వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేతాజీ మరణరహస్యం?

By Staff
|
Google Oneindia TeluguNews
హౖెెదరాబాద్‌:నేతాజీ సుభాష్‌ చంద్ర బోస్‌ 108 వ జయంతినిఇటీవల ఆయన అభిమానులుదేశవ్యాప్తంగా జరుపుకున్నారు.స్వాతంత్య్ర సంగ్రామ కాలంలో ఆయనఅదృశ్యం కావడం ఇప్పటికీ మిస్టరీగాఉంది. ఆనాటి మితవాద కాంగ్రెస్‌ నాయకులేనేతాజీని కనబడకుండా చేశారని ఆరోపణలున్నాయి.నేతాజీఅదృశ్యంపై మళ్ళీ దర్యాప్తుజరిపించాలన్న పిటిషన్‌పై కలకత్తాహైకోర్టు స్పందించి దర్యాప్తు సంఘాన్ని నియమించవలసిందిగా వాజ్‌పేయిప్రభుత్వాన్ని ఆదేశించడంతో 2000సంవత్సరం మేలో సుప్రీంకోర్టురిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎంకె ముఖర్జీనిఏకసభ్య కమిషన్‌గా నియమించారు. ఈకమిషన్‌ పని ప్రారంభించింది.

వారం రోజులక్రితం ఒక ప్రముఖ ఆంగ్ల టీవీ ఛానల్‌ఒక ముఖ్యమైన వార్తను ప్రసారం చేసింది. ఇదేకేసు దర్యాప్తునకుగతంలో నియమితులైన జస్టిస్‌ ఖోస్లా నేతాజీవిమాన ప్రమాదం జరిగిన ప్రాంతాన్నిసందర్శించడానికి అనుమతిఇవ్వవలసిందిగా కోరగా మన్మోహన్‌ నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంనిరాకరించిందని ఆ వార్త సారాంశం.సాంకేతిక కారణాల వల్ల ఆయనకుఅనుమతి నిరాకరించారా ఇతరకారణాలు ఏవైనా ఉన్నాయా అన్నది ఆలోచించవలసినవిషయం.

సుభాష్‌చంద్ర బోస్‌ 1945 ఆగస్టు 18 న జపాన్‌లో జరిగినఒక విమాన ప్రమాదంలోమరణించారన్నది కట్టు కథ అని,ఆయనను అప్పటి సోవియట్‌ యూనియన్‌లోని సైబీరియా ఎడారిలోనిర్బంధించారని ఆయన అభిమానులుఆరోపిస్తున్నారు. బ్రిటీష్‌ ప్రభుత్వంఇటీవల ప్రచురించిన డాక్యుమెంట్లప్రకారం 1945 అక్టోబర్‌ 25 న జరిగిన బిటీష్‌కేబినెట్‌ రహస్య సమావేశంలోసుభాష్‌ చంద్రబోస్‌ను ఏంచేద్దామని చర్చించినట్టు ఉంది. కేబినెట్‌సమావేశం మినిట్స్‌లోని పదో అంశమిది.

"Thechoice seems to be between deporting and interning Bose outside India or tryinghim in India and commuting the death sentence"

చివరికిబ్రిటీషు ప్రభుత్వం నేతాజీని ఉన్న చోటనే(సైబీరియా ఎడారిలో) ఉంచాలని నిర్ణయించినట్టుతెలుస్తోంది. బోస్‌ నిజంగా 1945 ఆగస్టులో విమానప్రమాదంలో మరణించి ఉంటే అదేసంవత్సరం అక్టోబర్‌లో బ్రిటీష్‌ మంత్రివర్గంఆయనను ఏం చేయాలన్న విషయంపై రహస్యసమావేశంఎందుకు జరపవలసి వచ్చింది?

నేతాజీమరణంపై రహస్య ఫైళ్లు బ్రిటీషు,అమెరికా, సోవియట్‌ ప్రభుత్వాల వద్దఉన్నాయన్న విషయం భారతప్రభుత్వానికి తెలుసు. నేతాజీ మిస్టరీపైగతంలో ఏర్పాటు చేసిన షానవాజ్‌ ఖాన్‌కమిషన్‌కు ఆ ఫైళ్ళను చూపించడాని మూడుదేశాలు నిరాకరించాయి. ఆఫైళ్ళను 2005వరకు రహస్యం గాఉంచాలని ఆ దేశాలు నిర్ణయం తీసుకున్నాయి.

నేతాజీవిమాన ప్రమాదంలోమరణించారన్నది కట్టుకథేనని నిరూపించడానికిమాజీ ఎంపి సమర్‌గుహప్రయత్నించారు. నవాజ్‌ కమిటీ ప్రొసీడింగ్స్‌లో సమర్‌ గుహపాలుపంచుకున్నారు. స్వాతంత్య్రసంగ్రామంలో నేతాజీ విప్లవ మార్గంఎంచుకోగా గాంధీజీ అహింసామార్గంఎంచుకున్న విషయం తెలిసిందే.స్వాతంత్య్రం సాధించుకోవడంలో ఈరెండు మార్గాలూ ఉపయోగపడ్డాయి. నేతాజీతోసైద్ధాంతిక విభేదాల కారణంగాఆయన త్యాగాలను కాంగ్రెస్‌ నాయకులుఇప్పటికీ గుర్తించడం లేదు. నేతాజీరెండు సార్లు కాంగ్రెస్‌ అధ్యక్షుడుగాఎన్నికైనప్పటికీ ఆయనను కాంగ్రెస్‌ నాయకులు స్మరించుకోకపోవడం దురదృష్టకరం. నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ ఎప్పుడు, ఎలా మరణించారోతెలుసుకునే హక్కు భారత ప్రజలకుఉంది. నేతాజీకి సంబంధించిన రహస్యఫైళ్ళను ఇప్పటి ముఖర్జీ కమిషన్‌కు చూపించవలసిందిగాభారతప్రభుత్వం బ్రిటీష్‌, రష్యాప్రభుత్వాలను కోరవవలసినఅవసరముంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X