వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేరు ఎమ్మెస్‌,మాటే మైనస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

M S Rఆయనపేరు మెన్నేని సత్యనారాయణరావు.అందరూ ఎమ్మెస్‌ అని పిలుస్తారు. కొందరుఫ్లాష్‌ బ్యాక్‌ సత్తెన్న అని ఆప్యాయంగాతలుచుకుంటారు. ఆయన సీనియర్‌కాంగ్రెస్‌ నాయకుడు. రాష్ట్రరాజకీయాల్లో పెద్ద మనిషి. వైఎస్‌రాజశేఖరరెడ్డి తనకు దేవాదాయశాఖను కేటాయించినప్పుడు అలకపాన్పుఎక్కిన వ్యక్తి. ఏడాది తర్వాత ఇప్పుడుతాను చేసుకున్న పుణ్యం కొద్దీ ఈ శాఖలభించిందని చెబుతున్న అల్ప సంతోషి.

చంద్రబాబునాయుడు, వైఎస్‌ మంచి మిత్రులుగా ఉండాలనిఆకాంక్షించిన విశాల హృదయుడు.ప్రత్యర్ధి పార్టీకి చెందిన చంద్రబాబునాయుడిని అప్పుడప్పుడు మెచ్చుకోకుండాఉండలేరాయన చంద్రబాబు నాయుడుమా మనిషేనని ఆయన అంటుంటారు.గతంలో చంద్రబాబు నాయుడుకాంగ్రెస్‌లో మంత్రిగాపనిచేసినందువల్లనేమో. ఈ రోజు ఆయనఇందిరాగాంధీని పొగుడుతూ, పేదలకుసేవ చేయడంలో ఇందిరా గాంధీకి,నక్సలైట్లకు తేడాలేదనిసెలవిచ్చారు. నక్సలైట్ల వద్ద ఆయుధాలు ఉన్నాయని,ఇందిరా గాంధీ వద్ద లేవని తేడాఅదొక్కటేనని భాష్యం చెప్పారు.

గతంలోకాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిరాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడువృద్ధ నాయకులు కూడా చేతులుకట్టుకుని నిలబడితే మన సత్తెన్నమాత్రం గులాం నబీ ఆజాద్‌ను పార్టీలోపైకి తెచ్చినది నేనే అని ప్రకటించి తనవిలక్షణతను చాటుకున్నారు. ఇందిరాగాంధీ హయాంలో ఎఐసిసి ప్రధానకార్యదర్శి హోదాలో ఐదు రాష్ట్రాలకు ఇన్‌చార్జిగా వ్యవహరించానని గుర్తుచేసుకుంటూ ఉంటారు. తాను పిసిసిఅధ్యక్షుడుగా ఉన్నప్పుడు అందరిలాముఖ్యమంత్రి పదవి ఆశించకుండా కాబోయేముఖ్యమంత్రి వైఎస్సేనని ప్రకటించినఔదార్యం ఆయనది. అయితే ఆయన కూడామనిషే కాబట్టి ఆయనకూ కోపం, కడుపుమంట ఉంటాయి. వాటిని ఏమాత్రందాచుకోలేకపోవడం ఆయనప్రత్యేకత. ముఖ్యమంత్రి వైఎస్‌ కూడావేదిక మీద ఉన్న ఒక సభలో ఆయనవైఎస్‌ తనను తోక్కేస్తున్నాడనికామెంట్‌ చేశారు. అందుకు వైఎస్‌ముసిముసిగా నవ్వుకోవడం తప్పసమాధానం ఇవ్వలేదు. రాజకీయాల్లోతానేమీ సంపాదించుకోలేదని,సంపాదించుకుని ఉంటే తన కొడుకులుచాకిరేవు (డ్రై క్లీనింగ్‌ షాపు) ఎందుకుపెట్టుకుంటారని ఆయన ఛమత్కరిస్తూఉంటారు.

-సిహెచ్‌ శ్రీనివాసరావు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X