వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహావిమర్శలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:తెలుగుదేశంమూడు రోజుల మహానాడు కాంగ్రెస్‌ప్రభుత్వంపై విమర్శలు సంధించడానికేఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. యధావిధిగాతెలుగుదేశం అధినేత నారాచంద్రబాబునాయుడు వన్‌మాన్‌ షోఅంతర్లీనంగా కొంత, నేరుగా కొంతసాగింది. ముచ్చటగా ఆరోసారి తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడిగాచంద్రబాబునాయుడును మహానాడుఎన్నుకుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వంపైవిమర్శల జడివాన కురిపిస్తూ మహానాడు 19తీర్మానాలు చేసింది. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగాపోరాడే కార్యక్రమానికి మహానాడు ఏవిధమైన రూపాన్నీ ఇవ్వలేదు.మున్సిపల్‌ ఎన్నికలను నిర్వహిస్తే తమసత్తా ఏమిటో నిరూపిస్తామని దృఢ విశ్వాసంచంద్రబాబు మాటల్లోనూ ఇతరతెలుగుదేశం నాయకుల మాటల్లోనూస్పష్టంగా కనిపించింది.

గతకొంత కాలంగా సూచనప్రాయంగావ్యక్తమైన చంద్రబాబు వామపక్షాలపట్ల చూపుతున్న మొగ్గుకు మహానాడులోస్పష్టమైన రూపం వచ్చింది.సమైక్యాంధ్ర కోసం పోరాడేందుకుఒక ఐక్యవేదికను ఏర్పాటు చేయడానికితమతో కలిసి రావాలని మహానాడువామపక్షాలకు పిలుపునిచ్చింది. ఈ పిలుపురావడమే తరువాయి దానికివ్యతిరేకంగా వామపక్షాలుప్రతిస్పందించాయి. బిజెపితో తెగదెంపులుచేసుకుని, ప్రపంచ బ్యాంక్‌కుతలొగ్గబోమని స్పష్టంగా ముందుకువస్తేనే తెలుగుదేశంతో స్నేహానికిప్రాతిపదిక ఏర్పడుతుందని సిపియంరాష్ట్ర కమిటీ కార్యదర్శి బి.వి. రాఘవులుప్రకటించగా, తెలంగాణ ఉద్యమంతలెత్తడానికి చంద్రబాబు విధానాలేకారణమని, తెలంగాణను నిర్లక్ష్యంచేయడం వల్లనే ఈ పరిస్థితితలెత్తిందని, తెలంగాణ అభివృద్ధికితాము చేసిన సూచనలను చంద్రబాబుబేఖాతరు చేశారని సిపి ఐ కాస్తా ఘాటుగాజవాబిచ్చింది.

మరోవిషయంలో తన ధోరణి మారినట్లుచంద్రబాబు మాటలు కనిపించాయి. తాముట్రేడ్‌ యూనియన్లకు వ్యతిరేకంకాదని ఆయన చెప్పుకోవాల్సి వచ్చింది.విద్యార్థులు రాజకీయాలకు దూరంగాఉండాలంటూ తెలుగు విద్యార్థిని మూసేసినచంద్రబాబు అధికారం కోల్పోయినతర్వాత ఆకులు పట్టుకుని తెలుగు విద్యార్థిసంఘాన్ని పునరుద్ధరించారు. అలాగేట్రేడ్‌ యూనియన్ల విషయంలో ఇప్పుడుమాట్లాడుతున్నారు. తానుపరిశ్రమలను పునరుద్ధరించడానికేకంకణం కట్టుకున్నానని కూడా ఆయనచెప్పుకున్నారు. దాదాపు తొమ్మిదేళ్ల పాటుచంద్రబాబు చేతలను ప్రజలు రుచిచూశారు. అనుభవం ఇంకామెదులుతూనే ఉంది. అటువంటిసందర్భంలో తన మాటలను ప్రజలునమ్ముతారనుకోవడం చంద్రబాబుఅత్యాశే అవుతుంది. కార్మిక సంఘాలకుపరిశ్రమల్లో భాగస్వామ్య కల్పించాలని,లాభాల్లో కార్మికులకు వాటా ఇవ్వాలని ఆయనమాట్లాడారు. ఇదంతా వామపక్షాలనుసంతోషపెట్టి, వారి ప్రాపకంసంపాదించడానికేనని అనుకుంటే అదిఅనుకున్నవారి తప్పు కాదు. ఆయనకదలికలు అటువైపుగా సాగుతున్నవైనాన్ని అందరూ గమనిస్తూనేఉన్నారు.

తెలంగాణవిషయంలో ఆయన పాత వైఖరి తిరిగిప్రకటించారు. సమైక్యాంధ్ర కోసంప్రాణాలైనా ఇస్తానని ఆయనప్రకటించారు. ప్రాణాలైనా అర్పిస్తాననేమాట పాతబడిపోయిందనే విషయాన్ని కూడాఆయన గమనించినట్లు లేరు. ఇదిమరింత ప్రజావ్యతిరేకతనుచంద్రబాబుకు తెచ్చి పెడుతుందనేవిషయం ఆయన గుర్తించినట్లు లేదు.వామపక్షాల పట్ల ఏదో కొంత మేరకుతెలంగాణ ప్రజలు, మేధావులుసానుకూలంగా ఉండడానికి కారణం అవిపీడితుల పక్షాన నిలబడిపోరాడుతున్నాయనే భావనమాత్రమే. తెలంగాణ విషయానికి వస్తేవామపక్షాలను తెలంగాణ ప్రజలు,మేధావులు నిర్ద్వంద్వంగావ్యతిరేకిస్తారనడంలో సందేహంలేదు. తెలంగాణపై ప్లెబిసైట్‌నిర్వహించాలని సినీనటి విజయశాంతిఆషామాషిగా డిమాండ్‌ చేయలేదు.ప్రజాభిప్రాయాన్ని అంచనా వేసే ఆమె ఆడిమాండ్‌ చేశారనే విషయాన్ని కూడాగమనించే స్థితిలో తెలుగుదేశం పార్టీలేదు. 610 జీవో అమలు విషయంలో గానీ,తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల విషయంలోగానీ చంద్రబాబు అనుసరించిన వైఖరి ఏనాయకుడికీ తీసిపోదనే భావన బలంగాఉంది.

రాష్ట్రంలోరైతుల ఆత్మహత్యల దగ్గరి నుంచిశాంతిభద్రతల వైఫల్యం వరకుతాము చేసింది చాలా గొప్పగా ఉందని,కాంగ్రెస్‌ అన్నింటిలో విఫలమైందని చాటిచెప్పడానికి తెలుగుదేశం మహానాడు అన్నిరకాలుగా ప్రయత్నించింది. ఈ రకమైనతెలుగుదేశం వ్యవహార శైలిని రాష్ట్రప్రజలు రోజూ గమనిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్‌ప్రజా వ్యతిరేక విధానాలను, ఒంటెత్తుపోకడలను, వైఫల్యాలను కూడా ప్రజలు ఓకంట కనిపెడుతూనే ఉన్నారు. కాంగ్రెస్‌మీది వ్యతిరేకత తెలుగుదేశం పార్టీకికలిసి రావాల్సిందే గానీ తెలుగుదేశంనిర్మాణాత్మకంగా పని చేసి ప్రజామద్దతు కూడగట్టుకుంటుందనేదిసాధ్యం కాదని మహానాడు తేల్చిచెప్పింది.

అధ్యక్షుడిగాచంద్రబాబు ఎన్నికైన తర్వాత చేసినప్రసంగం గత ప్రసంగానికి ఏ మాత్రంతీసిపోదు. పార్టీలో ఎవరేమిటో తనకు బాగాతెలుసునని అంటూక్రమశిక్షణారాహిత్యానికి పాల్పడేవారిపైకఠిన చర్యలు తీసుకుంటామని ఆయనహెచ్చరించారు. ఇది కొత్త విషయమేమీకాదు. యువతరానికి పార్టీలో ఎక్కువప్రాధాన్యం ఇస్తామని ఆయన చెప్పారు.కార్యవర్గ నిర్మాణంలో గానీ ఇదిబయటపడదు. పాతుకుపోయిననాయకులు తెలుగుదేశం చాలా మందిఉన్నారు. వీరిని కాదని యువతరానికిఅవకాశం ఇచ్చే వెసులుబాటు చంద్రబాబుకుఉండకపోవచ్చు. ఏమైనా కొత్తదనమేదీ లేదు. పాతదే మళ్లీమహానాడు పాడింది.

ఇటీవలికథనాలు

  • ఎన్టీఆర్‌ స్మృతిలో...
  • మాస్టర్‌ ప్లాన్‌!
  • చక్రబంధంలో చంద్రబాబు
  • చంద్రబాబుకుకేంద్ర రక్షణ!
  • పరిటాల రాజకీయ వైరాగ్యం
  • మా తెలుగు బాబుకు చాడీల దండ!
  • ఇక బాబు రోడ్‌షోలు
  • టిడిపి గుండెల్లో ఏలేరురైళ్ళు
  • చంద్రబాబుతురుపుముక్క
  • ఎన్టీఆర్‌ గుర్తున్నాడా?
  • సైకిల్‌కుఅసమ్మతి బ్రేక్‌లు
  • చిరంజీవిరహస్య ఎజెండా?

  • అస్పష్ట రాజకీయ చిత్రం
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X