వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కడియంకు కౌన్సిల్‌ కంకణం?

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే రాజకీయాలు 05-12-2005

;?

హైదరాబాద్‌:చర్చలతో లాభం లేదనుకుని చంద్రశేఖరరావుచండీయాగం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రసాధన అనుమానాస్పదం కావడం,సొంత పార్టీలో అసమ్మతి, ఇటీవల కాలికిగాయం కావడంతో ఆయనకు తన గ్రహస్ధితి మీద అపనమ్మకం పట్టుకుంది.ఇటీవల మునిసిపల్‌ ఎన్నికల్లో ఘోరపరాజయం చవిచూసినప్పటి నుంచి చంద్రశేఖరరావు ప్రెస్టేజ్‌ గ్రాఫ్‌క్రమంగా కిందికి దిగిపోయింది. ఒక పార్టీఅధినేతగా ఆయన ఎంత చాకచక్యంగావ్యవహరిస్తున్నా పరిస్ధితులు కలిసిరావడం లేదు. ఆయనకు మాటలుఎక్కువ చేతలు తక్కువ. ఆయనఒంటిచేత్తో తెలంగాణ రాష్ట్రం సాధించగలరని ఆశించినవారు తీవ్రనిరాశకు గురయ్యారు.

గత అసెంబ్లీఎన్నికల్లో కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటువిషయంలో ఆయన ఆరితేరిన ఒక వ్యాపారిలావ్యవహరించారు. జి.వెంకటస్వామి, ఇతరతెలంగాణ కాంగ్రెస్‌ నాయకులుటిఆర్‌ఎస్‌ శక్తి గురించి అప్పటి కాంగ్రెస్‌రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి గులాంనబీఆజాద్‌కు అతిగా చెప్పారు. అప్పటి పిసిసిఅధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ కూడాటిఆర్‌ఎస్‌తో పొత్తు లేకపోతే కష్టమని ఆజాద్‌నునమ్మించారు. ఆ సమయంలో సిఎల్‌పి నాయకుడిగా ఉన్నవైఎస్‌ రాజశేఖరరెడ్డిని పొత్తుల విషయంలో అధిష్టానవర్గం విశ్వాసం లోకితీసుకోలేదు. ఒక గంటలో తాము అడిగినన్నిసీట్లు ఇవ్వడానికి అంగీకరించకపోతే, ఒంటరిగాపోటీ చేస్తామని కెసిఆర్‌ అల్టిమేటం ఇచ్చారు.కాంగ్రెస్‌ దిగివచ్చింది. కాంగ్రెస్‌తో ఇక ముందుకూడా ఆడుకోవచ్చని కెసిఆర్‌అనుకున్నారు. వైఎస్‌ కాకుండాతెలంగాణకు చెందిన వారెవరైనాముఖ్యమంత్రి అయి ఉంటే కెసిఆర్‌ పప్పులుఉడికేవి. కానీ వైఎస్‌ కాంగ్రెస్‌అధిష్టానవర్గానికి లక్కీ మస్కట్‌గామారడంతో కెసిఆర్‌కు కాళ్లూ చేతులూఆడని పరిస్ధితి ఏర్పడింది. ఎట్టిపరిస్ధితుల్లో తెలంగాణ రాష్ట్రం డిమాండ్‌ను అంగీకరించవద్దని వైఎస్‌కాంగ్రెస్‌ అధిష్టానవర్గానికి నచ్చజెప్పారు. టిఆర్‌ఎస్‌ది వాపే కానీ బలుపుకాదని ఆయన వారికి చెప్పారు.

తెలంగాణ రాష్ట్రసాధన కంటే చంద్రశేఖరరావుకుపదవి మీద మోజు ఎక్కువ ఉందన్నది వాస్తవం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకుఎన్నికల సర్దుబాటుకు ముందే కాంగ్రెస్‌అధిష్టానవర్గం లిఖితపూర్వకంగాఅంగీకరించిందని కెసిఆర్‌, నరేంద్ర అబద్దాలుచెప్పారు. ఆ సమయంలో పెద్దమనుషులుగా ఉన్న జి.వెంకటస్వామి, డి శ్రీనివాస్‌ వంటివారు అటువంటిదేమీలేదని కుండబద్ధలుకొట్టినట్టు చెప్పారు.దానితో కెసిఆర్‌ ఆ విషయం ఎత్తకుండాజాగ్రత్త పడుతున్నారు. తెలంగాణసాధన మాట ఎలా ఉన్నా పార్టీలో నెలకొన్నఅసమ్మతి, క్రమశిక్షణ రాహిత్యంకెసిఆర్‌కు ఇప్పుడు ప్రధాన సమస్య. ఇదికెసిఆర్‌ స్వయంకృతాపరాధమే.ఆయన ఎమ్మెల్యేలకు కూడా అందుబాటులోఉండేవారు కాదు. అర్ధరాత్రి వరకువిందు వినోదాల్లో పాల్గొనడం, మధ్యాహ్నంవరకు నిద్రలేవకపోవడంతోదొర వారి దర్శనం టిఆర్‌ఎస్‌ నాయకులకు కష్టంగామారింది.ప్రజాస్వామ్యంలో ఇటువంటి రాజరిక ధోరణిఅనుచితమే. ఇప్పుడు చంద్రశేఖరరావుచేయవలసింది ఒక్కటే. తనవ్యవహారశైలిని మార్చుకోవడం, తక్కువగామాట్లాడడం, ప్రజలతో నేరుగాసంబంధాలు ఏర్పరుచుకుంటూనే, తమఎమ్మెల్యేలతో సన్నిహితంగా ఉండడం.

ఇటీవలికథనాలు హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X