పత్రికానగర్‌కొలిమి

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ 12-05-2005

హైదరాబాద్‌:దంత వైద్యుడు చంద్రకాంత్‌భూకబ్జాల వివాదం రగులుకుంటోంది.మాదాపూర్‌లోని పత్రికానగర్‌లోభూకబ్జాలకు పాల్పడుతున్నాడనిచంద్రకాంత్‌పై ఆరోపణలువెల్తువెత్తుతున్నాయి. ఖమ్మం జిల్లాకుచెందిన చంద్రకాంత్‌ జర్నలిస్టులకుఉదారంగా దంత వైద్యం చేస్తాడనేవిషయం పత్రికా ప్రపంచానికి తెలుసు.నిజానిజాలు నిర్ధారించుకోకుండా తానుచంద్రకాంత్‌తో తన సహచరుడుకళ్యాణ్‌రావు భేటీని అనుమానిస్తూమావోయిస్టు నేతలకు లేఖలు రాయడంతప్పేనని నక్సల్స్‌ చర్చల మాజీప్రతినిధి, విప్లవ కవి వరవరరావుప్రకటించిన నేపథ్యంలో జర్నలిస్టులుకొందరు గురువారం పత్రికాసమావేశం ఏర్పాటు చేశారు.

జర్నలిస్టుపాశం యాదగిరి చెప్పిన సమాచారంఆధారంగా చంద్రకాంత్‌,కళ్యాణ్‌రావుల సంబంధంపై తనలేఖలో ప్రస్తావించానని వరవరరావుఅన్నారు. గద్దర్‌, కళ్యాణ్‌రావులతోబుధవారం మీడియా ప్రతినిధులసమావేశం ఏర్పాటు చేసి తాను అలారాయడం తప్పేననివరవరరావు ఒప్పుకన్నారు. ఈనేపథ్యంలో పాశం యాదగిరి మరికొంతమంది జర్నలిస్టులు చంద్రకాంత్‌పైవిలేకరుల సమావేశంలో తీవ్ర ఆరోపణలుచేశారు.

నిజానిజాలునిర్ధారించుకోకుండా అలా రాయడంతప్పేనని వరవరావు అనడంపైయాదగిరి ప్రతిస్పందిస్తూ మావోయిస్టుచర్చల మాజీ ప్రతినిధులువరవరరావు, గద్దర్‌,కళ్యాణ్‌రావులు వచ్చి ఇప్పుడు నిజానిజాలునిర్ధారించుకోవచ్చునని ఆన్నారు.చంద్రకాంత్‌ సత్యహరిశ్చంద్రుడేమీకాదని ఆయన అన్నారు. పత్రికానగర్‌కాలనీ వెల్ఫేర్‌ అసోయేషన్‌లో చొరబడిచంద్రకాంత్‌ అక్రమాలకుపాల్పడుతున్నాడని బాధితులు అన్నారు.తన డాక్యుమెంట్లు చూపాలంటూచంద్రకాంత్‌ ఎడతెరిపి లేకుండాఫోన్లు చేశారని సుచరిత అనే మహిళచెప్పారు.

మాదాపూర్‌లోమాజీ జర్నలిస్టు జైహింద్‌ రెడ్డి ప్లాట్లుచేసి పత్రికానగర్‌ అనే పేరు పెట్టివాటిని విక్రయించారు. ఇందులో ఎక్కువగాజర్నలిస్టులే ప్లాట్లు కొన్నారు. అప్పట్లోజర్నలిస్టులకు జైహింద్‌ రెడ్డి వాయిదాలపద్ధతిపై డబ్బులు తీసుకొని ప్లాట్లుకేటాయించారు. అరకొర జీతాలతోనేజర్నలిస్టులు చాలా మంది ఆ ప్లాట్లు కొన్నారు.అయితే ఆ ప్లాట్ల ధరలు ఆకాశాన్నంటడంతోవాటిపై పలువురి కన్ను పడింది. దాంతోప్లాట్లు తీసుకున్న జర్నలిస్టుల కష్టాలుపెరిగాయి. లే అవుట్‌ దగ్గరి నుంచి పలురకాల కష్టాలను జర్నలిస్టులుఅనుభవించారు. తాజాగా చంద్రకాంత్‌బాధితులు ముందుకు వచ్చారు. పోలీసులుకూడా చంద్రకాంత్‌ రావుకు సహాయంచేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.ఇటీవల ఈ ప్రాంతంలో పని చేసిన ఒక సబ్‌ఇన్‌స్పెక్టర్‌ సంపాదన విషయంలోపెద్ద యెత్తున ప్రచారం జరిగింది.

మావోయిస్టుచర్చల మాజీ ప్రతినిధులు తమ మధ్యవివాదాన్ని ఏమీ జరగనట్లేపరిష్కరించుకోవడంతో లేఖల్లో పేర్లుప్రస్తావనకు వచ్చినవారు ఇబ్బందులపాలైనట్లు అయింది. ఈ కారణంగానేజర్నలిస్టులు గురువారం మీడియాప్రతినిధుల సమావేశం ఏర్పాటయినట్లుభావించవచ్చు.

చంద్రకాంత్‌రావు ఆ ఆరోపణలు ఖండిస్తున్నారు.వ్యక్తిగత కారణాల వల్లనేవరవరరావు తన పేరుప్రస్తావించారని, ప్లాటు వివాదం వల్ల పాశంయాదగిరి తనపై తప్పుడు ఆరోపణలుచేశారని ఆయన అంటున్నారు. నిజానిజాలుతేలడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.కానీ నిజానిజాలను ఎవరు తేల్చాలనేదిప్రశ్న.

Recent Stories

సింధూర దేశభక్తి
షూటింగ్‌ కేసు రివైండ్‌
రాంగోపాల్‌ వర్మ హత్యకు కుట్ర?
ఏకాకి లాలూ, ఏమవుతుందో ఏమో!
ఆటా అధ్యక్షులుగా గవ్వా చంద్రారెడ్డి
తిరగదోడినా ఫలితం శూన్యం?
నేతాజీ మరణ రహస్యం?
రవి అస్తమించిన అనంతపురం
కథల్లేక కదలలేకపోతున్న ఎన్టీఆర్‌ కెరియర్‌
వేడుకలో వితరణ
సీమ వేరుకుంపటి
దొందూ దొందే
కొత్త అధికార నివాసం
ఆరు నెలలకే వారు వీరు
ఐటీ ఉద్యోగుల ఉదారత
2004 వెలుగునీడలు
ఫ్లాష్‌న్యూస్‌
మనసు పాట వినదు
పాపం! బాజీ బజాజ్‌!
తల్లీకొడుకుల అపూర్వ గాధ

ఆ చెట్టు వేళ్ళు పుట్టిన గడ్డలోనే
మాటల మరాఠీ!
ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా అమర్‌
కంచిపై ఇంటిలిజెన్స్‌ కన్ను
బాలకృష్ణపై చార్జిషీట్‌
చిరుకథలో పెను మార్పులు!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్‌ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్‌!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్‌ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్‌ సినిమా
త్వరలో దాసరి ఛానల్‌!
చిన్న స్వామి స్వర్ణాభిషేకం హోంపేజి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+