• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇక ద్రావిడ్‌ఎరా!

By Staff
|
హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ 26-10-2005

బ్యాటింగ్‌లోస్థిరమైన ప్రతిభనుకనబరుస్తున్న రాహుల్‌ ద్రావిడ్‌కెప్టెన్‌గా నిలదొక్కున్నట్లేనా? ఒక్క వన్డేమ్యాచ్‌లో విజయంతో దాన్నినిర్ధారించలేకపోయినప్పటికీరాహుల్‌ ద్రావిడ్‌ కనబరిచినసమయస్ఫూర్తి, స్నేహభావన,వ్యూహరచన కెప్టెన్‌గా ఆయనప్రతిభను నాగపూర్‌లో శ్రీలంకతో జరిగినవన్డే మ్యాచ్‌ వెల్లడి చేసింది. ఇంతకుముందు సౌరబ్‌ గంగూలీ మ్యాచ్‌లకుదూరంగా ఉన్నప్పుడు కెప్టెన్సీబాధ్యతలు నిర్వర్తించినప్పటికీ అవి అతనిప్రతిభను పూర్తిగా వెల్లడిచేయలేకపోయాయి. దానికి ఉండాల్సినకారణాలు ఉన్నాయి. కెప్టెన్సీలో దాదాగిరిముగిసినట్లేనని పెద్ద యెత్తునఅభిప్రాయం వ్యక్తమవుతోంది.

సౌరబ్‌గంగూలీ ఆటతీరు పూర్తి నాసిరకంగామారడం, భారత జట్టు కొత్త కోచ్‌ గ్రెగ్‌చాపెల్‌తో తలెత్తిన వివాదాలు ద్రావిడ్‌కుకెప్టెన్‌గా అవకాశాలు కల్పించాయనిచెప్పాల్సిన అవసరం లేదు. పూర్తి స్థాయికెప్టెన్‌కు ఉండే వెసులుబాటు తాత్కాలికంగాకెప్టెన్సీ నిర్వహించే సమయంలోఉండదనే విషయం నాగపూర్‌ వన్డేమ్యాచ్‌ రుజువు చేసింది. మాస్టర్‌బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ తిరిగి జట్టులోచేరడమే కాకుండా అతనురాణించడం కూడా ద్రావిడ్‌కు కలిసివచ్చిన విషయమే. జట్టులో టీమ్‌ స్పిరిట్‌కనిపించింది. మరి దీని వెనక ఉన్నకారణాలను ఇదమిద్దంగాచెప్పలేకపోయినప్పటికీ కెప్టెన్‌పాత్ర ఈ విషయంలోప్రధానమవుతుందని వేరుగాచెప్పాల్సిన అవసరం లేదు.

సచిన్‌టెండూల్కర్‌ రాణించడంతో పాటుప్రయోగాత్మకంగా ఇర్ఫాన్‌ పఠాన్‌నువన్‌ డవున్‌లో పంపడం కూడా కలిసివచ్చింది. దానికి తోడు రాహుల్‌ ద్రావిడ్‌చెలరేగి ఆడాడు. బ్యాటింగ్‌ విషయంలోనేకాకుండా అన్ని విషయాల్లో భారత్‌నాగపూర్‌ వన్డేలో తన ప్రతిభనుకనబరిచింది. స్పిన్నర్లను ద్రావిడ్‌వాడుకున్న తీరు కూడా ఆకట్టుకుంది.పేసర్ల బౌలింగ్‌లో జయసూర్య,సంగరక్క చెలరేగి ఆడుతున్నసమయంలో వ్యూహాత్మకంగా ద్రావిడ్‌హర్బజన్‌ సింగ్‌ను బౌలింగ్‌కుఆహ్వానించాడు. అదే సమయంలో సెహ్వాగ్‌కు ఒకఓవర్‌ ఇచ్చి స్పిన్‌ బౌలింగ్‌ నిర్వర్తించేపాత్రను పసిగట్టాడు. ఆ వెంటనే మురళీకార్తిక్‌ను మైదానంలోకి దింపి స్పిన్‌అటాక్‌ పెట్టాడు. ఇది మంచి ఫలితాన్నిచ్చింది.ఒక్కసారిగా ఆట తీరే మారిపోయింది. పూర్తిగాభారత్‌ది పైచేయి అయింది.

ఇదేసమయంలో కొత్త కుర్రాడు శ్రీశాంత్‌నుచాలా చక్కగా వాడుకోవడమే కాకుండాఅతనిలో ఆత్మవిశ్వాసం పెంచే పనికి ద్రావిడ్‌పూనుకున్నాడు. అనుభవం గలపేసర్లను పక్కన పెట్టి చివరిఓవర్లలో శ్రీలంక టెయిల్‌ ఎండర్లుప్రతిఘటిస్తున్న సమయంలోశ్రీశాంత్‌ను బౌలింగ్‌కు దింపాడు. శ్రీశాంత్‌రెండు వికెట్లు తీశాడు. దీంతో శ్రీశాంత్‌లోఎనలేని ఆత్మవిశ్వాసం పెరిగిందనిచెప్పడంలో అతిశయోక్తి లేదు.

ఇకవిజయమంతా తన గొప్పతనమేననిచాటుకోవడానికి ద్రావిడ్‌ ఏ మాత్రంప్రయత్నించలేదు. సీనియర్లకుతగిన గౌవరం ఇస్తూ, జూనియర్లనుప్రోత్సహించే పనికి ద్రావిడ్‌ ప్రయత్నించిసమయస్ఫూర్తిని ప్రదర్శించిన విషయంఅతను కెప్టెన్‌గా ఎంపికయినప్పటినుంచి బయట పడుతూనే ఉంది. సచిన్‌కుఇచ్చిన గౌరవం తనకు కూడా గౌరవంతెచ్చి పెడుతుందని ద్రావిడ్‌గమనించినట్లే ఉన్నాడు. అందుకే సూపర్‌సిరీస్‌లో పాల్గొని సిడ్నీ నుంచి భారత్‌లోఅడుగు పెట్టిన వెంటనే సచిన్‌తోఆడడానికి తాను ఉవ్విళ్లూరుతున్నాననిచెప్పాడు. వన్‌ డవున్‌లో ఇర్ఫాన్‌పఠాన్‌ను బ్యాటింగ్‌కు దించాలనేది సచిన్‌ఆలోచననే అని అతను చెప్పడం కూడాద్రావిడ్‌ మీద గౌరవాన్ని పెంచుతుంది.

ద్రావిడ్‌కెప్టెన్సీ పట్ల కోచ్‌ చాపెల్‌ మొదటి నుంచిఆసక్తి చూపుతన్నట్లు అతని తీరుచెబుతూనే ఉంది. ఇద్దరి మధ్య మంచిసమన్వయం కుదిరే అవకాశాలు కూడాఉన్నాయి. జట్టు సభ్యుల ప్రేమనుచూరగొనడంతో పాటు తనవ్యక్తిగత ప్రతిభను ప్రదర్శిస్తూకెప్టెన్‌గా తన బాధ్యతలనునిర్వహించాలనే ఆలోచనతో ఉన్నట్లు ద్రావిడ్‌తీరు మనకు పట్టిస్తోంది. ఇది భారతక్రికెట్‌కు ఎంతైనా మేలు చేస్తుంది.

మిగతావన్డే మ్యాచ్‌లకు ఈ నెల 28వ తేదీన జట్టుఎంపిక జరుగుతుంది. సౌరబ్‌ గంగూలీకెప్టెన్‌గా రావడం ఇక అంత సులభంకాకపోవచ్చు. జట్టులోకైనా వస్తాడా అనేదిఇప్పుడు అందరినీ పట్టుకున్న అనుమానం.ఇప్పుడు జట్టులోకి రాకపోతే గంగూలీశకం ముగిసినట్లేనని అనుకోవచ్చా?ఏదైనా కాలమే నిర్ణయిస్తుంది.

ఇటీవలి కథనాలు హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more