• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎన్నారైన్యూస్‌: తానా తందానా

By Staff
|

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ 12-04-2005

(హిమబిందుకాలిఫోర్నియా నుంచి)

హలో!తానాకి వస్తున్నావా లేదా? ఫోన్‌ తీశానోలేదో సూటిగా అడిగేశాడో మిత్రుడు.అదేంట్రా బాబూ... బావున్నావా? లేకబతికున్నావా? లాంటి పలకరింపులు లేకుండాఈ ప్రశ్నేంటి అన్నాను. అబ్బా! సోదంతాఎవడు అడుగుతాడు చెప్పు, ఒక వేళవస్తున్నాను అన్నావనుకో... మాఇంటికి ఎలానూ వస్తావు కనుక అదేదోనిన్ను చూసే తేల్చుకుంటాను.రావట్లేదనుకో... మరీ సంసారపక్షిఅయిపోయింది అని జాలిపడి ఊరుకుంటాను...మ్యాటర్‌ చాలా సింపుల్‌... ఇంతకీవస్తున్నావా, లేదా?.. మళ్లీ మొదటికివొచ్చాడు.

డెట్రాయిట్‌రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానుకానీ, తానా, ఆటా లేదా ఇంకో పాట... ఇట్లాంటిఫంక్షన్లేవో జరుగుతున్నప్పుడేరావాలని ఏమైనా రూలా... అసలయినా అదేంప్రశ్న... మా ఇంటికొస్తావా అని అడగొచ్చుగా...విసుక్కున్నాను.

చూడు!అసలే రోజులు బాగా లేవు..., నన్ను - నాఫ్యామిలీని చూడటానికి కాలిఫోర్నియా నుంచి పనిగట్టుకుని వచ్చేంత సీన్‌ ఉండదనితెలుసు... అదే ఇలాంటి ఫంక్షన్స్‌ టైమ్‌లోఅనుకో... స్వామికార్యం, స్వకార్యం రెండూకలిసొచ్చేట్టు ఉన్నాయని లెక్కలు కట్టుకుని మరీబయలుదేరుతారని నా ప్రగాఢ విశ్వాసం.అని తేల్చి పారేశాడు.

ప్రాక్టికల్‌గాచెప్పాలంటే, నేను జర్నలిస్టు ఉద్యగంవొదిలేసి నాలుగేళ్లు దాటింది... కాబట్టి ఆపనులేం నాకు లేవు. ఇక రెండోవిషయానికి వొస్తే, ఓ వెయ్యి డాలర్లుతగలేసుకుని ఇలాంటి ఉత్సవాలకివొచ్చేంత ఎక్‌స్ట్రామనీ, ఇంట్రస్టు, టైమ్‌లేవు... ఒక వేళ మా ఇంటికిరాకూడదూ... అని నువ్వంటే ఏమైనాఆలోచించేదాన్నేమో.. అన్నాను.

సరే!రావట్లేదన్న మాట... టూ బాడ్‌! ఈవిషయంలో నిన్ను చూస్తే నాకు చాలా కోపంవొస్తోంది. జర్నలిస్టు ఉద్యోగం వొదిలేసినాలుగేళ్లయింది... అని చేతులు దులుపుకునికూర్చుంటావేంటి... మీడియా ఇంపార్టెన్స్‌రోజురోజుకీ ఎంతగా పెరుగుతోందోపరిశీలిస్తున్నావా? ఇప్పుడే యాక్టివ్‌గా ఉండాలి.ఏమో ఎప్పుడేం అవకాశాలొస్తాయోచెప్పలేం... అట్లా వొదిలెయ్యకు...పొద్దున్నే నెట్‌ ఓపెన్‌ చేస్తే పేపర్‌లోఎన్నారైల న్యూస్‌ ఏదో ఒకటి ఉంటోంది. ఫొటోలు,బ్యానర్‌ ఐటమ్‌లు... పైగా తెలుగు టీవీఛానల్స్‌ కూడా పెరుగుతున్నాయి. ఇంకాఇదంతా మొదలే... రాను రానుఊహించలేనంత డవలప్‌మెంట్‌ఉంటుంది. అన్నట్టు మొన్నీ మధ్య తానా ఎన్నికలగురించి ఒక దినపత్రికలో విశ్లేషణ కూడావొచ్చింది చదివావా...? న్యూ డవలప్‌మెంట్‌కదూ...? ఎలక్షన్లో గెలిచిన దాని కంటే కూడాఆ ఐటెమ్‌ చదివి గెలిచినవాళ్లు ఎక్కువఆనంద పడ్డారనుకో.. ఫ్రేమ్‌కట్టించుకుని ఇళ్లలో పెట్టుకున్నాఆశ్చర్యం లేదు. మీడియాకి అంతమైలేజ్‌, ఇమేజ్‌ ఉంది... వొచ్చే ఎలక్షన్లనాటికి, అంటే ఎలక్షన్‌లు జరగకముందే అన్నమాట, ఇలా పేరున్నన్యూస్‌పేపర్లలో చెయ్యి తిరిగిన వాళ్లనిఎవరో ఒకర్ని పట్టుకుని రాయించేసుకంటేబాగుంటుందని వివిధ తెలుగు సంస్థలఎన్నికల్లో పోటీ చేయబోయే వాళ్లు ఇప్పటినుంచే స్ట్రాటజీలు తయారుచేసుకుంటున్నారు... పత్రికలకి కూడా మంచిబిజినెస్సే కదా... ఇంతకీ నువ్వు చదివావా?నీ కామెంట్‌ ఏంటి? అన్నాడు.

బాబోయ్‌కామెంట్ల గురించి నన్నడగకు, అదిచదివినప్పటి నుంచీ, నీ ట్రెండ్‌ విన్నప్పటినుంచీ.... ఎన్నారై న్యూస్‌ పురిట్లోనే మరోతెలుగు సినిమా జర్నలిజంలాతయారువుతుందేమోననిభయంగా ఉంది అన్నాను.

అదేంటి,తెలుగు సినిమా జర్నలిజానికి ఏమైంది...

ఏమవుతుంది? టీవీల్లో చూడట్లే రెండురోజులు కూడా ఆడని సినిమాని సూపర్‌హిట్‌ అనిచెపుతారు. ఇక న్యూస్‌ పేపర్లలో అయితేకొన్నిటిలో ఆ కాలమే కనిపించదు... అన్నీఅద్బుతాలే! నువ్వు చెప్పినట్టు, విశ్లేషణఅనేది సరైన పద్దతిలో చేస్తే మంచిట్రెండే... కానీ ఆ న్యూస్‌ ఐటెమ్‌లో సదరువ్యక్తుల మెప్పు పొందటమో లేక వారిదృష్టిలో పడే తాపత్రయం తప్పితేవిశ్లేషణ ఏ మాత్రం లేదు. గెలిచినవాళ్లెవరో నాకు తెలీదు.. వాళ్ల మీదఎలాంటి ద్వేషం లేదు కానీ ఆ రాతమాత్రం విశ్లేషణ కాదని కచ్చితంగాచెప్పగలను. కనీసం ఏ రకంగా వాళ్లుప్రచారం చేశారు? టెలీ మార్కెటింగ్‌టైపా, పోస్టు కార్డులు పంపించారా?వ్యక్తిగతంగా కలిసే ప్రయత్నాలుచేశారా? ఎన్ని మీటింగ్‌లు పెట్టారు? ఎంతమంది ఓటింగ్‌లో పాల్గొన్నారు? ఎంతఖర్చయింది? వాళ్ల ఎజెండా ఏమిటి? ఇలాంటివివరాలు ఎక్కడైనా వున్నాయా?..

లైట్‌గాతీసుకో! అసలంత డీప్‌గా ఎందుకుపోవాలి?దిస్‌ ఈజ్‌ ఏ స్మార్ట్‌ వరల్డ్‌... మైడియర్‌! తమాషా ఏమిటంటే, ఎన్నారైన్యూస్‌ సాధారణంగా నెట్‌ ఎడిషన్‌వరకే పరిమితం అవుతోంది.. అచ్చులోఉండదు. ఎందుకంటే ప్రింట్‌ ఎడిషన్‌టార్గెట్‌ రీడర్స్‌, అడ్వర్టయిజమెంట్‌లు,బిజినెస్‌ వ్యవహారం పూర్తిగా వేరు.అలాగే ఎన్నారైల విషయానికి వచ్చేటప్పటికిఇక్కడి మార్కెట్‌ని, అవకాశాలని అందిపుచ్చుకోవాలనేది లక్ష్యం కాబట్టి ఆకర్షించేప్రయత్నాలు చేస్తున్నారు... సో... దిస్‌ ఈజ్‌ఆల్‌ పార్ట్‌ ఆఫ్‌ బిజినెస్‌... మరీ అంతఎమోషనల్‌ అవకు. ఇవేవైనా ఇండియాఎలక్షన్లా? మనం సరిగా రాయకపోతేప్రజలు మట్టిగొట్టుకుపోతారు అని మీడియామడికట్టుకుని కూర్చోడానికి... అసలయినావాటికే దిక్కు లేదనుకో... దొంగలుదొంగలు ఊళ్లు పంచుకున్నట్టు మెజారిటీపత్రికలూ, ఛానల్స్‌ పార్టీలని, లీడర్లనిపంచుకుంటాయి... అని చెప్పుకుపోతున్నతనకి బ్రేక్‌ వేస్తూ, జర్నలిజంలో ఒకప్రమాణం అంటూ ఉంటేనే కదా రాసే వాటికివిలువ ఉండేది... నిన్నటికి నిన్న ఉగాదికివేప పువ్వు దొరకలేదు మరోప్రముఖ దినపత్రికలో న్యూస్‌... ఇండియానుంచి కొడుకుని చూడటానికి వచ్చిన ఆబ్యాంకు మేనేజర్‌తో ఫోన్‌లో ఈ వార్తతీసుకున్నారట.. అది చదివి ఏడుపొచ్చినంతపనయింది నాకు... ఇలా అయితే... ముందుముందు ఎవరి న్యూస్‌ ఐటెమ్‌ వాళ్లుచదువుకోవాల్సిందే..

రాసేవాళ్లుస్టాండెర్డ్‌ పాటించారా లేదా.. అనేది అక్కడపని చేసి వొచ్చావు కాబట్టి నీకుతెలుస్తాయి.. లేదా నీలాంటి మరోనలుగురికి తెలుస్తాయి.. సో దిస్‌ ఈజ్‌ జస్ట్‌ ఏమైనారిటీ ప్రాబ్లమ్‌... పబ్లిక్‌ది కాదు...ఎవర్నో పొగిడారనో, మరో పనికి రానిన్యూస్‌ వేశారనో మేం ఇంతలా బుర్రబద్దలు కొట్టుకోం.. ఇదంతా ఎవరు ఎంతదూరం చెయ్యి చాపగలుగుతారు అనేవిషయం మీద ఆధారపడి ఉంటుంది. ఇక నాప్రిడిక్షన్‌ విను... రాబోయే కాలంలో...ఆంధ్రా మీడియాకి విదేశాల్లో మార్కెటింగ్‌అవకాశాలు. ఆంధ్రా జర్నలిస్టులకి అమెరికావచ్చే ఛాన్సులు పెరుగుతాయి... అంతాసుభిక్షం... సింపుల్‌గా చెప్పాలంటే జస్ట్‌మర్యాద ఇచ్చి పుచ్చుకునే సంస్కృతిపెరుగుతుంది. ఇందులో నీకొచ్చిన ఇబ్బందిఏమిటి... పాజిటివ్‌ థింకింగ్‌ అలవాటు చేసుకో!అసలయినా పరుషంగా నాలుగు మాటలని... ఏంపావుకుంటారు చెప్పు... పైగా ఇక్కడివాళ్లలో చాలా మంది... మా గురించిరాయండి అని డిక్టేట్‌ చెయ్యరు.స్నేహంగా ఉంటారు... అతిథి సత్కారం వాళ్లహాబీ...! దానికి ముచ్చటపడ్డ స్నేహితులులేదా జర్నలిస్టులు వాళ్ల గురించి నలుగురికీతెలిసేలా రాస్తుంటారు. ఈ మాత్రం దానికేఅక్కసుగా ప్రవర్తించడం మార్యాదేనా?వీటికి తోడు స్వయం పోషఖ సాహితీపెత్తందార్లు వగైరాలంటూ దుమ్మెత్తిపోయడాలు.. మరీ చీప్‌... గాట్‌ టు గ్రో!... అంటూఅసహనం ప్రదర్శించాడు.

హౌలీక్రాప్‌ (Holycrap).. ! తెలుగులో చెప్పాలంటే పవిత్రమైన ఈచెత్తని భరించక తప్పేట్టులేదు

Recent Stories

సింధూర దేశభక్తి

షూటింగ్‌ కేసు రివైండ్‌
రాంగోపాల్‌ వర్మ హత్యకు కుట్ర?
ఏకాకి లాలూ, ఏమవుతుందో ఏమో!
ఆటా అధ్యక్షులుగా గవ్వా చంద్రారెడ్డి
తిరగదోడినా ఫలితం శూన్యం?
నేతాజీ మరణ రహస్యం?
రవి అస్తమించిన అనంతపురం
కథల్లేక కదలలేకపోతున్న ఎన్టీఆర్‌ కెరియర్‌
వేడుకలో వితరణ
సీమ వేరుకుంపటి
దొందూ దొందే
కొత్త అధికార నివాసం
ఆరు నెలలకే వారు వీరు
ఐటీ ఉద్యోగుల ఉదారత
2004 వెలుగునీడలు
ఫ్లాష్‌న్యూస్‌
మనసు పాట వినదు
పాపం! బాజీ బజాజ్‌!
తల్లీకొడుకుల అపూర్వ గాధ

ఆ చెట్టు వేళ్ళు పుట్టిన గడ్డలోనే
మాటల మరాఠీ!
ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా అమర్‌
కంచిపై ఇంటిలిజెన్స్‌ కన్ను
బాలకృష్ణపై చార్జిషీట్‌
చిరుకథలో పెను మార్పులు!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్‌ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్‌!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్‌ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్‌ సినిమా
త్వరలో దాసరి ఛానల్‌!
చిన్న స్వామి స్వర్ణాభిషేకం హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X