వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎక్కడి కాంగ్రెస్‌అక్కడే..

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రామేశ్వరం వెళ్ళినాశనీశ్వరం తప్పలేదన్నట్టుగా ఉందిరాష్ట్ర కాంగ్రెసు పరిస్ధితి. ఆ పార్టీ అసెంబ్లీఅభ్యర్ధుల ఎంపిక తీరు చూస్తే ఈ అభిప్రాయంకలుగకమానదు. అధికార తెలుగుదేశంపార్టీ మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకతనుతనకు అనువుగా మల్చుకునే స్ధితిలోకాంగ్రెసు లేదని ఆ పార్టీ సీనియర్‌నాయకులు అభిప్రాయపడుతున్నారు.

నెల్లూరు జిల్లాలోరిజర్వుడు స్ధానాలను మినహాయిస్తే మిగితాఅన్ని స్ధానాలను ఆ పార్టీ రెడ్లకు ఇచ్చింది.కడప జిల్లాలో ఒక ముస్లిం మినహా అన్నిస్ధానాలు ఇదే కులానికి దక్కాయి. గత అసెంబ్లీఎన్నికల్లో చేసిన పొరపాట్లే ఈసారి కూడాజరిగాయన్న అభిప్రాయాన్ని ఆ పార్టీతోవిసిగిపోయిన వారు వ్యక్తంచేస్తున్నారు.

మహిళలకుఇరవై ఒక్క స్ధానాలు మాత్రమే కాంగ్రెసుఇచ్చింది. బిసిలకు కూడా తెలుగుదేశం కంటేతక్కువ సీట్లు ఇచ్చింది.

ఉచిత విద్యుత్తుఇస్తామన్న కాంగ్రెసు వాగ్దానం చిన్నరైతుల్లో ఆశలు రేకెత్తిస్తున్న మాటనిజమే. ప్రపంచబ్యాంకు రుణాలు లేనిదేగడవని స్ధితికి ఇప్పటికే చేరుకున్నాం.ఏ ప్రభుత్వం వచ్చినా ప్రపంచబ్యాంకుషరతులకు తలొగ్గక తప్పనిపరిస్ధితి ఉంది. ఉచితంగా ఏదీఇవ్వవద్దనేది ప్రపంచబ్యాంకుప్రధాన షరతు. కాంగ్రెసు ప్రభుత్వంవచ్చినా ఉచితంగా విద్యుత్తు ఇవ్వడం అంతతేలికకాదు. దీనిపై కాంగ్రెసు వివరణఇచ్చుకోవలసిన అవసరం ఉంది.

రాష్ట్రమంతటాసుడిగాలిలా తిరిగి ప్రచారం చేసే నాయకులురాజశేఖరరెడ్డి మినహా మరెవరూకన్పించడం లేదు. కాంగ్రెసుఅభ్యర్ధులు ఎవరికి వారే ప్రచారంచేసుకోవాల్సి ఉంటుంది. ధనబలం కూడాసహజంగా కాంగ్రెసు అభ్యర్ధులకు తక్కువే.అన్నిటికంటే మించికొత్త ఓటర్లనుఆకర్షించడానికి ఆ పార్టీఎటువంటి ప్రయత్నం చేసినట్టు కన్పించదు.

  • ఇద్దరు
  • రాజశేఖరరెడ్డినష్టజాతకం!
  • హస్తవ్యస్ధం
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X