5న రవిహంతకుల గుర్తింపు పెరేడ్
హైదరాబాద్:పరిటాల రవి హత్యకేసు దర్యాప్తునుసిబిఐ తనదైన శైలిలో సాగిస్తోంది. పరిటాలహత్య కేసులో నిందితులు, లొంగిపోయినవారి గుర్తింపు పెరేడ్ మార్చి ఐదునజరుగనుంది. పెరేడ్ జరపడానికి అనుమతి ఇవ్వవలసిందిగా సిబిఐఅధికారులు అనంతపురంలోని చీఫ్‌జుడిషియల్ మెజ్రిస్టేట్‌ను కోరగాఆయన అనుమతి మంజూరు చేశారు.చర్లపల్లి జైలులో ఖైదీగా ఉన్న మద్దలచెరువుసూర్యనారాయణరెడ్డి అలియాస్ సూరిని విచారించేందుకుఅవసరమైన అనుమతుల కోసం సిబిఐముమ్మరంగా ప్రయత్నం చేస్తోంది.
పరిటాలహత్యకేసు రోజుకో మలుపుతిరుగుతున్న నేపధ్యంలో సిబిఐ దర్యాప్తు ఆ సంస్ధకు ప్రతిష్టాత్మకంగామారింది. పరిటాల రవిని తానే హత్య చేశానని జూలకంటిశ్రీనివాసరెడ్డి అలియాస్ మొద్దు సీను ఒక ప్రైవేటు టీవీఛానల్‌కు ఇంటర్‌వ్యూ ఇచ్చిన సంగతితెలిసిందే. మరో ఇద్దరు పరిటాలమనుషులను హత్య చేసిన తర్వాత తానుపోలీసుల ఎదుటలొంగిపోతానని చెప్పిన మొద్దు సీనునుఇప్పటి వరకు పోలీసులు పట్టుకోలేక పోయారు. రవి హత్యనుమొద్దు సీను చేత తానే చేయించాననిరంగారెడ్డి జిల్లాకు చెందిన పట్లోళ్ళగోవర్ధనరెడ్డి శనివారం నాడుచెప్పడం సంచలనం కలిగించింది.గోవర్ధన రెడ్డి రివల్యూషనరీపేట్రియాటిక్ టైగర్స్ అనే ఉగ్రవాదసంస్ధను నడుపుతున్నాడు. తానుతాండూరు సమీపంలోని అడవిలో మొద్దుసీనుకు షూటింగ్‌లో శిక్షణ ఇచ్చినట్టుగోవర్ధన్ రెడ్డి చెబుతున్నాడు. రవిహత్య పూర్వాపరాలను, వ్యూహాలనుఆయన ఆసక్తికరంగా వివరించారు.
అయితేపరిటాల హత్యపై ఇంకా అనుమానాలు అలాగేఉన్నాయి. రవి మృతదేహంలో సర్వీసురివాల్వర్ గుండ్లు ఉన్నాయని సిబిఐ అనుమానిస్తోంది. రీపోస్ట్‌మార్టం కోసం సిబిఐకోరుతుండగా, అందుకు తాముఅంగీకరించబోమని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications
