వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏకాకి లాలూ,ఏమవుతుందో ఏమో!

By Staff
|
Google Oneindia TeluguNews

పాట్నా:రైల్వేమంత్రి, ఆర్‌జెడి అధ్యక్షుడు లాలూప్రసాద్‌ రాజకీయంగా ఒంటరిఅయిపోయారు. 1989 నుంచి 1997 వరకు బీహార్‌నుమకుటం లేని మహారాజులా ఏలిన ఆయనప్రస్తుతం రాజకీయ అంటరానితనాన్నిఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వఏర్పాటు కోసం నానా తిప్పలు పడుతున్నారు.లాలూ చిరకాల మిత్రులు, ఆగర్భ శత్రువులుఎవరూ కూడా ఆయనకు మద్దతునివ్వడానికిముందుకు రావడం లేదు. మతశక్తుల్ని తరిమికొట్టాలని, రాష్ట్రంలోలౌకిక రాజ్యాన్ని స్థాపించాలని లాలూ పదేపదే పిలుపునిచ్చినప్పటికీ ఆయనతో జతకట్టడానికిఎవరూ ఆసక్తిని కనబరచడంలేదు. పైగా లాలూ ప్రభుత్వానికి తాముమద్దతునిచ్చే ప్రసక్తే లేదని కొన్నిరాజకీయ పక్షాలు గవర్నర్‌ బూటాసింగ్‌కుముందస్తుగానే స్పష్టం చేశాయి.

కాంగ్రెస్‌ పార్టీలోనేఒక వర్గం లాలూకు మద్దతునివ్వడానికిససేమిరా అంటోంది. ఎల్‌జెపి, సమాజ్‌వాదీపార్టీ, సిపిఐ, సిపిఐ(ఎం-ఎల్‌), కొంతమందిస్వతంత్ర అభ్యర్థులు లాలూ నీడను కూడాసహించడం లేదు. దీంతో ఆయనపరిస్థితి ఇరకాటంలో పడింది. లాలూఅనుచురుడు ఒకాయనమనమేమైనా అంటరానివాళ్లమాఅని కూడా ఆయనను ప్రశ్నించినట్టు తెలుస్తోంది.కాంగ్రెస్‌ అధిష్టానం లాలూకు మద్దుతుప్రకటించినప్పటికీ రాష్ట్ర నాయకులు అందుకుసుముఖంగా లేరు. వారు బహిరంగంగానేతమ ధిక్కార స్వరాన్నివినిపిస్తున్నారు. లాలూకు మద్దతునిచ్చేవిషయంలో పునరాలోచన చేయాలనివారు సోనియాకు కూడా విన్నవించారు. ఆర్‌జెడిప్రభుత్వానికి మద్దతునివ్వవద్దనిబిఎస్‌పి ఎమ్మెల్యేలు తమ అధ్యక్షురాలుమాయావతికి ఇదివరకే స్పష్టంచేశారు. లాలూకు మద్దతునివ్వడానికిఆమె అంగీకరించడంతో వారు బహిరంగంగానేతిరుగుబాటు బావుటానుఎగురవేశారు. ఈ సారి ప్రజలు లాలూకు వ్యతిరేకంగానేతీర్పునిచ్చారని లోక్‌జనశక్తి పార్టీఅధికారి ప్రతినిధి సంజయ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు.లాలూకు వ్యతిరేకంగా ప్రచారంచేసినందుకే మాకు 29 స్థానాలుదక్కాయి. అలాంట ప్పుడు ఆయనకుమద్దతునిచ్చే ప్రసక్తే లేదు అని సింగ్‌చెప్పారు. ఆ రాష్ట్రంలో మీడియా కూడాలాలూకు వ్యతిరేకంగానే పనిచేస్తోంది.ఇలాంటి పరిస్థితుల్లో కూడా అధికారంచేజిక్కించుకోగలనన్న ఆశ లాలూలోచావలేదు. గవర్నర్‌ తమ పార్టీనిఆహ్వానిస్తే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికిసిద్ధమేనని, అసెంబ్లీలో కూడా మెజారిటీనిరూపించుకోగలమని ఆయన అంటున్నారు.

ఎన్డీయే రంగంలోకి...

పాట్నా:బీహార్‌లోప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి ఆర్జెడిచేస్తున్న ప్రయత్నాలను విరమింపజేయాలనిజెడి(యు) పార్లమెంటరీ బోర్డు చైర్మన్‌శరద్‌యాదవ్‌ నివాసంలో జరిగినసమావేశంలో ఎన్డీయే బృందం నిర్ణయించింది.శనివారం సాయంత్రం గవర్నర్‌బూటా సింగ్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా రబ్రి దేవిని ఆహ్వానించరాదనిఎన్డీయే బృందం కోరనుంది. ప్రభుత్వఏర్పాటుకు ఆర్జెడికి సంఖ్యాబలం లేదన్నవాస్తవాన్ని జెడి(యు), బిజెపి ప్రతినిధులుగవర్నర్‌కు తెలియజేస్తారు. ఈసమావేశానికి బీహార్‌ వ్యవహారాల ఇన్‌చార్జిఅరుణ్‌జైట్లీ, పార్టీనేత నితిష్‌కుమార్‌హాజరయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X