• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పిసిసి రేసులో రేణుక

By Staff
|

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ 10-05-2005

ఆంధ్రప్రదేశ్‌లోఉమ్మడి కుటుంబ వ్యవస్ధ దాదాపుకనుమరుగైన స్ధితిలో 400 మందితెలుగు వారిని ఒకచోట చేర్చి సహజీవనసౌందర్యాన్ని చవి చూపించిందిసిలికానాంధ్ర. మే ఆరో తేదీ సాయంత్రంనుంచి మే ఎనిమిదో తేదీ సాయంత్రంవరకు సిలికాన్‌ వేలీకి యాభైమైళ్ళ దూరంలో ఉన్న లాహోండాకొండల్లో, దట్టమైన అడవుల మధ్యఉన్న వైఎంసిఎ క్యాంప్‌ సైట్‌లో ఆంధ్ర కుటుంబ శిబిరాన్ని విజయవంతంగానిర్వహించింది సిలికానాంధ్ర. ఈ క్యాంప్‌కిసిలికాన్‌ వేలీలో ఉన్న తెలుగువారేకాకుండా బోస్టన్‌, సెయింట్‌ లూయిస్‌, మియామి తదితరనగరాల నుంచి,కెనడా దేశం నుంచి కూడా అనేక మందితెలుగువారు ఈ క్యాంప్‌లో పాల్గొనిఆనందించడం విశేషం. మొదటినుంచి చివరివరకు శిబిర వాసులందరూ ఒక కుటుంబంగా మెలిగారు.పల్లెటూరి ఆటపాటలతోవివిధ కార్యక్రమాలతో సందడిగాగడిపారు. సిలికానాంధ్ర కార్యకర్తలుహిమశిల్పాన్ని చెక్కడం, అర్ధరాత్రి 650ఆడుగుల ఎత్తున్న కొండల మీద కార్గిల్‌యుద్ధంలో మేజర్‌ పద్మపాణి ఆచార్య ప్రాణాలు కోల్పోయిన ఘట్టం ప్రదర్శించడంవంటివి అక్కడికి వచ్చిన వారిని అలరించాయి. నాలుగు వందలమంది శిబిర వాసులు 40 చెక్క కాటేజిల్లో నివసించారు. వీరంతాపొద్దున కోడికూతతో నిద్రలేచారు.సిలికానాంధ్ర కార్యకర్తలు చేసినప్రత్యేక ఏర్పాట్ల వల్ల ప్రతి కాటేజిలోనూతెల్లవారుతుండగానే కోడి కూతవిన్పించింది. కొంత సేపటికి రావమ్మమహాలక్ష్మి... రావమ్మా... శ్రీమద్రమారమణ గోవిందోహరి అని హరి నామ స్మరణ చేస్తూహరిదాసు ప్రతికాటేజిని సందర్శించాడు. డప్పు దండోరాతోఅందరిని అల్పాహారానికి పిలిచారు.పిల్లలందరికీఎ తమ చిన్ననాటి పల్లెటూరిసంప్రదాయాలను వివరించి చెప్పారుపెద్దవారు. తరువాత అల్పాహారశాలవద్ద అయ్యవారికి దండం పెట్టు,అమ్మగారికీ దండం పెట్టు ఆంటూగంగిరెద్దుల వాళ్ళు గంగిరెద్దునుఅందరి వద్దకు తీసుకెళ్ళారు. నలుగురైదుగురు చిన్నారులు వంతులవారీగా గంటల తరబడి గంగిరెద్దులా నిలబడి ప్రేక్షకులను ఆనందపరిచారు.ఫకీరు బాబా సాంబ్రాణి దూపంతో నెమలిఈకలతో అందరికీ దువాలను, ఆశీస్సులనుఅందించారు. గంటల తరబడి సాగిన ఈవేషధారణ కార్యక్రమం విశేషంగాఆకర్షించింది. మధ్యాహ్నం భోజనాల సమయంలోచెట్టికింద జ్యోతిష్యుడు, సోదిచెప్పే యువతి తమ వాక్చాతుర్యంతోఆకట్టుకున్నారు. ఈ పాత్రధారులతో ఫోటోలు దిగేందుకు పిల్లలూ పెద్దలుపోటీ పడ్డారు.

రోజంతాసాగిన ఆటల పోటీల్లో మూడేళ్ళ చిన్నారుల నుంచి 70-80 ఏళ్ళ వృద్ధులు సైతంపాల్గొని క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారు. పల్లెటూళ్ళలో ఆడేకబడ్డి, గోలీలాట, గిల్లిదండా,గాలిపటాలు, కోకో, ఏడు పెంకులాట ఆకర్షించాయి.శిబిర వాసులందరినీ కాకతీయ,శాతవాహన, కళింగ, విజయనగరసామ్రాజ్య వాసులుగా విభజించి అన్ని క్రీడల్లోనూ పోటీలునిర్వహించారు. చిన్నపిల్లలు మట్టిబొమ్మల తయారీలో శిక్షణ పొంది మే 8నమదర్స్‌ డే సందర్భంగా తమ మాతృమూర్తులకు మట్టి బొమ్మలనుబహుమతిగా ఇచ్చారు. సాయంకాలంసమయంలో నాలుగు వందల మందిని ఒకచోటచేర్చి ఫ్యామిలీ ఫన్‌ పేరుతోసరదా ఆటలను ఆడించారు.

శుక్రవారంనాడు ఆరు బయట చెట్టు దుంగలతో కూర్చినగ్యాలరీలో సరదా, సాంస్కృతికకార్యక్రమాలు జరిగాయి. సిలికానాంధ్రఅధ్యక్షుడు కొండిపర్తి దిలీప్‌ ప్రేక్షకులముందు ఐస్‌ కార్వింగ్‌ చేశారు.

300 పౌండ్లబరువున్న మంచు దిమ్మను దిలీప్‌అరగంటలో పురి విప్పిన నెమలిలా చెక్కారు. గజ గజ వణికించేచలిలో దిలీప్‌కాషాయ రంగు ధోవతి ధరించి మంచుశిల్పాన్ని చెక్కడం విశేషం. లాహొండా ఎకొండ తదితర హాస్య కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

ఇతరసాంస్కృతిక కార్యక్రమాలతర్వాత రాత్రి పదకొండున్నరకుఎవరి కాటేజికి వారు వెళ్తుండగాఎదురుగా ఉన్న 650 అడుగుల ఎత్తైనకొండ మీద ఫ్లడ్‌ లైట్లు వెలిగాయి. ఏమిటిదీఅని ఆశ్చర్యపోతుండగా దేశరక్షణలో ప్రాణాలు కోల్పోయిన పద్మపాణి ఆచార్య భార్యకు రాష్ట్రపతి మహావీరచక్రను బహూకరించే దృశ్యం, ఆతర్వాత కార్గిల్‌ యుద్ధ సన్నివేశంకన్పించింది. రణరంగ ధ్వనులు,వాటికి తగిన లైటింగ్‌ ఎఫెక్టులుఆకట్టుకున్నాయి. కదం... కదం అనే దేశభక్తి గీతం వినిపిస్తుండగాభారతదేశ జాతీయ జెండాతో కొండమీదనుంచి సైనికులు కిందికి దిగివస్తుంటేప్రేక్షకుల కళ్ళు చెమ్మగిల్లాయి.

చివరిగామన జాతీయ గీతానికి నాలుగు వందల మంది గొంతుకలిపారు. జాతీయగీతాలాపనతో కొండలు ప్రతిధ్వనించడంఒళ్ళు గగుర్పొడిచేలా చేసింది.

కొసరి కొసరివడ్డనలు: దట్టమైన అటవీ ప్రాంతంలో కూడా శిబిరవాసులందరికీ ఎవరికిఏమాత్రం ఇబ్బంది కలుగకుండా రెండు రోజులపాటు తెలుగు సంప్రదాయ భోజనాలు, అల్పాహారఏర్పాట్లు చేశారు. తెలుగువారిసంప్రదాయం ప్రకారం ఒక రోజు విస్తరాకులు వేసిఇ సహపంక్తిభోజనంవడ్డించారు. పులిహోర, బొబ్బట్లు, ఇంట్లోకాచిన నెయ్యి, ఆవకాయ పచ్చడి,గడ్డపెరుగు, మామిడి పండు, తాంబూలం...ఇవన్నీ ఆంధ్రదేశంలో ఉన్న ఫీలింగ్‌నుకలిగించాయి. ఈ పంక్తి భోజనాల సమయంలోఏడిద సుబ్రమణ్యం గారు పౌరాణికపద్యాలు ఆలపించడం ప్రత్యేక ఆకర్షణ.మొత్తం కార్యక్రమాన్ని అన్నం అనిల్‌,అయ్యగారి లలిత అనేకమందికార్యకర్తల సహకారంతో నిర్వహించారు.మానాప్రగడ శ్రీనివాస్‌ నేతృత్వంలోని శిబిరదళం రెండురోజుల పాటు అందరినీ కంటికి రెప్పలా చూసుకుంది. అయ్యగారి శాంతివర్ధన్‌,వెలిదండ శరత్‌లు ఈవెంట్‌మేనేజ్‌మెంట్‌ చేశారు. పులపర్తిరామకృష్ణ, వేదుల స్నేహ, డొక్కా వంశి,తోట మాధురి, కూచిబోట్ల రవీంద్రప్రభృతులు క్రీడా విభాగాన్ని నిర్వహించారు.మల్లాది రఘు,ప్రఖ్యవంశి, మహ్మద్‌ ఇక్బాల్‌, గంటివాణి, మద్దాలి మహేశ్వరి, తాటిపాములమృత్యుంజయుడు, వ్యాకరణం జానశేఖర్‌ లు వివిధ పాత్రలు పోషించారు.ముడుంబ వంశీ, కొండిపర్తి భారతి,కిడాంబి మాధవ్‌, కూచిబొట్ల రవీంద్ర,ఈరంకి కామేశ్వర్‌లు మృత్యుంజయుడురచించిన హాస్యగల్పికలో పాత్రలు పోషించారు.

మల్లాదిరఘు, కూచిబొట్ల రవీంద్ర, ఈరంకికామేశ్వర్‌, ప్రఖ్య మృణాళిని, హరిమూర్తి,మృత్యుంజయుడు, ప్రఖ్యవంశి,కిరణ్‌ప్రభలు కార్గిల్‌ యుద్ధం దృశ్యరూపకంలో పాల్గొన్నారు.

Recent Stories

సింధూర దేశభక్తి
షూటింగ్‌ కేసు రివైండ్‌
రాంగోపాల్‌ వర్మ హత్యకు కుట్ర?
ఏకాకి లాలూ, ఏమవుతుందో ఏమో!
ఆటా అధ్యక్షులుగా గవ్వా చంద్రారెడ్డి
తిరగదోడినా ఫలితం శూన్యం?
నేతాజీ మరణ రహస్యం?
రవి అస్తమించిన అనంతపురం
కథల్లేక కదలలేకపోతున్న ఎన్టీఆర్‌ కెరియర్‌
వేడుకలో వితరణ
సీమ వేరుకుంపటి
దొందూ దొందే
కొత్త అధికార నివాసం
ఆరు నెలలకే వారు వీరు
ఐటీ ఉద్యోగుల ఉదారత
2004 వెలుగునీడలు
ఫ్లాష్‌న్యూస్‌
మనసు పాట వినదు
పాపం! బాజీ బజాజ్‌!
తల్లీకొడుకుల అపూర్వ గాధ

ఆ చెట్టు వేళ్ళు పుట్టిన గడ్డలోనే
మాటల మరాఠీ!
ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా అమర్‌
కంచిపై ఇంటిలిజెన్స్‌ కన్ను
బాలకృష్ణపై చార్జిషీట్‌
చిరుకథలో పెను మార్పులు!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్‌ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్‌!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్‌ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్‌ సినిమా
త్వరలో దాసరి ఛానల్‌!
చిన్న స్వామి స్వర్ణాభిషేకం హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X