• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఈ ప్రమాదాలనునివారించలేమా?

By Staff
|

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ 29-10-2005

;?

హైదరాబాద్‌:శనివారం తెల్లవారుజామునరేపల్లె-సికింద్రాబాద్‌ డెల్టా ఫాస్ట్‌ ప్యాసింజర్‌కునల్గొండ జిల్లా వలిగొండ వద్ద జరిగినప్రమాదం ఇటీవల కాలంలోఅత్యంత ఘోరమైనది. దీపావళిపండుగకు ఆత్మీయులను చూడడానికి బయలుదేరినవారు కొందరైతే, పొట్టచేతబట్టుకుని హైదరాబాద్‌నగరంలో బతకడానికి కళ్ళల్లో కలలునింపుకుని వస్తున్న వారు కొందరు.ప్రమాదం అంటే ప్రమాదమని ఒక్కోసారివాటిని నివారించలేమని ముఖ్యమంత్రిరాజశేఖరరెడ్డి వ్యాఖ్యానించారు.అంతర్జాతీయ స్ధాయి నగరంగాఅభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌కు సుమారు వంద కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈప్రమాదం తర్వాత సహాయ చర్యలు చాలా నింపాదిగా జరిగాయనేచెప్పాలి. ఒక రెండు గంటల ముందేడిఫెన్స్‌కు చెందిన దళాలు రంగంలోకిదిగి ఉంటే మరికొంత మంది బతికిఉండేవారు. మృతుల్లో అధిక శాతం గుంటూరుజిల్లాకు చెందిన వారే.

ఒక చిన్నరైలు ప్రమాదం జరిగితేనే నైతిక బాధ్యతవహించి ఆనాటి రైల్వే మంత్రిలాల్‌బహదూర్‌ శాస్త్రి రాజీనామా చేశారు.రాజకీయాల్లో ఆనాటి నైతిక విలువలు ఇప్పుడుఉంటాయనుకోవడం అత్యాశే. ఇప్పటిరైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ఇంత ఘోరప్రమాదం జరిగినా కనీసం తొంగి చూడలేదు. లాల్‌బహదూర్‌ను,లాలూను పోల్చిచూడడం కూడా అనుచితమనే.రెండు రోజుల నుంచి రాష్ట్రంలో వాగులు,వంకలు పొంగుతున్నప్పుడుసమస్యాత్మక ప్రాంతాల్లో రైల్వేసిబ్బందితో గస్తీ ఎందుకు ఏర్పాటు చేయరు? వర్షాకాలంలో కొందరుసిబ్బందిని రాత్రి పూట రైల్వే ట్రాక్‌ల వద్ద నియమించి వారికి అదనపుఅలవెన్సులు కల్పించవచ్చు కదా? కొన్ని లక్షలమందిసిబ్బంది ఉన్న రైల్వే శాఖకు ఇది సాధ్యంకాని పనా? ఈ శాఖ ఎంత క న్సర్వేటివ్‌గా,బ్రిటీషు కాలం నాటి విధి విధానాలతో పనిచేస్తోందోమృతుల కుటుంబాలకుప్రకటించిన లక్ష రూపాయలఎక్స్‌గ్రేషియాను బట్టే తెలుస్తోంది.

ఈదేశంలో రోడ్డుమీద నడవడం ప్రమాదం, రైలులోప్రయాణించడం భయానకం, సొంతఇంట్లో రాత్రి పూట నిద్రించడం కూడా ప్రమాదం,చివరికి ఆస్పత్రుల్లో చికిత్సపొందడం ప్రమాదం.ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం ప్రమాదం, ఒకపనిమీద ఉన్నతాధికారినికలుసుకోవడం ప్రమాదం, భద్రతకోసం పోలీసులను ఆశ్రయించడం ప్రమాదం. ఎంతదారుణం? గోళ్ళతో పోయే దానిని గొడ్డళ్ళవరకూతెచ్చుకునే అద్భుత వ్యవస్ధ మనది.దేవుడి మీద భారం వేసిబతకాల్సిందే అంతా. భగవంతుడుమనల్ని రక్షించుగాక!

ఇటీవలి కథనాలు హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X