వెలుగువెనుక చీకటి
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే;/SPAN>
జనరల్ 21-07-2005
హైదరాబాద్:ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఉద్యోగాలుచేసుకుంటున్న వారిపై ఇతరులకు అసూయఉండవచ్చు. ముప్పై ఏళ్ళయినారాకముందే కనీసం నలభై యాభైవేలరూపాయల జీతం ఆర్జిస్తూవీకెండ్స్‌ను విదేశాల తరహాలోగడుపుతున్న యువతరంపై భారతీయసగటు సమాజానికి కాస్తకడుపు మంట ఉండడం సహజం. కానీ ఈటెకీల అందమైన జీవనం వెనుక ఒకబాధామయ కోణం కూడా ఉంది. వారానికి ఐదురోజుల పాటు కష్టపడి పనిచేసి టార్గెట్లు పూర్తి చేసుకునేయువతీ యువకులు అనేకరకాల ఆరోగ్య సమస్యలనుఎదుర్కొంటున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అపోలోఆస్పత్రి సీనియర్ డాక్టర్, మైక్రోసాఫ్ట్ ఇండియాహెల్త్ కన్సల్టెంట్ డాక్టర్ భక్తియార్‌చౌదరి పిటిఐ వార్తా సంస్ధప్రతినిధికి ఈ వివరాలు తెలియజేశారు.వృత్తి, కూర్చునే భంగిమపై ఆయన ఎనిమిదేళ్ళడేటాను సేకరించారు. హెడ్ పోస్చర్‌లో ఉండే ఐటీఉద్యోగులు తీవ్రమైనసెర్వికల్ నెర్వ్ రూట్స్ వత్తిడికిగురవుతున్నారని ఆయన చెప్పారు. ్రస్టెయిట్ స్పైన్ సిండ్రోమ్(ఎస్‌ఎస్‌ఎస్) కూడా వీరిలో సర్వసాధారణమన్నారు.ఇంకా కళ్ళు పొడిబారటం,నిద్రపట్టకపోవడం వంటి వ్యాధులువస్తున్నాయని చెప్పారు. కంప్యూటర్ల ముందుకూర్చుని గంటల తరబడి పనిచేయడం వల్ల విచిత్రమైనవ్యాధులు వస్తున్నాయని తెలిపారు.
ఇటీవలి కథనాలు హోంపేజి












Click it and Unblock the Notifications