• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టిడిపిలో భావదారిద్య్రం

By Staff
|

Chandra Babu Naiduహైదరాబాద్‌:తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి ఇప్పుడు కాళ్ళూచేతులూ ఆడనిపరిస్ధితి నెలకొంది. మునిసిపల్‌ ఎన్నికల్లోఘోర పరాజయం ఒక్కటే దానికి కారణంకాదు. తెలుగుదేశం పార్టీలో నెలకొన్న భావదారిద్య్రం ఆయనను ఎక్కువగా బాధిస్తోంది.పార్టీని పునరుజ్జీవింపజేయడానికి ఆయనపొలిట్‌బ్యూరో సభ్యులను సలహాలు అడగగాఎవరికి వారు పార్టీలోని తమ ప్రత్యర్ధులమీద పరోక్ష విమర్శలు చేశారు. అంతేగానీ కుండబద్ధలు కొట్టినట్టు ఎవరూ మాట్లాడలేదు. తొమ్మిదేళ్ళపాటు అధికార అమృతం తాగిన వారికి గతఏడాదిన్నరగా ఏమీ తోచడం లేదు. కొత్తఆలోచనలు రావడం లేదు. కార్పొరేట్‌సంస్ధల తరహాలో నాలెడ్జి బేస్‌గాతెలుగుదేశం పార్టీని అభివృద్ధి చేయాలనుకునేచంద్రబాబు నాయుడుకు పార్టీ శ్రేణుల్లో ఆలోచనారాహిత్యం కలవరం కలిగిస్తోంది.ఇటీవల ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో ఆయన పెద్దగామాట్లాడకుండా వేదాంతధోరణిలో కన్పించారు.

తెలుగుదేశంపార్టీలో మేధో సంపత్తి లేదని చెప్పడంలేదు. ఆ పరిమిత మేధో వనరులుతొమ్మిదేళ్ళ అధికారం మత్తులోఆవిరైపోయాయని చెప్పాలి. కాస్త బుర్ర ఉన్ననాయకులు ఎవరికి వారు ఇతరులుసంపాదించుకున్న దానిపై ఆసూయలుపెంచుకుని పాజిటివ్‌ థింకింగ్‌నుకోల్పోయినట్టు కనిపిస్తోంది. టిడిపి సీనియర్‌నాయకుడు ఉమ్మారెడ్డివెంకటేశ్వర్లుపై అనేక సామాజికవర్గాలకు చెందిన టిడిపి నాయకులకుతీవ్రమైన వ్యతిరేకత ఉంది. సినిమాహీరో చిరంజీవి ద్వారా తమ సామాజికవర్గానికి చెందిన వారందరినీ టిడిపివైపు తిప్పుతానని ప్రగల్భాలు పలికినవృద్ధ ప్రొఫెసర్‌ ఉమ్మారెడ్డి ఏమీ చేయలేకపోయారు. ఆవిషయంలో చంద్రబాబు నాయుడికి కూడా అసంతృప్తిఉన్నప్పటికీ ఉమ్మారెడ్డి వయసును,విధేయతను దృష్టిలో పెట్టుకుని ఆయనఏమీ అనలేక పోతున్నారు.

1989 ఎన్నికల్లోటిడిపి ఓడిపోయినా 1994 నాటికి ఎన్టీరామారావు మళ్ళీ ఆపార్టీకిఘనవిజయం తెచ్చి పెట్టగలిగారు. ఆయనఅన్ని వర్గాలను కలుపుకుని పోవడం,కాంగ్రెస్‌లో ఒక కులం వారికి మాత్రమే ప్రాధాన్యముంటుందన్న సంకేతాన్నిప్రజలకు పంపడం, ఆయన ప్రజాకర్షణశక్తి- ఇవన్నీ కలిసి ఆ నాడు టిడిపి పునర్విజయానికిదోహదం చేశాయి. చంద్రబాబు నాయుడంటే ఇప్పటికీచదువుకున్న వారికి,యువతరానికి సదభిప్రాయం ఉంది.రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ముందు చూపుతో వ్యవహరించి గ్రామీణసామాన్యులను దూరం చేసుకున్నారు. చంద్రబాబునాయుడు మరో ఏడాది వరకుఎక్కువ మాట్లాడకుండా ఆ తర్వాతతాను చేసిన తప్పులను హుందాగాఒప్పుకోవాలి. పార్టీని మళ్ళీ సామాన్యులకు దగ్గరచేసి, ఆ సంకేతం అందరికీఅందేలా చూడాలి. తన అనుకున్నపత్రికలను దూరంగా పెట్టాలి.ఎందుకంటే ఆ పత్రికలే తప్పుడు భాష్యాలతోఆయనను ములగచెట్టు మీద కూర్చోబెడుతున్నాయి. జమ్మిచెట్టును ఆశ్రయించిన వారు విజయం సాధించారు కానీమునగచెట్టును నమ్ముకున్న వారుఎప్పుడు బాగు పడ్డారు? ప్రజల కోసం, ప్రగతికోసం తెలుగుదేశం అని మళ్ళీసగర్వంగా చెప్పుకోగలిగిన నాడు మళ్ళీ ఆపార్టీకి వెలుగు వస్తుంది. కానీ డబ్బుతోఏదైనా చేయగలమన్న ధీమాతో చంద్రబాబునాయుడు టిడిపి నాయకులందరినీ సంపన్నులనుచేశారు. వారు ఆర్ధికంగా బాగుంటే పార్టీపరిపుష్టమవుతుందని ఆయన భ్రమించారు.ఆచరణలో జరిగింది మరొకటి.వారికి పార్టీ సిద్ధాంతాలు మినహా అనీవంటబట్టాయి. రాజకీయాల్లోసంపాదించుకున్న వాటిని ఇతరవ్యాపారాలకు తరలించి, వారు అక్కడ దృష్టినిలిపారు. ఏమైనా ఇప్పుడు టిడిపికికావలసింది మునగ చెట్టు ఎక్కించేపత్రికలు కాదు, వంది మాగధులుకాదు, కాయకల్ప చికిత్స జరగాలి. సమూలమార్పులు రావాలి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more