాడు. వాళ్ళమ్మకిదేం అర్ధం కాదు. నా వయస్సుని చూసి వీడు సిగ్గుపడాల్సిందేముంది అనుకుని, అదే అడుగుతుంది. అప్పుడా బుడుగు....నాకేమో ఐదేళ్ళు....నీకు ముప్ఫయి అయినప్పుడు....25 ఏళ్లు నిన్ను నేను మిస్ కాలేదూ అని దిగులు పడతాడు.
ఈ కథ చదవగానే నా కళ్ళ ముందు మెదిలింది నువ్వే. నీతో మాట్లేడేప్పుడు, ఇంతకు ముందే మన పరిచయం అయి వుంటే ఎంత బాగుండేది? అనిపించేది. కానీ నేన్నిన్ను ఎంత మిస్సయానో కళ్ళకి కట్టినట్టు అగుపిస్తోంది.
నువ్వు పసితనపు సరిగమలను పలికిస్తుంటే విని ఆనందించినా కనీసం పక్క వాయిద్యాన్నయినా కాలేకపోయాననే బాధ మరో వైపు మెలిపెడుతోంది. ఆ మురిపాల్లో నా ప్రస్తావన ఒక సెకను ఉన్నా ధన్యత లభించేది. అంతేనా అమ్మకొంగు పట్టుకుని తిరిగిన రోజుల నుంచి చుట్టుపక్కల స్నేహితుల్ని పోగేసి ఆడిన ఆనందాలన్నిట్లోను నీ జట్టు తప్పిపోలేదూ? జీవితంలో పైకి రావాలనే పట్టుదలతో కష్టాల తాలూకు ఒత్తిడిని పంటిబిగువన దాచిన ఆ క్షణాల్లో నువ్వుంటే అలసట తెలిసేదా? ఆత్మీయుల కోసం వెతుకులాట ఉండేదా?
మన పరిచయం అప్పట్నుంచీ ఉంటే ఇంకెంత మధురంగా గడిచేవి రోజులు...
మన అల్లరి, మనస్నేహితులు, మన మిస్చిఫ్‌లు, మన తగాదాలు, మన అలకలు, మన ప్రేమ ఇవన్నీ ఈ వయస్సులో మొదలుపెట్టడం షేమ్‌గా అనిపిస్తోంది.
నా హృదయం ప్రతి సెకను నీ పేరే కలవరిస్తోంది...
లవ్ ఈజ్ టూ ప్రెషస్....లెట్స్ నాట్ మిస్ ఇట్ ఎనీమోర్...
నేను












Click it and Unblock the Notifications
