వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిజిటల్‌ డివైడ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:ప్రముఖ జర్నలిస్టు సాయినాధ్‌ ఇటీవలఅవుట్‌లుక్‌ ఆంగ్ల వారపత్రికప్రత్యేక సంచికలో రాసిన వ్యాసం ఆలోచనలు రేకెత్తించేదిగా ఉంది. గ్రామీణపేదరికం, అక్కడి పరిస్ధితుల గురించిమీడియా ముఖ్యంగా భారతీయ దినపత్రికలుదృష్టిసారించడం లేదని ఆయనఆవేదన వ్యక్తం చేశారు. ధనిక,బీద వ్యత్యాసం రోజు రోజుకీ పెరిగిపోతోందని,మెర్సిడెజ్‌ బెంజ్‌ కారు కొనుక్కోడానికిఆరుశాతం వడ్డీకి రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు పోటీపడుతుండగా,ట్రాక్టరు కొనుక్కోవాలనుకుంటున్న రైతుకుఅంతకు రెట్టింపు వడ్డీకి కూడారుణం ఇవ్వడానికి బ్యాంకులువెనుకాడుతున్నాయి. వెనుక బడినఅనంతపురం జిల్లాలో ఎన్నో ఆకలి చావులుసంభవించాయి. అయినా టాటాసుమో, ఇతరపెద్ద కార్ల కొనుగోలులో ఆ జిల్లాఅగ్రస్ధానంలో ఉంది. అక్రమార్జన, నెత్తుటికూడుకు అలవాటు పడిన ఫ్యాక్షనిస్టులు ఈ విధంగాభారీ వాహనాలు కొనుగోలు చేస్తున్నారు.

దేశంలో 70వేల మంది మిలియనీర్లు ఉన్నారని, వీరి నెలసరిఆదాయం పదిలక్షలకు పైగా ఉందనిఒక ఆంగ్ల పత్రిక పతాక శీర్షికగా ప్రచురించడాన్ని సాయినాధ్‌తప్పుపట్టారు. ఆకలి చావులపై లోపలి పేజీల్లోప్రచురించే పత్రికలు ఒక మోడల్‌మరణాన్ని ప్రముఖంగా వివిధ శీర్షికలకింది ప్రచురించడం అన్యాయమని ఆయనరాశారు. మన తెలుగు పత్రికలు కూడాఇందుకు మినహాయింపు కాదు. వివిధ పార్టీలనాయకులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటే పతాక శీర్షికలతోప్రచురిస్తున్న ఈ పత్రికలు వ్యవసాయసంబంధ సమస్యలకు ప్రాధాన్యమివ్వడంలేదు. దేశంలో యాభై శాతం జనానికి అన్నంపెడుతున్న వ్యవసాయ రంగానికిసంబంధించిన నిపుణులు పత్రికల్లో ఉండాలనిసాయినాధ్‌ వాదన.

అమెరికావంటి దేశాల్లో మంత్రులు ఎప్పుడో కానీప్రెస్‌ కాన్ఫరెన్సులు పెట్టరు. మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలోప్రతిరోజూ ఏదో ఒక మంత్రి ఒక అల్ప విషయంపైప్రెస్‌ కాన్ఫరెన్స్‌ పెట్టడం, మనవిలేకరి మహాశయులు చొప్పదంటు ప్రశ్నలువేయడం- కొన్ని గంటల సమయంవృధా అయిపోవడం మామూలైపోయింది.అతి ముఖ్యమైన చోటే ఇన్ని పనిగంటలు వృధాఅవుతుంటే దిగువ స్ధాయిలో ఎలా ఉంటుందోఅర్ధం చేసుకోవచ్చు. విదేశాల్లో ఉంటున్నతెలుగువారు మాతృభాషను, మాతృదేశాన్ని ఎంతగాఅభిమానిస్తున్నారోరాజకీయ నాయకులను అంతగా ద్వేషిస్తున్నారు. మన రాజకీయవ్యవస్ధకు, విదేశాల్లోని రాజకీయవ్యవస్ధకు మధ్య తేడాను స్వయంగాచూస్తున్నారు కాబట్టే వారికిమన నాయకుల మీద ఏవగింపు కలుగుతోంది. అది సహజం.

అమెరికాకంటే ముందే మనం గోధుమలుపండించాం. సునా విలువను మనమేప్రపంచానికిఇ తెలియజెప్పాం. మూడు వేలఏళ్ళ క్రితమే మనకు సర్జన్లుఉండేవారు. మన యోగా, ఆయుర్వేదకుప్రపంచమంతటా ఆదరణ లభిస్తోంది.అయినా ఈ నాటి మన దుస్ధితికికారణమేమిటి? రాజకీయాలుపరిశుద్ధంగా లేకపోవడమే.మనకు ఇప్పుడు కావలసింది మన దేశానికిసరిపోయే అర్ధిక విధానాలు, మన భూములను సస్య శ్యామలంచేసేశాస్త్రవేత్తలు, మన జనంలో మానవతావిలువలను పెంపొందించే గురువులు, మనచెట్టూ చేమనుకాలుష్యం నుంచి రక్షించే పర్యావరణవేత్తలు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X