వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మారినరాగం

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే చంద్రబాబు Thursday, April 22 2004

హైదరాబాద్‌:తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు ప్రచార సరళిమారింది. తెలంగాణ ప్రాంతంలో పోలింగ్‌ముగియడంతో ఆయన రాగం మారింది.తెలంగాణ రాష్ట్రం డిమాండ్‌ చేస్తున్నపార్టీల వల్ల జరిగే నష్టం గురించి, ఆ పార్టీలతీరు గురించి తన వాణిని పెంచిదుమ్మెత్తిపోయడంమొదలుపెట్టారు.

సమైక్యాంధ్రకుఓటేయాలని కోస్తా ప్రాంత ప్రజలనుకోరుతూనే తెలంగాణ ఏర్పడితే మీకునీళ్లు రావని కోస్తా ప్రజలను హెచ్చరించేపద్ధతిని ఆయన అనుసరిస్తున్నారు.అంతేకాదు, నీళ్లన్నీ మీరేతాగుతున్నారని, మీరేవాడుకుంటున్నారని, మా ఉద్యోగాలు మీరేతీసుకుంటున్నారని తెలంగాణ రాష్ట్రసమితి (టి ఆర్‌యస్‌) వంటి పార్టీలుదుమ్మెత్తిపోస్తున్నాయని కోస్తా ఓటర్లముందు చెప్పుకుంటూ పోతున్నారు.గురువారం తూర్పు గోదావరి జిల్లామంగపేటలో మాట్లాడిన తీరు ఆయనప్రచారశైలికి అద్దం పడుతుంది.తెలంగాణలో పోలింగ్‌ జరిగే వరకుఆయన కొంచెం మెతకగా మాట్లాడారు.సమైక్యాంధ్రకు కట్టుబడి ఉంటామనిచెప్పినప్పటికీ తెలంగాణ రాష్ట్రంఏర్పాటు వల్ల తెలంగాణకు గానీ, కోస్తాకుగానీ కలిగే నష్టాలను ఆయనవివరించలేదు. అయితే తెలంగాణలోపోలింగ్‌ ముగియగానే కోస్తాకు జరిగేనష్టాలపై మాట్లాడటం ప్రారంభించారు.

నీళ్లన్నీగోదావరి జిల్లాలవారేవాడుకుంటున్నారని టి ఆర్‌యస్‌అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌ రావుఅంటున్నారని ఆయన చెప్పుకొచ్చారు.తననే కాకుండా కోస్తా ప్రజలను కూడాకాంగ్రెస్‌, టి ఆర్‌యస్‌ నాయకులుతిడుతున్నారని ఆయన అన్నారు. టిఆర్‌యస్‌ ప్రాంతీయ విద్వేషాలనురెచ్చగొడుతోందని, అటువంటి పార్టీతోకాంగ్రెస్‌ పొత్తు పెట్టుకుందని, ఓట్లకోసం ఆ పార్టీలు ఏమైనా చెబుతాయనిఆయన అంటున్నారు.

తెలంగాణలోనూటా యేడు అసెంబ్లీనియోజకవర్గాల్లోనూ, పదహారులోక్‌సభ నియోజకవర్గాల్లోనూకాంగ్రెస్‌, టి ఆర్‌యస్‌, వామపక్షాలకూటమికి ఆధిక్యత లభిస్తుందని ఎగ్జిట్‌పోల్‌ సర్వేలు వెల్లడించిన నేపథ్యంలోచంద్రబాబు కోస్తా ప్రాంతాన్ని లక్ష్యంగాఎంచుకున్నారు. మలివిడత పోలింగ్‌జరిగే కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోఆధిక్యత సాధించేందుకు ఆయనగొంతు పెంచినట్లు అర్థం చేసుకోవచ్చు.రాయలసీమలో కొంచెం అటూ ఇటుగా రెండుపార్టీలకు సమానంగా వచ్చినా కోస్తాలోమెజారిటీ సాధిస్తేనే తెలుగుదేశంపార్టీ గట్టెక్కే పరిస్థితి ఉంది. దీంతో ఆయనతెలంగాణ రాష్ట్రం డిమాండ్‌ వల్లఒనగూడే నష్టాలను, కృష్ణా డెల్టాకువాటిల్లే నష్టాన్ని పదే పదేవల్లించేందుకుసిద్ధపడుతున్నారు.

  • బాబుపైమహారథి బాణం

  • ఏంప్లాను బాబో
  • సైకిల్‌కు అసమ్మతి బ్రేక్‌లు

    హోంపేజి
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X