చంద్రబాబుతురుపుముక్క
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే
తెలుగుదేశం Tuesday, April 06 2004
హైదరాబాద్:తెలుగుదేశంపార్టీ ఈసారి టికెట్ల పంపిణీలో ఒక ఫార్ములానుఅనుసరించింది. దేశంలోనే మొదటిసారిగామహిళలకు దాదాపు ఇరవై శాతం అసెంబ్లీటికెట్లను కేటాయించింది. తాను పోటీ చేస్తున్నవాటిలో యాభై ఒక్క స్ధానాలను టిడిపి మహిళలకుకేటాయించగా కాంగ్రెసు ఇరవై ఒక్కస్ధానాలు మాత్రమే మహిళలకు ఇచ్చింది.
ఏపార్టీ ఇచ్చిందన్నది కాదు ఇక్కడ ముఖ్యం, చట్టసభల్లోమహిళల ప్రాతినిధ్యం పెరగవలసిఉంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతంరిజర్వేషన్లు కల్పించాలన్న సదాశయంఆచరణకు రావడానికి ఇంకా చాలాకాలంపట్టవచ్చు. ఈలోపు మహిళలు రాజకీయాల్లోతమ అవసరాన్ని చాటి చెప్పుకోవడంముఖ్యపరిణామం. వివాదాస్పద, సమస్యాత్మకనియోజకవర్గాల్లో మహిళా అభ్యర్ధులనునిలబెట్టి తెలుగుదేశం గతంలో విజయవంతమైంది.ఈసారీ అదే వ్యుహాన్ని సైలెంటుగా అనుసరించింది.
ఇటీవలమధ్యప్రదేశ్, రాజస్ధాన్, ఢిల్లీ అసెంబ్లీఎన్నికల తర్వాత మహిళలు ముఖ్యమంత్రులుకావడం మహిళల్లో పెరిగిన చైతన్యానికినిదర్శనం.
తెలుగుదేశం మేధావులుఈ అంశంపై సమగ్ర అధ్యయనం చేసి చంద్రబాబునాయుడికి నివేదిక సమర్పించినట్టుతెలిసింది. ఈ నివేదిక ఆధారంగా ఎక్కడెక్కడమహిళలను నిలబెట్టవచ్చో చంద్రబాబునాయుడు సర్వే చేయించారు. దీనివెనుకఇంత కథ నడిచింది. ఏ పార్టీ ఎందుకు ఇచ్చిందన్నదికాదు కానీ రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యంపెరగాలన్నది అందరు అంగీకరించేవిషయం.
మహిళానాయకులు మగవారితోపోలిస్తే నీతివంతంగా, నేరాలకు అతీతంగాఉంటారు. నేటి అవినీతిమయ, నేరమయరాజకీయాల్లో మార్పు రావాలంటే మహిళలుఅధిక సంఖ్యలో చట్టసభల్లో అడుగుపెట్టాలి.
చంద్రబాబునాయుడు టిడిపి తిరిగి అధికారంలోకి రావాలన్నస్వార్ధంతో ఈ పని చేసినా దీర్ఘకాలంలో ఈ ఒరవడిమంచి ఫలితాలు ఇస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.
- చిరంజీవిరహస్య ఎజెండా?
- అస్పష్ట రాజకీయ చిత్రం హోంపేజి












Click it and Unblock the Notifications
