వర్షంతోహర్షం
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే;/SPAN>
జనరల్ 28-07-2005
హైదరాబాద్:నాలుగేళ్ళుగా సరైన వర్షాలుపడకపోవడంతో అలమటించిపోయినరాష్ట్రంలోని రైతన్నలు భారీ వర్షాలురావడంతో ఆనందిస్తున్నారు. దీనితోవ్యవసాయ పనులు పుంజుకున్నాయి.ఎనభై శాతం పొలాల్లో వివిధ పంటలువిత్తుకోవడం, నాట్లు వేసుకోవడంపూర్తయినట్టు వ్యవసాయ శాఖ అంచనా. ఈసీజన్‌లో 273 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సిఉండగా ఇప్పటికే 292.4 మిల్లీ మీటర్ల వర్షంకురిసింది. తెలంగాణలో మరో రెండు రోజులువర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖతెలియజేయడంతో ఈ ప్రాంతంరైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
అనంతపురం,నిజామాబాద్, వరంగల్, రంగారెడ్డి,ఆదిలాబాద్ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది.మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, కరీంనగర్,మెదక్, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు, కడప, చిత్తూరుజిల్లాల్లో ఓ మోస్తరు వర్షపాతం రికార్డుఅయింది. శ్రీకాకుళం, విజయనగరం,విశాఖపట్నం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోతక్కువ వర్షం కురిసింది.అనంతపురం జిల్లాలో రికార్డు స్ధాయిలో 77శాతం ఎక్కువగా వర్షపాతం నమోదు కావడం విశేషం.
భారీ వర్షాలుకురవడం, వ్యవసాయ పనులుముమ్మరం కావడంతో ముఖ్యమంత్రిరాజశేఖరరెడ్డి దేవుడుకరుణించాడు అని వ్యాఖ్యానించారు.రైతుల పేరు వల్లించి అధికారంలోకివచ్చిన వైఎస్‌కు ఇది పెద్ద ఊరట. రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగాకౌలుదారులకు రుణాలు ఇస్తున్నట్టు ఆయన చెప్పారు. రాష్ట్రంలోని 12 లక్షలమంది కౌలుదారులకు 16 వేల కోట్ల రూపాయలనురుణాలుగా ఇవ్వనున్నట్టు ఆయనతెలిపారు. సకాలంలో సరైన వర్షాలుపడితే దాని సానుకూల ప్రభావం మొత్తం ఆర్ధిక వ్యవస్ధమీద ఉంటుంది.వరుసగా అనావృష్టి రావడంవల్లనే చంద్రబాబు నాయుడిపై గ్రామీణప్రాంతాల్లో వ్యతిరేకత ఏర్పడి టిడిపిఓటమికి దారి తీసింది.
ఇటీవలి కథనాలు హోంపేజి












Click it and Unblock the Notifications