వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమస్యలసుడిగుండం

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే కాంగ్రెస్‌ 11-07-2005

హైదరాబాద్‌:ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోతఅన్నట్టుంది ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి వ్యవహారం. సమ్మెలు,రాజీనామాలు, భారీ వర్షాలనుపట్టించుకోకుండా ఆయన విదేశాల్లోపర్యటించి సోమవారం రాత్రికిహైదరాబాద్‌ చేరుకుంటున్నారు.రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించినట్టుగాఅధికారులు రాజ్యమేలుతున్నారనికాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడుపి.జనార్ధన్‌రెడ్డి విమర్శించడం, చీఫ్‌సెక్రటరీకి ఫోన్‌ చేసి అసంతృప్తి వ్యక్తంచేయడంతో రాష్ట్రకాంగ్రెస్‌లో అసమ్మతి జెండాఎగురవేసినట్టయింది.

ఇదిచాలదన్నట్టు రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి బొత్స సత్యనారాయణవోక్స్‌వ్యాగన్‌ కుంభకోణంలోఇరుక్కున్నారు. ఇది వైఎస్‌ ప్రభుత్వానికిమచ్చ తెచ్చే ఉదంతమే.హైదరాబాద్‌ నగరం భారీ వర్షాలకారణంగా అతలాకుతలమైనప్పుడుసహాయ చర్యలను పర్యవేక్షించాల్సినరెవిన్యూ మంత్రి ధర్మానప్రసాదరావు సొంత వూరులో విశ్రాంతి తీసుకోవడంవిమర్శలకు తావు ఇచ్చింది.దీనితో రాష్ట్రంలో ఎన్నికైన ప్రభుత్వంఉందా అన్న అనుమానాలు కలిగాయి.కాంగ్రెస్‌ ప్రభుత్వమంటే కలగూరగంప అని,మంత్రుల మధ్య సమన్వయం ఉండదన్నవిమర్శలు వస్తున్నాయి. జూనియర్‌ డాక్టర్లసమ్మెను ప్రభుత్వంపరిష్కరించలేకపోవడం పరిహాసానికిగురయింది.

వైఎస్‌రెండు మూడు రోజుల్లో ఢిలీ వెళ్ళిఅధిష్టానవర్గం చెప్పినట్టుగా టిఆర్‌ఎస్‌అధినేత చంద్రశేఖరరావుతో సమావేశం కావలసి ఉంది. కెసిఆర్‌తోవైఎస్‌ ఎక్కువ తక్కువగా మాట్లాడితేఅధిష్టానవర్గం మొట్టికాయలనుతినవలసి వస్తుంది. పదిహేను నెలల పాటుచక్రవర్తిలా ఉన్న వైఎస్‌ పరిస్ధితి ఇప్పుడుమింగలేక కక్కలేక అన్నట్టుంది.అధిష్టానవర్గం వద్ద ఆయన హవా క్రమంగా తగ్గుతోంది. వైఎస్‌ ఇతరకాంగ్రెస్‌ నాయకులనుపట్టించుకోకుండా, కోటరీ మాటలువింటున్నారన్న ఆరోపణలు అధిష్టానవర్గం దృష్టికివెళ్ళాయి. వైఎస్‌ పాలనపై సినిమా రంగానికిచెందిన ఒక కేంద్ర మంత్రి ఆదివారం హైదరాబాద్‌లోలోపాయికారీ విమర్శలు చేయడంకాంగ్రెస్‌ వర్గాల్లో సంచలనంసృష్టించింది. రాష్ట్రానికి సంబంధించి ఏవ్యవహారం చర్చించడానికైనా వైఎస్‌సుముఖత చూపడం లేదని, ఆయనసలహాదారులదే రాజ్యం నడుస్తోందని,అవసరమైనప్పుడు వీటిని ఖండించకతప్పదని ఆ కేంద్ర మంత్రిబయటపడ్డారు. ఒక్కసారిగా వైఎస్‌ను ఇన్నిసమస్యలు చుట్టుముట్టాయి.

బయట ఇన్నిసమస్యలున్నా వైఎస్‌కు ఊరట కలిగించినవిషయం ఒకటుంది. చాలా ఏళ్ళుగా అనావృష్టితోకుంగిపోయిన రైతులకు ఇటీవలకురిసిన వర్షాలు సంతృప్తికలిగించాయి. అది వానదేవుడి కరుణఅయినా కొంత క్రెడిట్‌ ముఖ్యమంత్రివైఎస్‌కు దక్కుతుంది. తమదిరైతుల ప్రభుత్వమని చెప్పుకుంటున్నఆయనకు ఇది గొప్ప రిలీఫ్‌. గ్రామీణ ప్రజలుఇప్పటికీ వైఎస్‌ వెంట ఉన్నారని ఇటీవల కొన్ని సర్వేలలో వెల్లడైంది.

ఇటీవలి కథనాలు హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X