ఎన్నారైకి భారీగ్రాంట్
హైదరాబాద్: ఒకప్రవాసాంధ్రుడికి ప్రతిష్టాత్మకమైనఅమెరికన్ గ్రాంటు లభించింది. కొత్త ఔషధాలతయారీ కోసం ఇచ్చే ప్రపంచంలోని అతి పెద్దస్కాలర్‌షిప్ ఇది. ఈ అమెరికన్ నేషనల్‌ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ గ్రాంటును పొందినవ్యక్తి దూదిపాల సాంబరెడ్డి. ఆయనదివరంగల్ జిల్లాలోని అతి చిన్న గ్రామంచర్లపల్లి. మూర్ఛ వ్యాధి చికిత్సకుఔషధం తయారు చేయడానికి ఈ గ్రాంటుకింద ఆయనకు 25 లక్షల అమెరికన్‌డాలర్లు లభిస్తాయి. సాంబరెడ్డి ప్రస్తుతంఅమెరికాలోని నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీలో ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్‌అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఫార్మకాలజీగాపనిచేస్తున్నారు.ప్రస్తుతం ఒక సెమినార్ కోసంహైదరాబాద్ వచ్చారు.
ఫార్మసీ కాలేజీలోచదుకునే నాటి నుంచి నాది ఒకటేస్వప్నం. మూర్ఛ వ్యాధికి మందుకనుక్కోవాలని. ఈ వ్యాధి వల్లప్రపంచవ్యాప్తంగా ఐదు కోట్ల మంది,మనదేశంలో 70 లక్షల మందిబాధపడుతున్నారు. అని సాంబరెడ్డి చెప్పారు.మూర్ఛ మందు కోసం ఆయనవిస్తృతంగా పరిశోధనలు చేశారు.విసుగు లేకుండా అనేకకాంబినేషన్లను పరీక్షించారు. చివరికిగానక్సోలోన్ అనే మందునుకనుగొన్నారు. ఈ మందును ఇంకామెరుగుపరచడానికే ఆయనకు పాతికలక్షల డాలర్ల గ్రాంటు మంజూరైంది. ఈ గ్రాంటుకోసం వివిధ దేశాలకు చెందిన 300 మందిశాస్త్రవేత్తలు దరఖాస్తు చేసుకోగా చివరికి అది సాంబరెడ్డి వశమైంది.గ్రాంట్ సెలక్షన్ కమిటీలో కొందరు నోబెల్‌బహుమతి గ్రహీతలతో సహా 30 మంది అంతర్జాతీయస్ధాయిశాస్త్రవేత్తలు ఉన్నారు.
డాక్టర్ సాంబరెడ్డిఫార్మసీ అలూమినీ అసోసియేషన్ ఆఫ్‌యుఎస్‌ఎకు అధ్యక్షుడిగా ఉన్నారు. ఆసంఘం విరాళంతో ఆయన వరంగల్‌కాకతీయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో 30లక్షల రూపాయలతో ఫార్మసీ భవనం నిర్మిస్తున్నారు. ఆయన సొంతంగాకాకతీయ అవార్డు నెలకొల్పారు. ఈ అవార్డుకింద కాకతీయ యూనివర్సిటీలోఉత్తమ రిసెర్చ్ స్కాలర్‌కు ఏటా 20 వేల రూపాయలుఇస్తారు. సాంబరెడ్డి అమెరికాలోఇన్ని విజయాలు సాధించినా అతని తలిదండ్రులోకుగ్రామంలో పొలం పనులు చూసుకుంటూప్రశాంతంగా కృష్ణా రామా అంటూ శేషజీవితం గడుపుతున్నారు.












Click it and Unblock the Notifications
